ఏదైనా ఇద్దరి ఖాతాలోనే
కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికలు పార్టీ మారిన వారి జాతకాలను నిర్ణయిస్తాయి. మొత్తం [more]
కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికలు పార్టీ మారిన వారి జాతకాలను నిర్ణయిస్తాయి. మొత్తం [more]
కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికలు పార్టీ మారిన వారి జాతకాలను నిర్ణయిస్తాయి. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగుతుండగా పదమూడు స్థానాల్లో గతంలో రాజీనామా చేసి అనర్హత వేటు పడిన వారే కావడం విశేషం. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి పోటీ చేసిన వీరికి బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా వీరికి తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని ముఖ్యమంత్రి యడ్యూరప్ప హామీ ఇచ్చారు.
అంతా తానే అయి…..
అయితే పదిహేను నియోజకవర్గాలను యడ్యూరప్ప అంతా తానే అయి ముందుండి చూసుకుంటున్నారు. జాతీయ స్థాయి నేతలు కూడా పెద్దగా ప్రచారానికి ఎవ్వరూ రాలేదు. ఈ ఎన్నికల్లో కనీసం ఎనిమిది స్థానాలు గెలిస్తేనే యడ్యూరప్ప ప్రభుత్వం కొనసాగడానికి వీలుంది. అందుకే యడ్యూరప్ప అన్ని నియోజకవర్గాలనూ పర్యటించి వీరిని గెలిపిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని పరోక్షంగా మంత్రి పదవుల విషయాన్ని ప్రస్తావించారు.
పట్టులేని అభ్యర్థులను….
ఇక కాంగ్రెస్ కూడా పెద్ద తప్పిదమే చేసింది. గత ఎన్నికల్లో పట్టున్న నేతలు పోటీ చేయడంతో ఇక్కడ గెలుపు సాధ్యమయింది. అప్పటి వరకూ ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వారే దిక్కుగా ఉన్నారు. మరో కీలక నేత లేరు. వారి వెంట ముఖ్యనేతలందరూ వెళ్లిపోవడంతో కాంగ్రెస్ కొత్త అభ్యర్థులను నిలబెట్టాల్సి వచ్చింది. అయితే వీరు పెద్దగా ప్రభావం చూపలేరని అంటున్నారు. పార్టీని చూసి ఓటేస్తేనే ఈ నియోజకవర్గాల్లో గెలుపు సాధ్యమవుతుంది. లేకుంటే ఇక అంతే సంగతులు.
సిద్ధరామయ్యే దగ్గరుండి…..
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి జాతీయ స్థాయి నేతలు ఎవరూ రాలేదు. కేవలం సిద్ధరామయ్య, దినేష్ గుండూరావు, పరమేశ్వర, వేణుగోపాల్ వంటి నేతలే ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమం మొత్తాన్ని సిద్దరామయ్య దగ్గరుండి చూసుకున్నారు. గెలుపు, ఓటములు ఆయన ఖాతాలోనే పడతాయి. జేడీఎస్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు కొంత టర్న్ అవుతుందన్న ఆశతో కాంగ్రెస్ నేతలున్నారు. మొత్తం మీద ప్రచారం ముగిసిన తర్వాత అన్ని పార్టీల నేతలు పోలింగ్ పైనే దృష్టి పెట్టారు.