రాజు గారి తల కొట్టేసారా… ?
వైసీపీ కోరి మరి ఒక సామాజిక వర్గానికి చెడ్డ అవుతోందా అన్న చర్చ అయితే ఉంది. ఏపీ రాజకీయాలలో రాజులకు ప్రత్యేక స్థానం ఉంది. వారు ముఖ్యమంత్రి [more]
వైసీపీ కోరి మరి ఒక సామాజిక వర్గానికి చెడ్డ అవుతోందా అన్న చర్చ అయితే ఉంది. ఏపీ రాజకీయాలలో రాజులకు ప్రత్యేక స్థానం ఉంది. వారు ముఖ్యమంత్రి [more]
వైసీపీ కోరి మరి ఒక సామాజిక వర్గానికి చెడ్డ అవుతోందా అన్న చర్చ అయితే ఉంది. ఏపీ రాజకీయాలలో రాజులకు ప్రత్యేక స్థానం ఉంది. వారు ముఖ్యమంత్రి పదవిని తప్ప కీలక మంత్రిత్వ శాఖలు ఎన్నో చేశారు. అలాగే రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాజులను సమాదరించింది. అలాగే తెలుగుదేశం కూడా వారిని గుర్తించి గౌరవించింది. కొత్తగా వచ్చిన వైసీపీలో పేరు మోసిన నాయకులు లేరు. ఇక ఉన్న వారిలో నర్సాపురం ఎంపీ రెబెల్ గా మారిపోయారు. దానికి తోడు అన్నట్లుగా విజయనగరం రాజు పూసపాటి అశోక్ గజపతిరాజుతో వివాదం పెట్టుకున్నారు. ఇక మిగిలిన రాజులతో కూడా వైసీపీ ఏలికలు సవ్యంగా వ్యవహరిస్తున్నారా అన్నదే చర్చ.
దిగ్గజ నేతకు అవమానం …?
విశాఖకు రాజకీయ జిల్లా అయిన అనకాపల్లిలో ఆయన దిగ్గజ నేత. వారూ వీరూ కాదు, ఏకంగా ద్రోణంరాజు సత్యనారాయణనే ఢీ కొట్టిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్ తరఫున ఒకసారి, ఇండిపెండెంట్ గా మరోసారి అనకాపల్లి నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలు అయిన ఆ రాజు గారి పేరు దంతులూరి దిలీప్ కుమార్. ఎపుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి చుక్కలు చూపించే దంతులూరి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. అలాంటి పెద్దాయనకు అతి చిన్న పదవి ఇచ్చి వైసీపీ అగ్ర నేతలు అవమానించారని ఆయన అభిమానులే కాదు, ఆయనంటే ఎవరో తెలిసిన వారు కూడా బాధపడుతున్నారు.
ఎవరడిగారని?
ఇపుడు వయసు మీద పడి ఆయన కొంత తగ్గి ఉండవచ్చు. కానీ ఆయన పులిలా రాజకీయాలు చేశారని అంతా చెబుతారు. వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడిగా దిలీప్ కుమార్ మెలిగారు. అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గా తొడగొట్టి మరీ గెలిచిన రాజు గారిని వైసీపీ ప్రభుత్వం క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడాన్ని అనుచరులు అసలు తట్టుకోలేకపోతున్నారు. ఎవరడిగారు ఈ పదవులు అంటూ ఆయన అనుచరులు మండిపోతున్నారు.
కోరి మరీ చెడ్డ…
నామినేటెడ్ పదవుల పంపిణీలో తమకు అన్యాయం జరిగింది అని చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. సీనియర్ నేతల సేవలు ఎలా వాడుకోవాలో వైసీపీ అగ్రనాయకత్వానికి అసలు తెలియడం లేదని కూడా గుస్సా అవుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి నేతలను తెచ్చి కొత్తగా నాయకులు అవుతున్న వారి సరసన పెట్టడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే పార్టీలో ఎవరూ ఉండరని కూడా అంటున్నారు. రాజకీయాల కోసం తమ ప్రతిష్ట కోసం సర్వం పోగొట్టుకున్న దంతులూరి వంటి వారికి ఇస్తే ఏ ఎమ్మెల్సీ పదవో ఇస్తే సబబు అన్న మాట అయితే ఉంది. మరి అసలే వైసీపీ రోజులు బాగాలేక రాజులతో పేచీలు వస్తున్నాయా అన్న చర్చ అయితే పార్టీకిలో ఉంది మరి. దీనిని సరిచేసుకోవాల్సింది అగ్ర నాయకత్వమే.