పార్టీల కంటే లీడర్లే ఇక్కడ మోనార్క్ లు
ఏడాది కావస్తున్నా ఆ నియోజకవర్గంలో సరైన నేత లేరు. టీడీపీని ముందుండి నడిపించే నాయకుడు లేరు. చంద్రబాబు సయితం ఈ నియోజకవర్గాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న టాక్ [more]
ఏడాది కావస్తున్నా ఆ నియోజకవర్గంలో సరైన నేత లేరు. టీడీపీని ముందుండి నడిపించే నాయకుడు లేరు. చంద్రబాబు సయితం ఈ నియోజకవర్గాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న టాక్ [more]
ఏడాది కావస్తున్నా ఆ నియోజకవర్గంలో సరైన నేత లేరు. టీడీపీని ముందుండి నడిపించే నాయకుడు లేరు. చంద్రబాబు సయితం ఈ నియోజకవర్గాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న టాక్ విన్పిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి సరైన లీడర్ లేరు. తోట త్రిమూర్తులు పార్టీని వీడి వెళ్లి ఏడాది అవుతున్నా అందుకు ప్రత్యామ్నాయంగా నేత దొరకకపోవడం సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సాధ్యం కావడం లేదు.
రామచంద్రాపురం నియోజకవర్గంలో…..
ఒక్క నేత పార్టీని వీడి వెళితే వంద మందిని తయారు చేస్తానని చంద్రబాబు తరచూ చెబుతుంటారు. టీడీపీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారు. కానీ రామచంద్రాపురం విషయానికి వచ్చేసరికి అది సాధ్యం కావడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన తోట త్రిమూర్తులు వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో మరొక నేత చంద్రబాబుకు దొరకడం లేదు.
కాపు వర్సెస్ శెట్టిబలిజ….
రామచంద్రాపురం నియోకవర్గం అంటే కాపు వర్సెస్ శెట్టిబలిజ అన్న రీతిలో ఫైట్ సాగేది. తోట త్రిమూర్తులకు టీడీపీ లో మంచి ప్రాధాన్యత దక్కేది. తోట త్రిమూర్తులు కాపు సామాజికవర్గానికి చెందిన నేత కాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణుగోపాల్ లు శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా సాగేది. తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సరైన నేత లేక….
పార్టీ కాకుండా ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగా గెలుపునకు కారణమవుతుందని చెప్పవచ్చు. అందుకే రామచంద్రాపురం నియోజకవర్గంలో పార్టీల కంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇప్పుడు తోట త్రిమూర్తులు పార్టీని వీడి వెళ్లిన తర్వాత రామచంద్రాపురం నియోజకవర్గంలో సరైన నేత చంద్రబాబుకు దొరకడం లేదు. నామమాత్రంగా పెట్టినా అది వృధా అని చంద్రబాబు భావిస్తున్నారు. బలమైన నేత తిరిగి ఎవరో ఒకరు పార్టీలోకి వస్తేనే ఇక్కడ టీడీపీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.