అలా చేసుకుంటూ పోతే ఎలా కుదురుతుంది?
ఒకనాడు ఉమ్మడి ఏపీ సీఎం గా పనిచేసిన చంద్రబాబు తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు సీఈవో ని కడు గర్వంగా ప్రకటించుకున్నారు. 1999 నుంచి 2004 మధ్యలో [more]
ఒకనాడు ఉమ్మడి ఏపీ సీఎం గా పనిచేసిన చంద్రబాబు తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు సీఈవో ని కడు గర్వంగా ప్రకటించుకున్నారు. 1999 నుంచి 2004 మధ్యలో [more]
ఒకనాడు ఉమ్మడి ఏపీ సీఎం గా పనిచేసిన చంద్రబాబు తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు సీఈవో ని కడు గర్వంగా ప్రకటించుకున్నారు. 1999 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు సీఎం గా కంటే ఒక ముఖ్య పరిపాలనాధికారిగానే పాలన సాగించారు. దాంతో ఆయన ఎక్కువగా అధికారుల మీద ఆధారపడి పార్టీ పట్టు జార్చేశారు. నేతలకు విలువ ఇవ్వడం తగ్గించేశారు. దానివల్ల చివరికి బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి. 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు దారుణమైన ఓటమిని అందుకున్నారు.
జగన్ రూటే అది …..
ఇక యువ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా అదే పని చేస్తున్నారు. ఆయన పార్టీకి 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పాతిక దాకా మంత్రులు ఉన్నారు. అయినా కూడా మొత్తం కధను అధికారులతోనే నడిపిస్తున్నారు. దాని వల్ల అవినీతి దరి చేరకుండా ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ప్రజలకు నేరుగా అన్నీ అందుతాయని కూడా అంచనా వేసుకుంటున్నారు. కానీ అధికారులూ ప్రజా ప్రతినిధులూ భాగస్వామ్యం అయితేనే ప్రభుత్వం. మరి వీరిలో ఎవరిని పైకెత్తి మరొకరిని పక్కన పెట్టినా సక్రమంగా పాలన సాగదు అని మేధావులు అంటున్నారు.
చెడ్డ పేరే మరి ….?
ఏపీలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. అది అలా ఇలా కాదు ఏకంగా రోజుకు అరవై మంది దాకా మరణాలను కూడా నమోదు చేస్తోంది. ఇక కరోనా పెను సవాల్ చేయడంతో ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత కూడా తీవ్రమవుతోంది. విజయనగరం లాంటి జిల్లాలో ఆక్సిజన్ అందక కొందరు కరోనా రోగులు చనిపోయారు. మరి దీని మీద అధికారులు మాత్రం సాంకేతిక సమస్య అని చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మీదనే జనాగ్రహం పెరుగుతోంది. నిజానికి అధికారులకు బాధ్యత అప్పగించడం వల్ల వారు విధి నిర్వహణ వరకూ చేయగలరేమో కానీ అంతకు ముంచి ముందుకు వెళ్ళడానికి వారు పార్టీ మనుషులు కాదు, మరో వైపు ఏదైనా సమస్య తలెత్తినా వారు స్వయంగా నిర్ణయాలు తీసుకోలేరు. మౌనం వహిస్తే అది చివరికి జగన్ కే చిక్కులు తెచ్చి పెడుతుంది.
వర్కౌట్ అవుతుందా..?
జగన్ మార్క్ పాలనా విధానాలు అన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు చేస్తున్నవి. అక్కడ ప్రభుత్వం అంటే అధికారులే ముందుకు వస్తారు. రాజకీయ నేతలు వెనకన ఉంటారు. కానీ భారత్ లాంటి దేశాలో ప్రజా ప్రతినిధుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అది కరోనా వంటి ప్రకృతి విపత్తు అయినా, సంక్షేమ పధకాలు అయినా, అభివృద్ధి కార్యక్రమాలు అయినా కూడా ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఇక్కడ అత్యవసరం. రేపటి రోజునా మంచికీ చెడ్డకూ వారే జనాలకు జవాబు దారీగా ఉంటారు. కానీ జగన్ ప్రతీ దానికీ అధికారులనే ముందు పెట్టి తాను మోనిటరింగ్ చేస్తున్నారు. దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాలలో ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. వారు అటు జనాలకు సర్దిచెప్పలేక ఇటు ప్రభుత్వాన్ని అడగలేక చేతులు కట్టేసుకుంటున్నారు. మొత్తానికి కరోనా రెండవ దశ ఉధృతంగా ఉన్న వేళ అధికారులతో జిల్లా స్థాయి వరకూ మూడంచెల కమిటీలను వేసిన జగన్ ప్రజా ప్రతినిధులను కూడా దానిలో భాగస్వామ్యం చేస్తే ఇంకా ధాటీగా ఈ పెను విపత్తుని ఎదుర్కోవచ్చు అన్న సూచనలు వస్తున్నాయి. అంతే కాదు విపక్షాల విమర్శలు లేకుండా ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది అంటున్నారు.