Yedyurappa : అప్ప అసహనాన్ని అర్థం చేసుకోరా?
కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. యడ్యూరప్ప వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తనను ఉన్న పళంగా పదవి నుంచి దించేయడమే కాకుండా తన వారసులకు [more]
కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. యడ్యూరప్ప వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తనను ఉన్న పళంగా పదవి నుంచి దించేయడమే కాకుండా తన వారసులకు [more]
కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. యడ్యూరప్ప వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తనను ఉన్న పళంగా పదవి నుంచి దించేయడమే కాకుండా తన వారసులకు ఎటువంటి పదవులు ఇవ్వకపోవడంపై యడ్యూరప్ప అసంతృప్తిగా ఉన్నారు. యడ్యూరప్ప సూచించిన బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసినా మంత్రివర్గం కూర్పు మాత్రం తాను అనుకున్నట్లు జరగలేదు.
సొంత పార్టీ అంటూ….
దీంతో యడ్యూరప్ప పార్టీకి ఏ సమయంలోనైనా ఝలక్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయనకు ప్రాంతీయ పార్టీ జేడీఎస్ తో సత్సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ కూడా కీలకంగా మారనుంది. జేడీఎస్ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయన తన వారసుల రాజకీయ భవితవ్యం కోసం కొత్తగా పార్టీ పెట్టే యోచన కూడా చేస్తున్నారని కర్ణాటకలో పెద్దయెత్తున్ ప్రచారం జరుగుతుంది.
సామాజికవర్గం కోణంలో…
కర్ణాటకలో లింగాయత్ సామాజికవర్గం ఎన్నికలను శాసిస్తుంది. అదే సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్పను తప్పించడంతో ఆ వర్గం కూడా బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉంది. బసవరాజ్ బొమ్మై కూడా అదే సామాజికవర్గమైనా యడ్యూరప్పను ఓన్ చేసుకున్నట్లు ఆ సామాజికవర్గం సొంతం చేసుకోలేకపోతుంది. దీంతో గతంలో మాదిరి యడ్యూరప్ప మరోసారి సొంత కుంపటి పెట్టుకుంటారన్న వార్తలు వస్తున్నాయి.
శాంతింప చేసేందుకు….
యడ్యూరప్ప లేకుండా కర్ణాటకలో బీజేపీకి విజయం అంత సులువు కాదు. బీజేపీ అధిష్టానం తొలుత యడ్యూరప్పను సంతృప్తిపర్చాల్సి ఉంటుంది. వారసులకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే పెద్దాయన కొంత శాంతించే అవకాశాలున్నాయి. కానీ యడ్యూరప్ప ఎదురు తిరిగితే మాత్రం బీజేపీ కన్నడ రాష్ట్రంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కూడా బలం పెంచుకుంటున్న నేపథ్యంలో యడ్యూరప్పను బీజేపీ ఎలా దారికి తెచ్చుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.