షో గ్యాంగ్ పై జగన్ గుస్సా
వై.ఎస్.జగన్ పార్టీ ప్రారంభించినప్పటినుంచి అధినేతగా విసుగూ, విరామం లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. క్యాడర్ కి లీడర్ కి కూడా అదే విషయం చెబుతున్నారు. పదేళ్ల ఆయన పోరాటంలో [more]
వై.ఎస్.జగన్ పార్టీ ప్రారంభించినప్పటినుంచి అధినేతగా విసుగూ, విరామం లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. క్యాడర్ కి లీడర్ కి కూడా అదే విషయం చెబుతున్నారు. పదేళ్ల ఆయన పోరాటంలో [more]
వై.ఎస్.జగన్ పార్టీ ప్రారంభించినప్పటినుంచి అధినేతగా విసుగూ, విరామం లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. క్యాడర్ కి లీడర్ కి కూడా అదే విషయం చెబుతున్నారు. పదేళ్ల ఆయన పోరాటంలో అలుపు లేదు. కానీ పార్టీకి బాధ్యులుగా చేసిన వారు మాత్రం కాడి వదిలేసి కాలక్షేపం చేశారు. అన్ని చోట్లా గెలిచి విశాఖలో ఎందుకు ఓడిపోయామని వై.ఎస్.జగన్ అడిగిన ప్రశ్నకు ఇపుడు నాయకుల వద్ద సమాధానం లేదు. దాంతో వై.ఎస్.జగన్ సిటీ లీడర్లు అంటేనే మండిపడుతున్నారు. ఇతర పార్టీల నుంచి తెచ్చి మరీ పదవులు ఇస్తున్నారు. ఇపుడు ఇదే వైసీపీలో పెద్ద చర్చగా ఉంది. విశాఖ నగర అధ్యక్షునిగా చాలాకాలం పనిచేసి ఎన్నికల్లో టికెట్ కూడా దక్కించుకున్న మళ్ళ విజయప్రసాద్ పై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని అంటున్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్సార్ చలువతో ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యే అయిన మళ్ళ 2014 కు ముందు వైసీపీలో చేరారు. వెంటనే ఆయన్ని సిటీ ప్రెసిడెంట్ గా చేసి వై.ఎస్.జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ ఎన్నికల్లో వై.ఎస్.జగన్ తల్లి విజయమ్మ ఓడిపోవడానికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఎంత కారణమో మళ్ల కూడా అంతే కారణమని వై.ఎస్.జగన్ అప్పట్లో అభిప్రాయపడ్డారు. అయితే తన తప్పుని దిద్దుకుంటారనే ఆయనకు ఇంకా అవకాశాలు ఇస్తూ వచ్చారు.
అయిదేళ్ళుగా పడకేసిన పార్టీ…..
ఇక నగర వైసీపీ అధ్యక్షునిగా మళ్ళకు ఎన్నికలకు రెండేళ్ల ముందు వై.ఎస్.జగన్ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగానే ఆయన్ని తప్పించి మరో నేత వంశీ కృష్ణకు చివరి నిముషంలో ప్రెసిడెంట్ ని చేసారు. ఇదిలా ఉంటే మళ్ళను 2014 నుంచి విశాఖ పశ్చిమ ఇంచార్జిగా ఉంచితే ఆయన కనీసం తన సీటుని కూడా గెలుచుకోలేకపోవడం పట్ల వై.ఎస్.జగన్ గరం గరం అయ్యారు. ప్రెసిడెంట్ గా సిటీని గెలిపించాల్సిన నాయకుడు తాను పోటీ చేసిన చోట కూడా ఓడిపోవడమేంటని వై.ఎస్.జగన్ గట్టిగానే ప్రశ్నించినట్లుగా భోగట్టా. పార్టీని ఎన్నికలకు తయారు చేయలేకపోవడం, నాయకులంతా టైం పాస్ చేయడం వల్లనే సిటీలో వైసీపీ ఓటమి పాలు అయిందని వై.ఎస్.జగన్ గట్టిగా అభిప్రాయపడుతున్నారు. దీంతో మళ్లతో పాటు, మిగిలిన నాయకులకు కూడా నామినేటెడ్ పదవుల పంపిణీలో వై.ఎస్.జగన్ ప్రయారిటీ ఇవ్వడంలేదని అంటున్నారు.
ఇతర పార్టీల వైపే చూపు….
ఇపుడు విశాఖ సిటీ వైసీపీకి కాయకల్ప చికిత్స చేయాలని వై.ఎస్.జగన్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. పార్టీలో ఉన్న వారంతా షో చేస్తున్నారు తప్ప జనంలోకి వెళ్లడంలేదని గ్రహించిన వై.ఎస్.జగన్ ఇతర ప్రాంతాలలో ఉన్న పార్టీ నాయకులను కూడా తీసుకువచ్చి విశాఖ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ విధంగా అక్రమాని విజయనిర్మల భీమిలీ నుంచి విశాఖకు షిఫ్ట్ అయ్యారు. ఇక టీడీపీ నుంచి బలమైన నాయకులకు కూడా వైసీపీ ఇపుడు ఎర వేస్తోంది. ఆ పనిని మంత్రి అవంతి శ్రీనివాసరావుకు అప్పగించారని అంటున్నారు. ఆయన తనకున్న పరిచయాలతో ధీటైన నాయకులని వైసీపీలోకి రప్పించేందుకు రెడీ అవుతున్నారు. వచ్చిన వారికి నామినేటెడ్ పదవులను ఆశగా చూపిస్తున్నారు. మొత్తానికి విశాఖ సిటీలో వైసీపీని బలోపేతం చేయడం, జీవీఎంసీ ఎన్నికల్లో గెలవడం టార్గెట్ గా జవై.ఎస్.జగన్ పసుపు శిబిరంపై కన్ను వేశారని అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పార్టీలో ఉన్న షో గ్యాంగ్ కి ఇక ఆఫర్లు ఏవీ ఉండవని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.