యడ్డీ మాటకే విలువలేదా….??
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మాటకు విలువ లేకుండా పోయిందా? కేంద్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపికలో యడ్యూరప్ప సూచనలను ఏమీ పట్టించుకోలేదా? కేంద్ర నాయకత్వం [more]
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మాటకు విలువ లేకుండా పోయిందా? కేంద్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపికలో యడ్యూరప్ప సూచనలను ఏమీ పట్టించుకోలేదా? కేంద్ర నాయకత్వం [more]
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మాటకు విలువ లేకుండా పోయిందా? కేంద్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపికలో యడ్యూరప్ప సూచనలను ఏమీ పట్టించుకోలేదా? కేంద్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకోనందునే యడ్డీ ఇప్పుడు కర్ణాటక బీజేపీలో అసంతృప్తిని ఎదుర్కొనాల్సి వస్తోంది. భారతీయ జనతా పార్టీ శ్రేణులు సయితం కేంద్ర నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఫలితాలపై ప్రభావం చూపుతుందా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
చిక్కులు తప్పవా….?
బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానం ఇప్పుడు బీజేపీకి చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది. ఈ స్థానం ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశముంది. బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో బీజేపీని ఓడించలేమన్నది కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీలు అంతర్గతంగా అంగీకరించేవే. అయితే ఇక్కడ అభ్యర్థి ఎంపిక ఇబ్బందిగా మారింది. బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి అనంతకుమార్ ప్రాతినిధ్యం వహించేవారు.
తేజస్వినికి ఇవ్వకుండా……
అనంతకుమార్ అకాల మరణంతో ఆయన భార్య తేజస్విని టిక్కెట్ ఇస్తారని అందరూ భావించారు. ఒక దశలో ఇక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా యువకుడైన సూర్యకు టిక్కెట్ దక్కింది. నిజంగా సూర్య కూడా ఇది ఊహించలేదు. ఆయనకూడా అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉండటంతో షాక్ కు గురయ్యానని ట్వీట్ చేశారు కూడా. అనంతకుమార్ సతీమణి తేజస్వికి ఇవ్వకుండా ఏ మాత్రం పరిచయం లేని యువకుడు సూర్యకు టిక్కెట్ ఎలా దక్కిందన్న దానిపై బీజేపీ నేతలు జుట్టుపీక్కుంటున్నారు.
బీజేపీ క్యాడర్ లోనే…..
నిజానికి సూర్య అభ్యర్థిత్వం యడ్యూరప్పకు కూడా షాక్ కు గురిచేసింది. అయితే అనంతకుమార్ భార్య తేజస్విని తాను సూర్యకు మద్దతిస్తారని ప్రకటించారు. కానీ బీజేపీ శ్రేణులు మాత్రం సూర్య ఎంపికపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో తేజస్వికి అనుకూలంగా, సూర్యకు వ్యతిరేకంగా పోస్టింగ్ లు పెట్టడం కలవరపెడుతోంది. బెంగళూరు దక్షిణ ఓటర్లు తనను ఆదరిస్తారని సూర్య ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కంచుకోట లాంటి సీటు చేజారి పోతుందన్న ఆందోళన యడ్యూరప్పలోనూ ఉండటం విశేషం. మొత్తం మీద బీజేపీ శ్రేణుల్లో మాత్రం యడ్యూరప్ప మాటకు విలువ లేకుండా పోయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
- Tags
- amith shah
- b.s. yadurppa
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- ఠమితౠషా
- à°à°°à±à°£à°¾à°à°
- à°à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿
- à°à°¨à°¤à°¾à°¦à°³à± à°à°¸à±
- à°¦à±à°µà±à°à±à°¡
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- బి.à°à°¸à±.యడà±à°¯à±à°°à°ªà±à°ª
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- రాహà±à°²à± à°à°¾à°à°§à±
- సిదà±à°§à°°à°¾à°®à°¯à±à°¯