మా మంత్రిగారికి నోరుంది కానీ.. సబ్జెక్టు లేదబ్బా
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంధిలో ఉండే ఓ జిల్లాకు చెందిన మంత్రిపై అక్కడి వైసీపీ నేతలు ఆసక్తికర చర్చ లేవనెత్తుతున్నారు. వైసీపీలో కీలక నేత, పార్టీలో ఒకరకంగా [more]
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంధిలో ఉండే ఓ జిల్లాకు చెందిన మంత్రిపై అక్కడి వైసీపీ నేతలు ఆసక్తికర చర్చ లేవనెత్తుతున్నారు. వైసీపీలో కీలక నేత, పార్టీలో ఒకరకంగా [more]
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సంధిలో ఉండే ఓ జిల్లాకు చెందిన మంత్రిపై అక్కడి వైసీపీ నేతలు ఆసక్తికర చర్చ లేవనెత్తుతున్నారు. వైసీపీలో కీలక నేత, పార్టీలో ఒకరకంగా ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నాయకుడు.. కావడంతో.. జగన్ తన కేబినెట్లో అవకాశం కల్పించారు. అత్యంత కీలకమైన శాఖను కూడా అప్పగించారు. ఇప్పుడు ఏడాది కాలం పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంలో సదరు నాయకుడు ఏం చే సింది ఏంటి? ఏం సాధించారు? అంటే.. పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ లేదని అంటున్నారు ఈ జిల్లా ప్రజలు. జిల్లాపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారనే అపప్రధను మూటగట్టుకుంటున్నారని చె బుతున్నారు.
ఫైర్ బ్రాండ్ గా……
పార్టీలోను, జిల్లాలోనూ ఆయనకు ప్రత్యేకంగా.. ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. అంతేకాదు, ఎన్నికల సమయంలో కూడా ఢీ అంటే.. ఢీ అనే వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారట. బీసీ వర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ.. స్థానికంగా ఉన్న ఓ బలమైన వర్గాన్ని సైతం తన కనుసైగల్లో నడిపిస్తున్నారని అంటున్నారు. నిజానికి ఎన్నికల సమయంలో పరిస్థితి ఎలా ఉన్నా.. సదరు నాయకుడు మంత్రి అయ్యాక.. మాత్రం మొత్తం జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో ఉండేలా చేసుకున్నారని అంటున్నారు. అంతేకాదు.. ఓ కీలక వర్గం మధ్య ఆధిపత్య పోరు జరిగేలా జుట్టు జుట్టు ముడి వేసుకునేలా జరుగుతున్న పరిణామాల వెనుక కూడా సదరు నేత ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సబ్జెక్ట్ లేదంటూ….
అయితే, తాజాగా జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికర విషయం వినిపిస్తోంది. “మా మంత్రిగారి దూకుడెక్కువే కానబ్బా.. సబ్జెక్ట్ లేదు“ అని వైసీపీ నేతలే చెవులు కొరుక్కొంటుండడం గమనార్హం. “ఏ విషయంపైనైనా కేవలం విమర్శలకు, తొడకొట్టడాలకు మాత్రమే మా మంత్రిగారు ముందుంటారు. సవాళ్లు చేస్తారు.. తర్వా త.. సబ్జెక్ట్ కోసం పరుగులు పెడతారు. ఆయన దూకుడు ఏమో.. కానీ, అధికారులు మాత్రం ఆయన వల్ల బెంబేలెత్తుతున్నారు. మాక్కూడా మనశ్శాంతి లేదబ్బా!“ అని ఈ జిల్లా వైసీపీ నాయకులు చర్చించుకోవడం గమనార్హం.
జగన్ కు సన్నిహితంగా…..
ఇదిలావుంటే, పార్టీలోని కీలక సామాజికవర్గం మొత్తంగా ఈయనను టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం సదరు మంత్రి సీఎంకు అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉండడంతో పాటు కీలక శాఖా మంత్రిగా ఉండడంతో సదరు వర్గం కిమ్మనడం లేదు. ఆ వర్గం నుంచి మంత్రులుగా ఉన్న వారిలో ఐదారుగురు ఎమ్మెల్యేలు సదరు మంత్రిపై గుర్రుగా ఉన్నారు. వీరంతా అదను చూసుకుని సదరు మంత్రిపై రివేంజ్ తీర్చుకోవాలని కసితో రగులుతున్నారు. మొత్తానికి మంత్రి విషయం హాట్‌హాట్‌గా ఉండడం గమనార్హం.