అప్పకు ఇక అన్నీ కష్టాలేనా?
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు మున్ముందు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎలాగోలా మంత్రి వర్గ విస్తరణ జరిపినా అసంతృప్తులు మాత్రం చల్లారవు. అయితే యడ్యూరప్ప కూడా ఇందుకు [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు మున్ముందు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎలాగోలా మంత్రి వర్గ విస్తరణ జరిపినా అసంతృప్తులు మాత్రం చల్లారవు. అయితే యడ్యూరప్ప కూడా ఇందుకు [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు మున్ముందు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎలాగోలా మంత్రి వర్గ విస్తరణ జరిపినా అసంతృప్తులు మాత్రం చల్లారవు. అయితే యడ్యూరప్ప కూడా ఇందుకు డిసైడ్ అయినట్లే కనపడుతున్నారు. వచ్చే రెండేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన మద్దతును పార్టీలోనూ, బయటా సమీకరించేందుకు సిద్దమవుతున్నారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తి తలెత్తినా జేడీఎస్ నుంచి మద్దతు సంపాదించేందుకు యడ్యూరప్ప కోటరీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇదే చివరి అవకాశం….
యడ్యూరప్పకు ఇదే చివరి అవకాశమని తెలుసు. వయసు రీత్యా చూసినా ఇక తనకు ముఖ్యమంత్రి పదవి దక్కదని తెలుసు. తన కుమారుడి భవిష్యత్ కోసమే ఆయన పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు రాజీపడాల్సిన అవసరం లేదని యడ్యూరప్ప భావిస్తున్నారు. దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయడమే కాకుండా అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా తనదేనని యడ్యూరప్ప భావిస్తున్నారు. కొందరు నివేదికలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని యడ్యూరప్ప భావిస్తున్నారు.
వ్యతిరేకత పెరిగినా…
పార్టీ అధిష్టానం ఆలస్యంగానైనా ఈ విషయాన్ని గ్రహిస్తుందని యడ్యూరప్ప ఆశిస్తున్నారు. నిజానికి బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. వీరిలో కొంతమంది యడ్యూరప్ప విధేయులు కాగా, అధికమంది పార్టీకి కట్టుబడిన వారే. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారికి యడ్యూరప్ప ప్రాధాన్యత ఇవ్వడంతోనే సమస్య తలెత్తింది. పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వారిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో పార్టీ వైపు ఎవరూ చూడరని యడ్యూరప్ప వాదిస్తున్నారు.
వారికి ఇవ్వకుంటే…..?
కానీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం 17మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారైతే, 105 మంది గెలవడానికి కారణమైన కార్యకర్తలను ఏమంటారని యడ్యూరప్ప వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు బసవన గౌడ యత్నాల్, శ్రీనివాస్ ప్రసాద్ వంటి నేతలు బహిరంగంగానే యడ్యూరప్ప వైఖరిని తప్పుపడుతున్నారు. ఇప్పటికిప్పుడు మంత్రి వర్గ విస్తరణలో యడ్యూరప్ప పట్టు సాధించినా రానున్న రెండేళ్లు లాగడం కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. అయితే యడ్యూరప్ప కూడా మానసికంగా ఇందుకు సిద్ధమయినట్లే కనిపిస్తున్నారు.