జగన్ వెనక భారీ రాజకీయ కుట్ర…?
జగన్ సీఎం ఈ రెండు పదాలను కలిపి చదవడానికి కళ్ళకు కూడా శ్రమ ఇవ్వని పచ్చి వ్యతిరేక వర్గం ఏపీ నిండా ఉంది. జగన్ ని ఎపుడు [more]
జగన్ సీఎం ఈ రెండు పదాలను కలిపి చదవడానికి కళ్ళకు కూడా శ్రమ ఇవ్వని పచ్చి వ్యతిరేక వర్గం ఏపీ నిండా ఉంది. జగన్ ని ఎపుడు [more]
జగన్ సీఎం ఈ రెండు పదాలను కలిపి చదవడానికి కళ్ళకు కూడా శ్రమ ఇవ్వని పచ్చి వ్యతిరేక వర్గం ఏపీ నిండా ఉంది. జగన్ ని ఎపుడు మాజీ సీఎం చేద్దామని వారంతా ఎదురుచూస్తున్నారు. అందుకే గత రెండేళ్లలో లేనిది ఇపుడు హఠాత్తుగా జగన్ బెయిల్ రద్దు విషయాన్ని కొందరు తీసుకువస్తున్నారు. జగన్ ఇచ్చిన బీ ఫారం తో ఆయన ప్రచారం చలవతో గెలిచిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ని జైలుకు పంపేంతవరకూ తాను విశ్రమించనని తాజాగా భీషణ ప్రతిన పూనారు. ఆయన పాత్ర ధారి అయితే సూత్రధారులు చాలా మంది తెర వెనక ఉన్నారు అంటున్నారు.
పదేళ్ల తరువాత…?
జగన్ కి పదేళ్ల తరువాత మళ్ళీ మునుపటి చేదు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. జగన్ని ప్రజా క్షేత్రంలో ఇప్పట్లో దెబ్బ కొట్టడం అంటే కష్టం. అలాగని 2024 దాకా చూస్తూ ఊరుకుంటే వచ్చే కాలం ఏం చేస్తుందో ఎవరికి అనుకూలంగా ఉంటుందో కూడా తెలియదు. ఇక మూడేళ్ళ కాలం అంటేనే సుదీర్ఘ నిరీక్షణ కూడా. దాంతో అర్జంటుగా జగన్ బెయిల్ ని రద్దు చేయించి ఆయన్ని జైలుకు పంపించాలన్నదే ప్రత్యర్ధుల రాజకీయ కుట్రగా అంతా భావిస్తున్నారు. అలా వైసీపీని కకావికలం చేసి రాజకీయంగా పట్టు సాధించాలి అన్నదే హిడెన్ అజెండాగా ప్రత్యర్ధులకు ఉందిట.
సీబీఐ నో అంటే …?
ఇక సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో సానుకూలంగా తీర్పు రాకపోతే ఆ పైన ఎన్ని మెట్లు ఎక్కాలో అన్నీ ఎక్కి అయినా జగన్ తో సుదీర్ఘ న్యాయ పోరాటం చేయడానికి రఘురామ కృష్ణంరాజుకు తెర వెనక ప్రత్యర్ధులు అన్ని రకాలైన అస్త్ర శస్త్రాలను సమకూర్చుకున్నారు అంటున్నారు. వారికి ఇపుడు సానుకూల వాతావరణం ఉందని అంటున్నారు. ఈ మధ్యన జరిగిన కొన్ని పరిణామాలు కూడా జగన్ కి వ్యతిరేకంగా మారుతున్నాయి. తనకు సంబంధం లేని విషయాల్లో జగన్ వేలు పెట్టి కెలుక్కున్నారా అన్న చర్చ కూడా ఇపుడు సాగుతోంది. జగన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా లేఖ రాయడం బిగ్ రిస్క్ అని నాడే అంతా అన్నారు. ఇపుడు ఆయనే కొత్త ప్రధాన న్యాయ మూర్తిగా ఉన్నారు. దాంతో జగన్ కి వ్యతిరేకంగా పావులు కదిపే వారు సైతం ఇపుడు హుషార్ గా ఉన్నారని అంటున్నారు.
ఏం జరగబోతోంది ..?
జగన్ ని జైలుకు పంపించి తీరుతాను అని ఒక సాధారణ ఎంపీ అంటున్నాడు అంటే ఆయన వెనక ఎవరు ఉన్నారో ఊహించడం కష్టమేనీ కాదు, ఇక రఘురామకృష్ణంరాజు భాషలో ఈ మధ్య చాలా తేడావే వస్తోంది. ఇపుడు ఆయన జగన్ ని కూడా అసలు స్పేర్ చేసేలా కనిపించడంలేదు. మొత్తానికి సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తో కధ మొదలైపోయింది. ఇది ఎక్కడికి చేరాలో ఎలా దీన్ని క్లైమాక్స్ కి చేర్చాలో జగన్ వ్యతిరేకులకు బాగా తెలుసు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ కి ఎటువంటి లాబీలూ ఢిల్లీ స్థాయిలో లేవు కానీ ప్రత్యర్ధులకు మాత్రం అన్ని రకాల అస్త్రాలు చేతిలోనే ఉన్నాయి. జగన్ ఈ ఎపిసోడ్ లో నిస్సహాయుడుగానే చూడాలి. మరి ప్రత్యర్ధులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే జగన్ కి మళ్ళీ 2012 నాటి చేదు అనుభవాలు రిపీట్ కావడం ఖాయమే. అంటే జైలుకే అన్న మాట వినిపిస్తోంది. ఇక్కడో చిత్రం కూడా చెప్పుకోవాలి. ఇది 2021. అంటే చివరి రెండంకెలు అటూ ఇటూ మారాయన్న తేడా తప్పితే కధ టోటల్ గా ఒక్కటే అంటున్నారు.