యడ్డీ ప్లాన్ వర్కవుట్ అయితే..?
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పదవి చేపట్టిన వెంటనే బలపరీక్షకు సిద్ధమవ్వాల్సి వచ్చింది. తగిన సంఖ్యాబలం లేకుండానే యడ్యూరప్ప పదవి చేపట్టడంతో గవర్నర్ వాజూ బాయి వాలా యడ్యూరప్ప [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పదవి చేపట్టిన వెంటనే బలపరీక్షకు సిద్ధమవ్వాల్సి వచ్చింది. తగిన సంఖ్యాబలం లేకుండానే యడ్యూరప్ప పదవి చేపట్టడంతో గవర్నర్ వాజూ బాయి వాలా యడ్యూరప్ప [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పదవి చేపట్టిన వెంటనే బలపరీక్షకు సిద్ధమవ్వాల్సి వచ్చింది. తగిన సంఖ్యాబలం లేకుండానే యడ్యూరప్ప పదవి చేపట్టడంతో గవర్నర్ వాజూ బాయి వాలా యడ్యూరప్ప కు బలాన్ని నిరూపించుకునేందుకు వారం రోజులు గడువు ఇచ్చారు. అయితే యడ్యూరప్ప మాత్రం సోమవారమే విశ్వాస పరీక్ష జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమయం గడిచే కొద్దీ రెబల్ ఎమ్మెల్యేల మనసు మారే అవకాశముంది.
ఒకసారి నెగ్గితే….
ఒకసారి విశ్వాస పరీక్షలో నెగ్గితే అవిశ్వాసం పెట్టేందుకు మరో ఆరు నెలల సమయం ఉంటుంది. ఈలోగా పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవచ్చన్నది యడ్యూరప్ప భావన. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఇదే రకమైన సలహా ఇచ్చింది. వెనువెంటనే బలపరీక్షలో నెగ్గి మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు యడ్యూరప్ప సిద్ధమవుతున్నారు. సాధ్యమయినంత తొందరగా విశ్వాసపరీక్ష జరిపితే సమస్యలు కూడా పరిష్కారమవుతాయని యడ్యూరప్ప భావిస్తున్నారు.
మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే….
కర్ణాటక శాసనసభలో మొత్తం 224 మంది శాసనభ్యులుండగా అందులో ఇప్పటికే స్పీకర్ రమేష్ కుమార్ ముగ్గురిపై వేటు వేశారు. దీంతో సంఖ్య 221కు పడిపోయింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముంది. 221 మంది సభ్యులు ఉన్న సభలో విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే 112మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి ఒక స్వతంత్ర సభ్యుడితో కలసి 106 మంది ఉన్నారు. ఈ బలం సరిపోదు. రెబల్ ఎమ్మెల్యేలను సభకు రానివ్వకుండా చేయగలిగితేనే యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో గట్టెక్కుతారు.
స్పీకర్ అడ్డు తొలగించుకుంటే…..
అలాగే స్పీకర్ రమేష్ కుమార్ ను కూడా వెనువెంటనే పదవినుంచి తప్పించేందుకు యడ్యూరప్ప రెడీ అయిపోయారు. ఆయన స్థానంలో తన పార్టీకి చెందిన వారు ఉంటే తప్ప పాలన సాఫీగా సాగదు. అందుకోసం ఆయనకు విశ్వాస పరీక్ష పూర్తయిన తర్వాత స్పీకర్ రమేష్ కుమార్ పై అవిశ్వాసం పెట్టే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. స్పీకర్ ను తొలగించగలిగితే కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 13 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు రాజకీయంగా ఇబ్బందుల్లో పడదన్నది బీజేపీ వ్యూహంగా కన్పిస్తుంది. మొత్తం మీద సోమవారం యడ్యూరప్ప విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.