ఫ్యాన్ గాలి తెలిసి ఏడాది పూర్తి అయ్యింది
ఉభయగోదావరి జిల్లాలు వైసిపి వైపే ఉన్నాయని చాటి చెప్పింది ఆ చారిత్రక సంఘటన. ఏడాది క్రితం అధికార తెలుగుదేశం పార్టీకి ఆ దృశ్యం ప్రమాద ఘంటికలు మారుమ్రోగించిన [more]
ఉభయగోదావరి జిల్లాలు వైసిపి వైపే ఉన్నాయని చాటి చెప్పింది ఆ చారిత్రక సంఘటన. ఏడాది క్రితం అధికార తెలుగుదేశం పార్టీకి ఆ దృశ్యం ప్రమాద ఘంటికలు మారుమ్రోగించిన [more]
ఉభయగోదావరి జిల్లాలు వైసిపి వైపే ఉన్నాయని చాటి చెప్పింది ఆ చారిత్రక సంఘటన. ఏడాది క్రితం అధికార తెలుగుదేశం పార్టీకి ఆ దృశ్యం ప్రమాద ఘంటికలు మారుమ్రోగించిన అర్ధం కాలేదు. అదే వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల్లోని చారిత్రక రోడ్ కం రైలు వంతెనపై నిర్వహించిన పాదయాత్ర. నాలుగున్నర కిలోమీటర్ల పొడవున వున్న ఈ వారధి మొత్తం ఇసుకేస్తే రాలనంత జన ప్రభంజనం గోదావరి వరదలా జగన్ కి అఖండ స్వాగతం పలికింది. గత జూన్ 12 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లోకి వైఎస్ జగన్ అడుగుపెట్టిన తీరు ఒక అద్భుత రికార్డ్ గా నిలిచింది. ఆయన కోసం వచ్చిన జనంతో వారధి షేక్ అయ్యింది అంటే జనప్రవాహం ఏ రీతిలో సాగిందో చెప్పనలవి కాదు.
ఫ్యాన్ గాలి అప్పుడే తెలిసింది ….
రాయలసీమ లో జగన్ కి సహజంగానే జన నీరాజనం పాదయాత్రలో పట్టారు ప్రజలు. ఆ తరువాత కోస్తా ఆంధ్ర లో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా కూడా అనూహ్యంగా వైసిపి చీఫ్ కి మద్దత్తు లభించింది. ఇక గత ఎన్నికల్లో పూర్తిగా వైసిపి దెబ్బయిపోయిన గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని విపక్ష పార్టీ ఆందోళన చెందింది కూడా. అయితే ఈ జిల్లాలు ఫ్యాన్ గాలి ని చెప్పక చెప్పేశాయి. 2014 ఎన్నికలకు పూర్తి భిన్నంగా ప్రజలు మార్పు కోరుతున్నారన్న సంకేతాలు జగన్ పాదయాత్రలో అడుగడుగునా కనిపించాయి. ఎక్కడికక్కడ జగన్నినాదం మార్మోగింది. జనసేన కు అడ్డాగా గోదావరి జిల్లాలు ఈసారి నిలబడతాయన్న అంచనాలను ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ తలక్రిందులు చేశాయి. జాతీయ సర్వే సంస్థలు పాదయాత్రలో చేసిన సర్వేల్లోనే వైసిపి అత్యధిక స్థానాలతో అధికారంలోకి రాబోతుందని తేలిపోయింది. వారి అంచనాలను నిజం చేస్తూ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో 27 స్థానాలను ఐదు కు ఐదు పార్లమెంట్ స్థానాలు సాధించి అఖండ విజయం అందుకుంది వైసిపి.
సర్కార్ ఇంటిలిజెన్స్ దెబ్బకొట్టింది ….
అధికారంలో వున్న ప్రభుత్వాలకు అనుకూలంగా ఇంటెలిజెన్స్ నివేదికలు ఇవ్వడం పరిపాటే. జగన్ యాత్రలకు జనం నుంచి వస్తున్న అనూహ్య స్పందనలకు విరుద్ధంగా నిఘా విభాగాలు నివేదికలు ఇవ్వడంతో నాటి అధికార టిడిపి అవే నిజమన్న భ్రాంతి లో ఉండిపోయింది. మద్యం, బిర్యానీ, డబ్బుతో యాత్ర ఎక్కడికక్కడ సక్సెస్ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సర్కార్ ను పూర్తిగా కళ్ళు కప్పేశాయి. దీనికి తోడు సొంత పార్టీ కి మద్దత్తు పలికే మీడియా సంస్థలు సైతం జగన్ పాదయాత్ర లను ప్రాంతీయ ఆడిషన్స్ కె పరిమితం చేయడం దృశ్య మాధ్యమాల్లో సైతం అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో బాబు సర్కార్ కి జగన్ యాత్ర అంతా వాపుగానే కనిపించింది. తీరా ఎన్నికల్లో ఫలితాలు చూశాక ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు ఏడాది ముందే ఈ సునామీ ని గుర్తించి ఉంటే కొన్ని సీట్లలో అయినా జాగర్త పడేవారమని వాపోతున్నారు ఇప్పడు.