ఎత్తేయడం ఖాయమేనటగా…!!
అన్న క్యాంటీన్లు ఎత్తేసేందుకు వైసీపీ సర్కార్ సిధ్ధపడుతోంది. ఆ కాంట్రాక్ట్ ని పునరుద్ధరించకపోవడమే ఇందుకు కారణం. అన్న క్యాంటీన్లను గత ఏడాది చంద్రబాబు సర్కార్ ఆర్భాటంగా ప్రవేశపెట్టింది. [more]
అన్న క్యాంటీన్లు ఎత్తేసేందుకు వైసీపీ సర్కార్ సిధ్ధపడుతోంది. ఆ కాంట్రాక్ట్ ని పునరుద్ధరించకపోవడమే ఇందుకు కారణం. అన్న క్యాంటీన్లను గత ఏడాది చంద్రబాబు సర్కార్ ఆర్భాటంగా ప్రవేశపెట్టింది. [more]
అన్న క్యాంటీన్లు ఎత్తేసేందుకు వైసీపీ సర్కార్ సిధ్ధపడుతోంది. ఆ కాంట్రాక్ట్ ని పునరుద్ధరించకపోవడమే ఇందుకు కారణం. అన్న క్యాంటీన్లను గత ఏడాది చంద్రబాబు సర్కార్ ఆర్భాటంగా ప్రవేశపెట్టింది. ఎపుడో 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఎన్నికల ఏడాది కాబట్టి గుర్తుకువచ్చి మరీ అన్న గారి పేరుతో పసుపు రంగు పూతతో ప్రజా ధనంతో ఓట్లు కొనుగోలు ప్రొగ్రాం గా ఈ అన్న క్యాంటీన్లను మొదలెట్టారు. ఈ అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉంటాయి. ప్రతీదీ అయిదు రూపాయలు వంతున అందించడమే ఈ పధకం ఉద్దేశ్యం. ఇక ఈ సబ్సిడీ అహారం మీద ఒక్కో భోజనం ప్లేట్ మీద 58 రూపాయల అదనపు భారం పడుతుంది. దానిని ప్రభుత్వం భరిస్తోంది. ఈ విధంగా ఏడాదికి 350 కోట్ల పన్నుల ధనం పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భరించాల్సివచ్చింది.
వృధా ఖర్చే….
ఈ అన్న క్యాంటీన్ల ఏర్పాటులోనే పెద్ద గోల్ మాల్ జరిగింది. ప్రభుత్వ స్థలాలను టీడీపీ తమ్ముళ్ళు అన్న క్యాంటీన్ల కోసం తీసుకున్నారు. వారే దగ్గరుండి కధ నడిపించారు. ఒక్కో చోట క్యాంటీన్ నిర్మాణం కోసం 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వాటిని పూర్తిగా పార్టీ కోసం వాడుకునేందుకు వీలుగా తమ్ముళ్లు అట్టేపెట్టుకున్నారు. ఈ క్యాంటీన్లలో నిజమైన అభాగ్యులు, పేదలు తినేందుకు అవకాశం లేదు. దీని టైమింగులు వేరు, దాంతో ఒకందుకు అనుకుంటే మరోకందుకు అన్నట్లుగా అన్న క్యాంటీన్లలో తినే వారు డబ్బున్న వారు, సోమరిపోతులు గా కనిపించేవారు. లక్ష రూపాయల టూ వీలర్, పాతిక వేల రూపాయల సెల్ ఫోన్ పట్టుకుని మరీ అన్న క్యాంటీన్ భోజనం కోసం వచ్చేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. దాంతో ప్రభుత్వం పేదల కోసం అనుకున్నదంతా పక్కకు పోతోందని తేలిపోయింది.
పొదుపు మంత్రంలో భాగమేనా….
అన్న క్యాంటీన్ల వ్యవస్థను ఎత్తివేయాలన్నది వైసీపీ సర్కార్ మొదటి నుంచి అనుకున్నదే. ఎందుకంటే దీని వల్ల జరిగేది ఏదీ లేదన్నది అందరికీ తెలిసిందే. పైగా వందల కోట్ల ప్రజా ధనం వృధా. ఆ మాటకు వస్తే చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కూడా అన్న క్యాంటీన్లను తొలగించేవారేనని కూడా అంటున్నారు. దండగమారి పధకంగా దీన్ని కొంతమంది టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇక అన్న క్యాంటీన్లను అక్షయ పాత్ర అనే సంస్థకు అప్పగించారు. ఏడాది కాంట్రాక్ట్ కూడా జూలై నెలతో ముగిసిపోవడంతో అన్న క్యాంటీన్ల కధ ఇక కంచికేనని మాట వినిపిస్తోంది. దీని కంటే మెరుగైన విధానాలను తమ ప్రభుత్వం తీసుకువస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. కాని మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం అన్న క్యాంటిన్లను ఎత్తివేసేది లేదని చెబుతున్నారు. కానీ అన్న క్యాంటిన్ల పేరు మాత్రం మారడం ఖాయమంటున్నారు.