వారు దూరమయితే ఎలా?
ఏపీ ప్రధాన విపక్షం టీడీపీకి కొత్త సమస్య చుట్టుకుంది. ఓటమి నుంచి కోలుకున్న పార్టీని ముందుండి నడిపించే బాధ్యతను యువతకు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. [more]
ఏపీ ప్రధాన విపక్షం టీడీపీకి కొత్త సమస్య చుట్టుకుంది. ఓటమి నుంచి కోలుకున్న పార్టీని ముందుండి నడిపించే బాధ్యతను యువతకు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. [more]
ఏపీ ప్రధాన విపక్షం టీడీపీకి కొత్త సమస్య చుట్టుకుంది. ఓటమి నుంచి కోలుకున్న పార్టీని ముందుండి నడిపించే బాధ్యతను యువతకు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై నెల రోజుల కిందట పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మరీ యువతను ప్రోత్సహిస్తామని, 33 శాతం పదవులు వారికేనని చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో టీడీపి ఇక, పుంజుకోవడం ఖాయమని అందరూ అనుకు న్నారు. పార్టీ పునర్ వైభవం దిశగా అడుగులు వేస్తుందని అందరూ భావించారు. అయితే, ఆదిలోనే హంసపాదు మాదిరిగా.. పార్టీలో కీలకమైన యువ నాయకులు పెద్దగా ఊపు, ఉత్సాహం చూపించడం లేదు.
యాక్టివ్ గా లేక…..
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున కొందరు యువ నేతలు బరిలో నిలిచారు. వీరిలో దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ తప్ప ఎవరూ గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. అయితే, వచ్చే ఎన్నికలనాటికి ముఖ్యంగా వచ్చే నెలలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. ఆదిశగా అడుగులు వేశారు. కీలకమైన యువతకు ప్రాధాన్యం పెంచుతానని స్వయంగా చెప్పారు. అయినా కూడా పరిటాల శ్రీరాం, సిద్దా రాఘవరావు కుమారుడు కానీ, బొజ్జల సుధీర్ కానీ, జేసీ తనయులు పవన్, అస్మిత్ రెడ్డిలు కానీ అయ్యన్న పాత్రుడు కుమారుడు కానీ, ముద్దు కృష్ణమ తనయుడు, దామచర్ల జనార్దన్ వంటి వారు ఎక్కడా పార్టీలో యాక్టివ్ గా ఉండడం లేదు.
వారిద్దరు మినహా….
అదే సమయంలో పార్టీ తెలుగు యువతకు అధ్యక్షుడుగా ఉన్న దేవినేని అవినాష్ ఏకంగా పార్టీ నుంచి జంప్ చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలానే ఉంటే యువ కిశోరాల మద్దతు పార్టీకి లేక పోతే.. కష్టమేననే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు తనయుడు లోకేష్, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మాత్రమే యాక్టివ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం యువత విషయం సక్సెస్ అయ్యే పరిస్థితి ఉందా? లేదా? అనేసందేహాలు వ్యక్తమవుతు న్నాయి.
వారసులకు మాత్రమేనా?
మరోపక్క, వారసులకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యం ఉందని ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. అందులోనూ ఒకటి రెండు సామాజికవర్గాలకు చెందిన యువ నాయకులకే ప్రాధాన్యం ఉండడం కూడా మిగిలిన యువనేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. దీనివల్ల మరికొంత మంది యువత కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు పార్టీలో యువ రాజకీయాలు ఇక కనుమరుగేనా ? అనే సందేహానికి బాబు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.