సింధియా సక్సెస్.. ఆ పదవి గ్యారంటీ
జ్యోతిరాదిత్య సింధియా సక్సెస్ అయ్యారు. తాను అనుకున్నది సాధించారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు ఇరవై అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నాయి. [more]
జ్యోతిరాదిత్య సింధియా సక్సెస్ అయ్యారు. తాను అనుకున్నది సాధించారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు ఇరవై అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నాయి. [more]
జ్యోతిరాదిత్య సింధియా సక్సెస్ అయ్యారు. తాను అనుకున్నది సాధించారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు ఇరవై అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నాయి. దీంతో జ్యోతిరాదిత్య సింధియా సక్సెస్ అయినట్లే భావించాలి. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఫలితంగా కమల్ నాధ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ అధికారాన్ని కోల్పోయింది.
బీజేపీలో చేరడంతో…..
బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వచ్చిన ఎమ్మెల్యేలకే తిరిగి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. వారి నియోజకవర్గాల్లో కొంత వ్యతరేకత వ్యక్తమయిందన్న వార్తలు విన్పించాయి. అయినా జ్యతిరాదిత్య సింధియా ఈ ఎన్నికలను వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు వివరించారు. తాము పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.
గెలిపించే బాధ్యతను….
బీజేపీ నాయకత్వం కూడా ఉప ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించింది. ఆయన చెప్పినట్లే నడుచుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలు కలసి అనేక సభల్లో పాల్గొన్నారు. కానీ సింధియా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటలను చేశారు. వీరి గెలుపోటములే తన రాజకీయ భవిష్యత్ ను నిర్దేశిస్తాయన్నది సింధియాకు తెలియంది కాదు.
కేంద్ర మంత్రి పదవి…..
జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయనకు త్వరలో జరిగే కేంద్రమంత్రి వర్గ విస్తరణలో పదవి లభిస్తుందని అంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిపించి బీజేపీ ప్రభుత్వాన్ని సుస్థిరం చేస్తేనే తనకు రాజకీయ భవిష్యత్ ఉందని భావించిన జ్యోతిరాదిత్య సింధియా ఆ మేరకు శ్రమించారు. ఫలితాల్లో ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కింది. దీంతో సింధియాకు కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అన్నది తేలిపోయింది.