రాయచోటిలో రాజుకుందిగా
ఆయన చీఫ్ విప్. అన్ని పార్టీల ఎమ్మెల్యేలలో ఏకాభిప్రాయం తీసుకురావడమే ఆయన బాధ్యత. అలాగే సొంత పార్టీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు వస్తే వెంటనే దానికి రియాక్ట్ అవ్వాల్సిన [more]
ఆయన చీఫ్ విప్. అన్ని పార్టీల ఎమ్మెల్యేలలో ఏకాభిప్రాయం తీసుకురావడమే ఆయన బాధ్యత. అలాగే సొంత పార్టీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు వస్తే వెంటనే దానికి రియాక్ట్ అవ్వాల్సిన [more]
ఆయన చీఫ్ విప్. అన్ని పార్టీల ఎమ్మెల్యేలలో ఏకాభిప్రాయం తీసుకురావడమే ఆయన బాధ్యత. అలాగే సొంత పార్టీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు వస్తే వెంటనే దానికి రియాక్ట్ అవ్వాల్సిన పని కూడా ఆయనదే. కానీ ఆయన సొంత నియోజకవర్గంలోని పార్టీలోనే చక్కదిద్దుకోలేకపోతున్నారు. ఆయనే ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి రాయచోట ినియోజకవర్గంలోని సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. శ్రీకాంత్ రెడ్డిని ఒక యువనేత ఢీ అంటే ఢీ అంటున్నారు.
నాలుగు సార్లు గెలిచి…..
రాయచోటి నియోజకవర్గం నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి నాలుగుసార్లు విజయాలు సాధించారు. 2009, 2012 ఉపఎన్నిక, 2014, 2019 ఎన్నికల్లో వరస గెలుపులతో రాయచోటిలో తమకు ఎదురేలేదని నిరూపించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత శ్రీకాంత్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అనుకున్నా సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి జగన్ ఇవ్వలేక పోయారు. చివరకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని శ్రీకాంత్ రెడ్డికి కట్టబెట్టారు.
ఇద్దరి మధ్య…..
అయితే గతకొంతకాలంగా రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డికి, మరో యువనేత రాంప్రసాద్ రెడ్డి కి మధ్య గతకొంతకాలంగా పొసగడం లేదు. ఇటీవల వీరి మధ్య విభేధాలు తారా స్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి. రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడని చెబుతారు. దీంతో ఆయన శ్రీకాంత్ రెడ్డిని లెక్క చేయడం లేదు. సహజంగా ఎమ్మెల్యే చెప్పినట్లే అధికారులు నడుచుకుంటారు. కానీ రాంప్రసాద్ రెడ్డి మాత్రం తాను చెప్పిందే చేయాలంటారు. దీంతో ఎమ్మెల్యే అధికారులకు కూడా రాంప్రసాద్ రెడ్డి సిఫార్సులను పట్టించుకోవద్దని స్పష్టం చేయడంతో రాంప్రసాద్ రెడ్డి మరింత ఆగ్రహంతో ఉన్నారు.
కళాశాల స్థల వివాదం….
ఈ నేపథ్యంలోనే రాయచోటిలోని జూనియర్ కళశాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదన పెట్టడంతో అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విలువైన స్థలాన్ని ఎలా ఇస్తారని కొందరు ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనకలకు రాంప్రసాద్ రెడ్డి నేతృత్వం వహిస్తుండటం విశేషం. కళాశాల స్థలాన్ని కాపాడుకోవడం కోసం ఆమరణ దీక్షకు దిగడానికి సిద్ధమయ్యారు. తనకు తలనొప్పిగా తయారైన రాంప్రసాద్ రెడ్డిపై ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి జగన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా రాంప్రసాద్ రెడ్డి మాత్రం శ్రీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాలు దువ్వుతూనే ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి కూడా రాంప్రసాద్ రెడ్డి సొంత మండలం చిన్నమండెంలో వేరే వారిని ప్రోత్సహిస్తున్నారు. మొత్తం మీద రాయచోటి వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయనే చెప్పాలి.