సడెన్ గా ఇలా సౌండ్ చేస్తున్నారే?
జగన్ పాలనలో విలువైన రెండేళ్ళ కాలం కరిగింది. అచ్చంగా మరో రెండేళ్ళు మిగిలి ఉంది అనుకోవాలి. ఎందుకంటే చివరి ఏడాది ఎన్నికల వ్యూహాలతో సాగిపోతుంది కాబట్టి. అంటే [more]
జగన్ పాలనలో విలువైన రెండేళ్ళ కాలం కరిగింది. అచ్చంగా మరో రెండేళ్ళు మిగిలి ఉంది అనుకోవాలి. ఎందుకంటే చివరి ఏడాది ఎన్నికల వ్యూహాలతో సాగిపోతుంది కాబట్టి. అంటే [more]
జగన్ పాలనలో విలువైన రెండేళ్ళ కాలం కరిగింది. అచ్చంగా మరో రెండేళ్ళు మిగిలి ఉంది అనుకోవాలి. ఎందుకంటే చివరి ఏడాది ఎన్నికల వ్యూహాలతో సాగిపోతుంది కాబట్టి. అంటే సగం దూరానికి పాలన వచ్చేసింది. జగన్ అనుకున్న వాటిలో అతి ముఖ్యమైన మూడు రాజధానుల అంశం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. దీంతో మూడూ లేదూ వైసీపీకి ఆ మూడ్ కూడా లేదు అంటూ విపక్షాల నుంచి మెల్లగా ప్రచారం మొదలైంది. దానికి తోడు విశ్లేషణలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. వచ్చే ఎన్నికలను జగన్ అమరావతి రాజధానిలో ఉంటూనే ఎదుర్కొంటారని కూడా రాజకీయ పండితులు జోస్యం చెప్పేస్తున్నారు.
ఏమీ కాకుండానే …?
విశాఖ పాలనా రాజధాని ఎక్కడ ఉంది అంటే కోర్టు పరిధిలో అని చెప్పుకోవాలి. జగన్ సర్కార్ ఏడాది క్రితం చట్టం అయితే చేసింది కానీ రాజధానిని మాత్రం మార్చలేకపోయింది. దాంతో వైసీపీ నేతలలోనే అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఇంకో వైపు హై కోర్టుకు కొత్త ప్రధాన న్యాయ మూర్తి రావడంతో విచారణ మళ్లీ మొదటి నుంచి జరుగుతుంది అంటున్నారు. అది కూడా తీర్పు వచ్చేసరికి ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియదు. దాంతో ఇవన్నీ జరిగేసరికి జగన్ సర్కార్ మూడేళ్ళు కూడా పూర్తి చేసుకుంటుంది అంటున్నారు. మరి ఇలాంటి నేపధ్యంలో విశాఖకు ఏ క్షణమైనా రాజధాని తరలి వస్తుందని అటు మంత్రి బొత్స ఇటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకకాలంలో పెద్ద గొంతు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
ఆ లాజిక్ తోనే …?
సీఎం ఎక్కడ నుంచి పాలించాలి అన్నది రాజ్యాంగంలో చెప్పలేదు. అలాగే రాజధాని అన్న దానికి సరైన నిర్వచనం లేదు. పాలకుడు ఎక్కడ ఉంటే అదే రాజధాని అని చెబుతారు. ఇపుడు ఈ లాజిక్ తోనే వైసీపీ నెతలు విశాఖకు రాజధాని తరలివస్తుంది అని చెబుతున్నారు అనుకోవాలి. ఈ విషయం మీద క్లారిటీ ఇస్తూనే విజయసాయిరెడ్డి మాట్లాడారు డేట్ అడగవద్దు అంటూనే రాజధాని తరలిరావడం ఖాయమని హింట్ ఇచ్చేశారు. బొత్స అయితే క్షణమో ఘడియో అంటూ ఇంకా తొందర పెట్టేస్తున్నారు. అంటే వైసీపీ సర్కార్ పెద్దలు అతి పెద్ద వ్యూహంతోనే సడెన్ గా ఈ వ్యాఖ్యలు చేయించారు అనుకోవాలి.
కేరాఫ్ వైజాగ్ …?
ఇక మీదట జగన్ కేరాఫ్ వైజాగ్ అన్న మాట నిజం అవుతుంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. సీఎం ఆఫీస్ వరకూ రావడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవని అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ విశాఖలో రెడీ చేసి పెట్టారు. కరోనా తగ్గాక మంచి ముహూర్తం చూసుకుని జగన్ తానుగా వచ్చేస్తారు అన్నదే వైసీపీ నేతల మాటల వెనక సారాంశం అంటున్నారు. సచివాలయం రావాలి అంటే కోర్టు తీర్పు అవసరం. అలాగే కీలకమైన విభాగాలు రావాలి అన్నా కూడా కుదిరేది లేదు. అయితే సీఎం కనుక విశాఖకు వచ్చేస్తే టెంపరరీగానైనా కొన్ని విభాగాలు షిఫ్ట్ అవుతాయా అన్నదే చూడాలి. ఏది ఏమైనా జగన్ పట్టుదల చూస్తూంటే ఈ ఏడాదిని అసలు పోనీయకూడదు అన్నదే కనిపిస్తోంది. అందుకే ఉరమని పిడుగులా ఇలా వైసీపీ నేతలు భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు అని చెబుతున్నారు.