జగన్పై ముప్పేట దాడి.. అందుకేనా..?
వైసీపీ అధినేత, సీఎం జగన్పై ముప్పేట దాడి జరుగుతోందా ? ఆయనను ఒక్కసారిగా నలుదిక్కులా అన్ని పార్టీలూ టార్గెట్ చేశాయా ? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తే.. [more]
వైసీపీ అధినేత, సీఎం జగన్పై ముప్పేట దాడి జరుగుతోందా ? ఆయనను ఒక్కసారిగా నలుదిక్కులా అన్ని పార్టీలూ టార్గెట్ చేశాయా ? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తే.. [more]
వైసీపీ అధినేత, సీఎం జగన్పై ముప్పేట దాడి జరుగుతోందా ? ఆయనను ఒక్కసారిగా నలుదిక్కులా అన్ని పార్టీలూ టార్గెట్ చేశాయా ? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి గత ఏడాది ఎన్నికల తర్వాత టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఏ చిన్న విషయం జరిగినా.. దానికి కులం అంటించి మాట్లాడడంలేదా.. సెంటిమెంటును ప్లే చేయడం.. ద్వారా.. టీడీపీ జగన్ను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయని.. డాక్టర్ సుధాకర్ విషయాన్ని.. కూడా తమకు అనుకూలంగా వాడుకుంది. ఇక, బీజేపీ రాష్ట్ర చీఫ్ మారకముందు అప్పటి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ జగన్ను గట్టిగా టార్గెట్ చేశారు.
ప్రతి విషయంలోనూ….
ప్రతి విషయంలోనూ ఆయనను లక్ష్యంగా చేసుకుని ఇసుక, మట్టి, గనులు .. వంటి అనేక విషయాల్లో విమర్శలు గుప్పించారు. ఇక, బీజేపీ చీఫ్గా సోము వీర్రాజు వచ్చిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా.. ఇటీవల తిరుపతి పార్లెమెంటు ఉప ఎన్ని కలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన కూడా జగన్పై దూకుడు పెంచారు. ఇక, ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ ప్రజల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కూడా జగన్ ను భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిన్న మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండి ట్విట్టర్ ద్వారా కామెంట్లు చేయగా ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు కూడా రైతులు గుర్తుకు వచ్చేశారు.
అందుకేనా ఇలా…?
మరి ఇలా ఒక్కసారిగా ఈ మూడు పార్టీలూ ముప్పేట దాడి చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? అనేది చర్చకు వస్తున్న విషయం. గతంలో 2014 ఎన్నికల సమయంలో ఈ మూడు పార్టీలూ.. కలిసి పోటీ చేశాయి. అదేవిధంగా వచ్చే ఎన్నికల నాటికి కూడా కలిసి పోటీకి సిద్ధమయ్యే క్రతువులోనే ముప్పేట ఒకేసారి దాడి చేస్తున్నాయా ? అనే సందేహాలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ దఫా ఎన్నికలు 2024లో కాకుండా.. వచ్చే ఏడాది మధ్యలో లేదా 2022 ఆరంభంలోనే వస్తాయని ( జమిలీ పోరు) ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా.. మూడు పార్టీలూ మళ్లీ ముచ్చటగా కలుస్తాయని అంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి….?
అయితే.. సోము వీర్రాజు ఉన్నంత వరకు ఈ ప్రతిపాదనను ఒప్పుకోరనే విషయం కూడా పార్టీలో చర్చకు వస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి .. ఆయనను మారుస్తారనే ప్రచారం కూడా ఉంది. ఒక్కటి మాత్రం నిజం. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును గద్దె దింపేందుకు బీజేపీ ఎంత కసితో పనిచేసిందో ఇప్పుడు జగన్ విషయంలోనూ అంతే కసితో ఉందన్నది వాస్తవం. ఈ మొత్తం వ్యవహారం.. మూడు పార్టీల మూకుమ్మడి దాడి చూస్తే.. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి మూడు పార్టీలూ కలిసి పోటీ చేయడం తథ్యమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.