మొత్తానికి నింద పడాల్సిందేనా… ?
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కుండబద్ధలు కొట్టింది. నూరు శాతం ప్రైవేట్ పరం చేస్తామని తన విధానాన్ని వెల్లడించింది. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా తాము [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కుండబద్ధలు కొట్టింది. నూరు శాతం ప్రైవేట్ పరం చేస్తామని తన విధానాన్ని వెల్లడించింది. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా తాము [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కుండబద్ధలు కొట్టింది. నూరు శాతం ప్రైవేట్ పరం చేస్తామని తన విధానాన్ని వెల్లడించింది. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా తాము వెనక్కు తగేది లేదని కూడా స్పష్టం చేస్తోంది. మరి స్టీల్ ప్లాంట్ కి ఏం కాదు అని జగన్ చెప్పారు. కేంద్రం అంతటి పని చేయదు, అలా కనుక చేస్తే ఆపేందుకు అన్ని రకాలుగా చూస్తామని ఆయన విశాఖ టూర్ లో కార్మికులకు హామీ ఇచ్చారు. ఇపుడు ఆ హామీని గుర్తుపెట్టుకుని కార్మికులు అంతా ఆశగా జగన్ వైపే చూస్తున్నారు.
ఖాతరు లేదుగా…
అయితే మాట ఇచ్చినంత సులువు కాదు. అక్కడ ఉన్నది మోడీ. ఆయన తలచుకోవాలే కానే కధ ఎంత దాకా సాగుతుందో నెలల తరబడి సాగుతున్న సాగు చట్టాల ఉద్యమాలు నిరూపిస్తున్నాయి. ఉత్తరాదిన బీజేపీకి రాజకీయంగా నష్టం వాటిల్లుతున్నా కూడా బీజేపీ మొండి వైఖరి మాత్రం వీడడంలేదు. అలాంటి బీజేపీకి ఏపీలో ఏముంది. వస్తే గిస్తే నోటా కంటే కొన్ని ఓట్లు తక్కువో ఎక్కువ వస్తాయంతే. అందువల్ల బీజేపీ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదు అంటున్నారు. అలాంటి ఆశలు పెట్టుకున్న వారు నిరాశ పడక తప్పదు అని కూడా అంటున్నారు.
జగనే బాధితుడా…?
అవును. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంది. దీని చరిత్ర ఘనం. ఉద్యమాలు బలిదానాలు దీనిని అల్లుకుని చాలానే ఉన్నాయి. ఆంధ్రుల హక్కులాంటి ప్లాంట్ కనుక ఒక్కసారి ప్రైవేట్ పరం అయితే ఏపీ మొత్తం ఆగ్రహిస్తుంది. అయితే ఆ కోపంలో వాటా మోడీతో పాటు జగన్ కూడా పంచుకోవాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో జగన్ తప్పు నిజానికి లేదు. ఆయన ప్లాంట్ ని అలాగే ఉంచమని కోరుతున్నారు. కానీ కేంద్రం దూకుడుగా ముందుకు వెళ్తోంది. మా ప్లాంట్, మా ఇష్టం అని కూడా చెబుతోంది. అయితే ప్లాంట్ ఉన్నది ఏపీలో, దానికి భూమి, నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించింది ఏపీ సర్కార్. అందువల్ల కేంద్రం కాదన్నా కూడా ఏపీకి దాని మీద హక్కు లేకుండా పోదు, సరిగా ఈ పాయింటే జగన్ ని ఇరికించేస్తోంది అంటున్నారు.
నమ్మకం కాస్తా…?
ఇపుడు కూడా ఉక్కు కార్మికులు జగన్ దే బాధ్యత అంటున్నారు. ఏపీ సర్కార్ పూనుకుని ప్లాంట్ ని కాపాడాలని వారు కోరుతున్నారు. అంటే మోడీ సర్కార్ కంటే కూడా జగన్ మీదనే ఈ విషయంలో వత్తిడి ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేంద్రం వద్ద అనేక డిమాండ్లు పెట్టి ఏ ఒక్కటీ తీరక జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు. అలాంటి వాటిలో ఇది కూడా చేరుతోంది. స్టీల్ ప్లాంట్ ఏపీకి ఉండాలి. అది కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి. అపుడే విశాఖతో పాటు ఏపీకి కూడా ఖ్యాతి దక్కుతుంది. కానీ కేంద్రం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయోగం ఏపీ నుంచే మొదలెట్టింది. పక్కన ఉన్న ఒడిషా జోలికి పోవడంలేదు. ఇక తెలంగాణాలో కూడా మరి కొన్ని కీలకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. వాటిని ఇంత తొందరగా టచ్ చేయలేదు అంటున్నారు. అంటే ఏపీలో రాజకీయ నాయకత్వం వీక్ గా ఉండబట్టే కేంద్రం చొరవ తీసుకుంటోంది అన్నది కార్మికుల్లో ఉంది. దాంతో అంతిమంగా నష్టపోయేది మాత్రం జగనే అని అంటున్నారు. ఏపీకి కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు కానీ గర్వకారణం అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే దాని దెబ్బ వైసీపీ మీద ఎంతలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు అంటున్నారు. మొత్తానికి ప్లాంట్ విషయంలో నైతిక ఓటమి జగన్ దే అంటున్నారు అంతా.