ఆ తీర్పుకి ఏడాది….చిల్ అవుతున్నారు.. థ్రిల్ ఫీలవుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో జనం తీర్పు ఇచ్చి ఏడాది గడిచింది. రెండు పక్షాలు ఖచ్చితంగా ఆ గెలుపోటములు గుర్తు చేసుకుంటాయి. జనం మళ్ళీ తీర్పు ఇవ్వడానికి [more]
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో జనం తీర్పు ఇచ్చి ఏడాది గడిచింది. రెండు పక్షాలు ఖచ్చితంగా ఆ గెలుపోటములు గుర్తు చేసుకుంటాయి. జనం మళ్ళీ తీర్పు ఇవ్వడానికి [more]
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో జనం తీర్పు ఇచ్చి ఏడాది గడిచింది. రెండు పక్షాలు ఖచ్చితంగా ఆ గెలుపోటములు గుర్తు చేసుకుంటాయి. జనం మళ్ళీ తీర్పు ఇవ్వడానికి ఇంకో నాలుగేళ్ళ సమయం ఉంది. ఇప్పుడే తొందరపడి తీర్పు ఇచ్చేయడం కూడా సరికాదు. మంచేదో, చెడేదో జనానికే బాగా తెలుసు. ఏడాది విజయాలను అధికార పక్షం గుర్తు చేసుకుంటే., కోర్టులలో విజయాలను ప్రత్యర్థులు గుర్తు చేసుకుంటారు.
కోర్టు తీర్పులను పక్కన పెడితే…
కోర్టు తీర్పులలో న్యాయాన్యాయాలను పక్కన పెడితే…, ఓ అవాంఛనీయ దూరం మాత్రం పాలనా వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు పెరిగింది. గతంలో న్యాయ వ్యవస్థ ఎప్పుడూ ఇంత క్రియాశీలకంగా లేదు. అవసరమైనప్పుడు కూడా చూసి చూడనట్టు పోయింది. అప్పటి ప్రభుత్వం న్యాయ వ్యవస్థతో ఘర్షణ వైఖరి కోరుకోకపోవడం, లౌక్యంగా వ్యవహరించడం కారణాలు. ఇదంతా సాధారణమే అనుకోవడానికి వీల్లేని చాలా పరిణామాలు రెండు వైపులా చాలా జరిగాయి.
ఎవరి స్టయిల్ వారిదే….
ఈ విషయంలో ఎవరి స్టయిల్ వారిదే….. పర్యవసానాలు తెలిసి ముందుకు వెళ్లడం ద్వారా ప్రత్యర్థులు ఎవరో, వారి బలం ఏమిటో అనుచరులకు తెలుస్తుంది. ఈ పరిణామాలు రెండు వైపులా చీలిపోయి ఉన్న సమాజంలో., మరింత దూరం పెరగడానికి, ఎవరి బలాన్ని వారు పెంచుకోడానికి ఊపయోగపడింది. కోర్టు తీర్పులు ఆదేశాలతో ఎవరో ఒకరు నెగ్గారు, మరొకరు ఓడారు అనుకోడానికి ఏమీ లేదు. జనం అంతా గమనిస్తున్నారు. ఎవరికి వారే గౌరవాన్ని కాపాడుకోవాలి. పనిలో పనిగా ఏడాది విజయాలు ఓ వైపు, ఏడాది కోర్టు తీర్పుల జాబితా మరో వైపు పాఠకుల ముందుకు వచ్చినా, మాస్ట్ హెడ్ లో అక్షింతలు, అభ్యంతరాల కథనాలు వచ్చినా జస్ట్ చిల్… ఇంకా చాలా టైం ఉంది. ఎవరి స్టయిల్ నచ్చుతుందో, నెగ్గుతుందో 2024లో చూద్దాం