టీడీపీకి బంపర్ లాటరీ తగిలినట్లేనా?
రాజకీయాల్లో పాశుపతాస్రం లాంటిది సానుభూతి అస్త్రం. అది జనాలకు కనెక్ట్ కావాలే కానీ కచ్చితంగా టార్గెట్ ని రీచ్ అయి తీరుతుంది. ఇపుడు ఏపీలో అర్జంట్ గా [more]
రాజకీయాల్లో పాశుపతాస్రం లాంటిది సానుభూతి అస్త్రం. అది జనాలకు కనెక్ట్ కావాలే కానీ కచ్చితంగా టార్గెట్ ని రీచ్ అయి తీరుతుంది. ఇపుడు ఏపీలో అర్జంట్ గా [more]
రాజకీయాల్లో పాశుపతాస్రం లాంటిది సానుభూతి అస్త్రం. అది జనాలకు కనెక్ట్ కావాలే కానీ కచ్చితంగా టార్గెట్ ని రీచ్ అయి తీరుతుంది. ఇపుడు ఏపీలో అర్జంట్ గా కన్నీటి కడవలు ఎవరిని కావాలి అంటే తెలుగు తమ్ముళ్ళకే అన్న మాట వినిపిస్తోంది. మమ్మల్ని వేధిస్తున్నారు, సాధిస్తున్నారు బాబోయ్ అంటూ వీరంగం వేయడానికి చేతిలు అరదండాలు కావాలి. అవి కనుక తగిలించుకుంటే రేపటి రోజున జనాలు దండలు వేసి మరీ దండాలు పెడతారు, విజయాన్ని చేకూర్చి అధికారమూ అప్పగిస్తారు. అన్నీ వ్యూహాలు తుస్సుమన్నాక ఇపుడు తెలుగుదేశానికి ఇదే అవసరం పడుతోందిట.
బాబులు రెడీ…
చంద్రబాబు మీద కర్నూలు లో కేసు పెట్టారు, చినబాబు మీద మరో కేసు పెట్టారు. దీనికి ముందు టీడీపీ నాయకులను వరసగా అరెస్ట్ చేస్తున్నారు. ఆనాడే మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి చెప్పారు. మా మీద ఈ రోజు జరుగుతున్న రాజకీయ దాడులు రేపు మీ దగ్గరకూ వస్తాయని. ఇపుడు అదే జరిగేలా ఉంది. సరే చంద్రబాబు, చినబాబులకు ఏమైనా భయమా అంటే రెండేళ్ల తరువాత ప్రజాదరణ తగ్గిన పార్టీకి బూస్టప్ కావాలంటే అరెస్టులే అచ్చమైన రాజమార్గమని పక్కాగా తలపోస్తున్నారుట. అందుకే మమ్మల్ని ఎన్ని సార్లు అయినా అరెస్ట్ చేసుకో జగన్ రెడ్డీ అంటూ చినబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. చంద్రబాబు అయితే కేసులు పెట్టుకోండి మీ ఇష్టమంటున్నారు.
కోరినదే అలా ….?
రోగి కోరినది వైద్యుడు ఇచ్చినదీ ఒక్కటే అయినపుడు ఆ ఉత్సాహమే వేరు. ఆనందమే వేరు. ఇపుడు టీడీపీకి భారీ హైప్ కావాలి. నలుగురు నోళ్ళలో నానాలి. ఏదో రకంగా ఫ్రీ పబ్లిసిటీ కూడా కావాలి. అందుకే ప్రతిపక్షం బాధ్యతలు నిర్వహణ, నిర్మాణాత్మక సూచనలు వంటివి పక్కన పెట్టి మరీ తొడ కొట్టి సవాల్ చేస్తున్నారు. వైసీపీ సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇక్కడే వైసీపీ కూడా అడ్డంగా దొరుకుతోంది. చాన్స్ వచ్చింది కదా అని కేసులు పెడుతోంది. అయితే ఈ కేసులే టీడీపీ దూసుకురావడానికి మేలి మలుపులు అని కాస్తా ఆలోచిస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి.
వ్యూహాత్మకంగానే…?
ఎన్ని తిడుతున్నా వింటూ కూర్చోవడం పరమాత్ముడి వల్ల కూడా కాదు, ఇక ఏపీలో చూస్తే విచిత్రమైన పరిస్థితి ఉంది. బలమైన మీడియా టీడీపీకి దన్నుగా ఉంది. అక్కడ జగన్ సర్కార్ మీద నిందలూ విమర్శలే చేస్తారు. దానికి తోడు అన్నట్లుగా టీడీపీ నాయకులను హైలెట్ చేస్తూ సర్కార్ దుమ్ము దులుపుతారు. అనుకూల మీడియా ఎల్లో మీడియా అని ఎంతలా ముద్ర వేసి జనంలోకి వదిలినా కొందరినైనా అనుకూల మీడియా వార్తలు ప్రభావితం చేస్తే కొంప కొల్లేరు అన్నదే వైసీపీ పెద్దల భయం. అందుకే ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. అలా చేసినా లాభమే, ఇలా అయినా పుణ్యమే అన్నట్లుగా టీడీపీ పెద్దల తీరు ఉంది. మొత్తానికి వైసీపీ కాళ్ళలో ముళ్ళు వేసి చెవిలో జోరిగలా మారి తమ్ముళ్ళు శివ తాండవమే చేస్తున్నారు. ఈ ముల్లుని తీయాలంటే మామూలుగా ఆలోచిస్తే కుదరదు, భారీ వ్యూహాలే కావాలి. టెంప్ట్ అయి అరెస్టులకు అధికార పార్టీ తెర లేపిందా టీడీపీకి బంపర్ లాటరీ తగిలినట్లే అంటున్నారు.