సీటు చిరిగిపోతుందంతే … ?
అక్కడ ఉన్నది జగన్. ఆయన తాడేపల్లి రాజ ప్రాసాదంలో ఉంటారు. ఆయనకు ఏమీ తెలియదు. మన పని మనదే అని వైసీపీలో ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పులో [more]
అక్కడ ఉన్నది జగన్. ఆయన తాడేపల్లి రాజ ప్రాసాదంలో ఉంటారు. ఆయనకు ఏమీ తెలియదు. మన పని మనదే అని వైసీపీలో ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పులో [more]
అక్కడ ఉన్నది జగన్. ఆయన తాడేపల్లి రాజ ప్రాసాదంలో ఉంటారు. ఆయనకు ఏమీ తెలియదు. మన పని మనదే అని వైసీపీలో ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. జగన్ రాజకీయం ఏంటో చంద్రబాబుకే అర్ధం కావడంలేదు. మరి మిగిలిన వారికి అన్నీ తెలుసు అనుకుంటే బోల్తా కొట్టినట్లే కదా. వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికైతే రెండేళ్ల సీనియారిటీ సంపాదించారు. మరో మూడేళ్ళ పాటు పవర్ లో ఉంటారు. ఆ మీదట మళ్లీ టికెట్ వస్తుందా. ఎమ్మెల్యేలుగా నెగ్గుతారా. అంటే ఇదంతా డౌటేనట.
భారీగా కత్తెర …?
జగన్ పుణ్యమాని ఎవరికీ తెలియని వారు, పెద్దగా జనాల్లో లేని వారు కూడా ఎమ్మెల్యేలుగా 2019 ఎన్నికలో గెలిచారు. వారిలో చాలా మంది మంత్రులుగా కూడా వెలుగుతున్నారు. అయితే ఇందులో ఎందరి సమర్ధులు, మరెందరు మళ్ళీ పనికివస్తారు అన్న డేటా అయితే జగన్ దగ్గర పక్కాగా ఉందిట. పైగా ఎమ్మెల్యేలు ఎవరేం పని చేస్తున్నారు. వారు జనాలతో ఎలా కెనెక్ట్ అవుతున్నారు. పార్టీని ప్రభుత్వాని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా జగన్ బాగా అధ్యాయనం చేయిస్తున్నారుట. ఏ మాత్రం పార్టీ లైన్ కి భిన్నంగా ఉన్నా కూడా వచ్చేసారి టికెట్ దక్కడం కష్టమే అంటున్నారు. అంటే పెద్ద కత్తెర పడిపోతుంది అన్న మాట.
సెంచరీ కొడతారా…?
వైసీపీలో తాజాగా ఒక ప్రచారం అయితే సాగుతోంది. మరి ఇది అధినాయకత్వం హెచ్చరికగా ఉంటుందని లీక్ చేసిందా లేక మరోటా అన్నది తెలియదు కానీ ఒక విషయం మాత్రం చూస్తే మెజారిటీ సిట్టింగుల సీటు చిరిగిపోతోందట. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా వందకు పైగా వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి జగన్ ససేమిరా అంటున్నారుట. రెండేళ్ల పెర్ఫార్మెన్స్ చూసే జగన్ ఈ నిర్ణయం తీసుకుంటే గట్టిగా అయిదేళ్ళూ పూర్తి అయితే 151 మందిలో ఎందరికి టికెట్లు దక్కుతాయి అన్నది పెద్ద డౌటే మరి అన్నది వైసీపీలో తాజాగా వినిపిస్తున్న మాటగా ఉంది.
కొత్త ప్రయోగమే…?
జగన్ వచ్చే ఎన్నికల్లో కొత్త వారితోనే జనాల్లోకి వెళ్ళడానికి సిధ్ధంగా ఉన్నారట. తనతో పాటు బాగా పనిచేసే వారికి, మరీ ముఖ్యులు అనుకున్న వారికి మాత్రమే టికెట్లు కన్ ఫర్మ్ అన్నది తేలుతున్న విషయం. మిగిలిన వారంతా పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిందేనట. అంటే వందకు పైగా ఎమ్మెల్యేలు టికెట్ దక్కక మాజీలుగానే ఉంటారు అన్న మాట. మరి ఒక విధంగా జగన్ చేయబోయేది దుస్సాహసం. ఆయన అది చేస్తారా. చేస్తే వీరంతా టీడీపీలోకి జంప్ అయితే అపుడు సీన్ ఏంటి అన్నది కూడా ఆలోచించాలి కదా. అయితే జగన్ ఆ బెంగేమీ పెట్టుకోవడమే లేదుట. బాగా బ్యాడ్ గా ఉన్న వారినే తాను రిజెక్ట్ చేస్తారు కాబట్టి వారిని ఎవరి చేరదీసినా నిండా మునగడం ఖాయం. పైగా తన ఇమేజ్ తో మళ్ళీ కొత్తవారిని వెంటబెట్టుకుని ఫ్రెష్ లుక్ తో వెళ్తే జనామోదం కచ్చితంగా ఉంటుందని కూడా నమ్ముతున్నారుట. దీన్ని బట్టి చూడబోతే వన్ టైమ్ ఎమ్మెల్యేలుగానే చాలా మంది వైసీపీలో మిగలబోతున్నారు అన్న మాట.