ఆ రెండు విషయాలే జగన్‌కు తలనొప్పులా ?
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆ మాటకొస్తే.. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల వరకు కరోనా ఎఫెక్ట్‌తో ఆర్థికంగా కష్టాలు పడుతున్నాయి. దీంతో [more]
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆ మాటకొస్తే.. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల వరకు కరోనా ఎఫెక్ట్‌తో ఆర్థికంగా కష్టాలు పడుతున్నాయి. దీంతో [more]
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆ మాటకొస్తే.. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల వరకు కరోనా ఎఫెక్ట్‌తో ఆర్థికంగా కష్టాలు పడుతున్నాయి. దీంతో అనేక సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కోత వేసింది. అదేవిధంగా.. ఇతర రాష్ట్రాల్లోనూ అనేక పథకాలు నిలిపి వేశారు.కానీ, ఏపీలో మాత్రం జగన్ అప్పులు తెచ్చయినా.. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. రెండు కీలక విషయాలు మాత్రం ఆయనకు తీవ్ర తలనొప్పిగా మారిపోయాయి.
ఈ రెండు అంశాలే…?
ఒకటి.. ఉద్యోగ క్యాలెండర్. రెండు ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు పీఆర్సీ, ఫిట్మెంట్ ప్రకటించడం. ప్రస్తుతం ఈ రెండు సమస్యలు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారాయనే చెప్పాలి. ఉద్యోగుల విషయాన్ని తీసుకుంటే.. గత చంద్రబాబు ప్రభుత్వం పీఆర్సీని అమలు చేయడంతోపాటు.. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. కానీ, జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా.. ఈ రెండింటి ఊసు ఇప్పటి వరకు ఎత్తడం లేదు. కేవలం సెలవులు పెంచారు. అదే సమయంలో వసతులు పెంచారు. ఇక ఆర్థిక ఇస్తామని మాత్రం హామీ ఇచ్చారు.
రెండేళ్లవుతున్నా…..?
దీంతో ఉద్యోగులు నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఫిట్మెంట్, పీఆర్ సీల కోసం ఎదురు చూస్తున్నారు. అమీతుమీ తేల్చుకుంటామని .. రెండు రోజుల కిందట కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించడాన్ని బట్టి.. జగన్ సర్కారు ఇరుకునపడే ప్రమాదం కనిపిస్తోంది. ఇక, నిరుద్యోగులకు ఏటా జనవరిలోనే ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించి.. విధిగా ఉద్యోగాలను కల్పిస్తామని.. జగన్ హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటికి రెండేళ్లు గడిచినప్పటికీ.. ఒక్క కేలండర్‌ను కూడా ప్రకటించలేదు. ఈక్రమంలోనే నిరుద్యోగుల నుంచి నిరసనలు వస్తున్నాయి.
రాబోయే రోజుల్లో….?
ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసేందుకు జగన్ సన్నాహాలు చేశారు. అయితే.. ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో.. లెక్కలు తీసుకునేందుకు మరో మూడు మాసాల సమయం పడుతుందని అధికారులు సెలవిచ్చారు. దీంతో ఈ ప్రతిపాదన వెనక్కి పోయింది. ఇప్పుడు ఇదే అస్త్రంగా టీడీపీ రాబోయే రోజుల్లో జగన్ సర్కారుపై యుద్ధం ప్రకటించేందుకు రెడీ అయింది. మొత్తంగా చూస్తే.. ఉద్యోగులు.. నిరుద్యోగుల సమస్య.. జగన్‌కు ఇబ్బందిగా మారనుందనేది వాస్తవం.