జగన్ మాటంటే ఆ ఎమ్మెల్యేకు లెక్కేలేదా?
ఆయన జగన్ వర్గం ఎమ్మెల్యే.. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. అతి తక్కువ వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి పలుమార్లు ఎమ్మెల్యే అయ్యాడు. పార్టీ [more]
ఆయన జగన్ వర్గం ఎమ్మెల్యే.. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. అతి తక్కువ వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి పలుమార్లు ఎమ్మెల్యే అయ్యాడు. పార్టీ [more]
ఆయన జగన్ వర్గం ఎమ్మెల్యే.. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. అతి తక్కువ వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి పలుమార్లు ఎమ్మెల్యే అయ్యాడు. పార్టీ కోసం కమిట్మెంట్తో ఉన్న సదరు నేతకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ నుంచి ఆఫర్లు వచ్చినా, బలమైన ఒత్తిళ్లు వచ్చినా కూడా పార్టీ మారలేదు. సదరు ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయేవారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండడంతో పాటు పార్టీ కూడా అధికారంలో ఉండడంతో ఆయన అవినీతికి, సహజ వనరుల దోపిడీకి అడ్డే లేకుండా పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చాలా తెలివైన ఎమ్మెల్యే అని.. ఆయన అనుచరులు భారీగా అవినీతికి పాల్పడుతున్నా ఆయన మాత్రం సైలెంట్‌గానే ఉంటునే నడిపించాల్సిన కథ నడిపించేస్తున్నట్టు భోగట్టా.
ఇసుక రీచ్ లు ఉండటంతో…..
ఆయన నియోజకవర్గంలోనే గోదావరి ప్రవాహం ఉండడంతో కావాల్సినంత ఇసుక దొరుకుతోంది. ఇక్కడ ఇసుకను అడ్డగోలుగా దోచేస్తూ అమ్మేసుకుంటోన్న ఆయన దోపిడీకి అధికారులు పదే పదే అడ్డుతగులుతున్నారు. తన నియోజకవర్గంలో ఇసుక రీచ్‌ల విషయంలో అధికారులు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని సదరు ఎమ్మెల్యే గతంలో పదే పదే సమావేశాల్లో అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తన నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్‌ల్లో తన అనుచరులతో భారీ ఎత్తున ఇసుక దీపిడి చేయిస్తోన్న సదరు ఎమ్మెల్యేపై ప్రభుత్వానికి జిల్లా ఉన్నతాధికారి ఫిర్యాదు చేసినట్టు టాక్..! ఇక ఇక్కడ ఇసుక ఉత్తరాంధ్రలోని ఓ ప్రధాన నగరానికి భారీ ఎత్తున తరలిపోతోందట.
జగన్ వార్నింగ్ ఇచ్చినా…..
ఉత్తరాంధ్రలో కీలక జిల్లా మంత్రికి సైతం ఇసుక ఇక్కడ నుంచే భారీ ఎత్తున వెళుతోందని అంటున్నారు. ఇక సదరు ఎమ్మెల్యే కొంతమంది అనుచరులను పెట్టుకుని ఎవ్వరిని లెక్క చేయకుండా ఈ దందా చేయిస్తున్నారట. అవసరం అయితే రాత్రికి రాత్రే కథ నడిపించేస్తున్నారని కూడా చెపుతున్నారు. దీంతో జగన్ సైతం ఇప్పటికే రెండుసార్లు జాగ్రత్తగా ఉండాలని.. ఈ ఆరోపణలు రాకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారన్న టాక్ ఉంది. అయినా సదరు ఎమ్మెల్యే తీరు మాత్రం మారలేదట.
లైట్ తీసుకుని….
జగన్ అలానే చెపుతాడు… ఇక్కడ ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం.. సంపాదించింది ఏమీ లేదు.. ఖర్చులు తడిపిమోపెడు అవుతున్నాయి.. వచ్చేసారికి రెడ్డెవరో ? రాజు ఎవరో ? అని జగన్ మాటలు లైట్ తీస్కొని తన పని తాను చేసుకుపోతున్నారట. ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయన దూకుడుగా అడ్డూ అదుపేలేదని సొంత పార్టీ నేతలతో పాటు అధికారులు ఒక్కటే చెవులు కొరుక్కుంటున్నారు. సదరు ఎమ్మెల్యే 20 ఏళ్ల పాటు రాజకీయం చేస్తున్నా ఆయనపై ఇప్పుడు వచ్చినన్ని అవినీతి ఆరోపణలు గతంలో ఎప్పుడూ రాలేదని అంటున్నారు.