టార్గెట్ యరపతినేని.. ఓ ఎంపీ జోక్యంతో సీన్ రివర్స్
రాజకీయాల్లో శాశ్వత శతృవులు-శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని, కేవలం రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని అంటారు. కానీ, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన రాజకీయాల్లో మాత్రం [more]
రాజకీయాల్లో శాశ్వత శతృవులు-శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని, కేవలం రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని అంటారు. కానీ, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన రాజకీయాల్లో మాత్రం [more]
రాజకీయాల్లో శాశ్వత శతృవులు-శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని, కేవలం రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని అంటారు. కానీ, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన రాజకీయాల్లో మాత్రం శతృవులే ఎక్కువగా ఉంటారు. అందుకే ఇక్కడ ప్రత్యర్థులు కత్తులు దూసుకుంటూ ఉంటారు. తన నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు గతంలో గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు.. వైసీపీ నేతలతో ఢీ అంటే ఢీ అనేలా పోరాడారు. వైసీపీ నేతలతోనే కాకుండా ఏకంగా వైసీ పీ అధినేత జగన్ కు చెందిన సరస్వతీ భూముల వ్యవహారంలో కూడా యరపతినేని భారీ రేంజ్లో పోరు సాగించారు.
ఆత్మరక్షణలో పడినా…..
దీంతో వైసీపీ నాయకులు టార్గెట్ యరపతినేని శ్రీనివాసరావు అస్త్రం ప్రయోగించారు. గురజాల నియోజకవర్గంలోని గనుల నుంచి లేటరైట్ ను అక్రమంగా తొవ్వేసుకున్నారని, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కూడా కట్ట కుండా వందల కోట్లు వెనుకేసుకున్నాడని పేర్కొంటూ.. ఏకంగా హైకోర్టు వెళ్లడం తెలిసింది. ఈ పరిణామం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అయినా కూడా వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న సమయం లోనూ దీనిపై గట్టిగానే పోరాటం చేశారు. ఏకంగా ఈ కేసులో హైకోర్టు జోక్యం చేసుకుని.. గనుల విషయంలో ఏం జరిగిందనేది తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ పరిణామం.. నిజంగానే యరపతినేని శ్రీనివాసరావు వర్గాన్ని మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న టీడీపీని కూడా ఆత్మరక్షణలో పడేసింది.
అరెస్ట్ చేస్తారంటూ…
ఇంకేముంది.. సీబీఐ దూకుడు పెంచడం ఖాయమని, యరపతినేని శ్రీనివాసరావు అరెస్టు ఖాయం.. మొత్తం బండారం అంతా బట్టబయలు అవుతుంది.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా మొట్టి కాయలు పడతాయని వైసీపీ నాయకులు భావించారు. నిజానికి ఈ కేసు సీబీఐకి అప్పగించిన తర్వాత యరపతినేని అనూహ్యం గా సైలెంట్ అయ్యారు. అప్పటి వరకు అంతో ఇంతో వైసీపీపై విరుచుకుపడిన యరపతినేని శ్రీనివాసరావు సరస్వతీ భూముల వ్యవహారం తేలే వరకు నిద్ర పోనని చెప్పిన యరపతినేని సైలెంట్ అయ్యారు. ఇక, సీబీఐ కూడా ఈ కేసు విచారణ ప్రారంభించింది.
బీజేపీ ఎంపీతో….
ఇంత వరకు అంతా బాగానే ఉందని అనిపించినా.. కేసు తీవ్రంగా ఉండడం, నిజాలు వెలుగు చూస్తే.. ప్రమాదమని గ్రహించిన యరపతినేని శ్రీనివాసరావు వ్యూహాత్మకంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఓ ఎంపీతో చక్రం తిప్పినట్టు వైసీపీలో చర్చ సాగుతోంది. ఆయన ఎంట్రీతో ఈ కేసు విచారణ వేగం తగ్గుముఖం పట్టిందని, అదే సమయంలో వైసీపీలో కొందరు కీలక నేతలకు జరగాల్సిన ప్రయోజనం జరిగిపోయిందని అంటు న్నారు. ఇది నిజమా? కాదా? భారీగా డబ్బుల మూటలు చేతులు మారాయా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే..చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన యరపతినేని శ్రీనివాసరావు వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఎక్కడా ఆయన సరస్వతీ భూముల విషయం ప్రస్తావించకుండా. అలాగని వైసీపీ ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించకుండా.. చాలా నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఏదో జరిగిందని వైసీపీలోని గుంటూరు నాయకులు చర్చించుకోవడం గమనార్హం. మరి ఏమై ఉంటుందనేది వేచి చూడాల్సిందే.