అమ్మో ఒకటో తారీఖు… ?
నిజానికి ఒకటవ తేదీ అంటే మధ్యతరగతి వర్గాలకు బెంబేలే. అలాగే బడుగు వర్గాలు కూడా ఆ డేట్ ని చూసి తెగ జడుసుకుంటాయి. నెలలో ఏ డేట్ [more]
నిజానికి ఒకటవ తేదీ అంటే మధ్యతరగతి వర్గాలకు బెంబేలే. అలాగే బడుగు వర్గాలు కూడా ఆ డేట్ ని చూసి తెగ జడుసుకుంటాయి. నెలలో ఏ డేట్ [more]
నిజానికి ఒకటవ తేదీ అంటే మధ్యతరగతి వర్గాలకు బెంబేలే. అలాగే బడుగు వర్గాలు కూడా ఆ డేట్ ని చూసి తెగ జడుసుకుంటాయి. నెలలో ఏ డేట్ కీ లేని ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. మొత్తం నెల భారాన్ని అంతా ఈ ఒక్కరోజే మోస్తుంది. కొత్త భారాన్ని కూడా తెస్తుంది. అందుకే ఎవరైనా తలచుకుని మరీ వణికేది ఈ డేట్ ని చూసే. ఇపుడు ఇలాంటి బెంగా , కంగారూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి కూడా పట్టుకుంది అంటున్నారు. సెటైరికల్ గా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నా వాస్తవం చూస్తే మాత్రం అదే అంటున్నారు. జగన్ ఫస్ట్ వస్తోంది అంటే ఇబ్బందిగానే ఉంటోందిట.
కటకటా…?
ఎపుడూ కటకటలాడే పరిస్థితే ఏపీది. జగన్ విషయం తీసుకుంటే ఆయన అధికారం చేపట్టి దాదాపుగా 26 నెలలు దాటింది. మొదట్లో జగన్ కి ఏపీ ఆర్ధిక పరిస్థితి పెద్దగా తెలిసేది కాదు, పైగా కొత్త ఉత్సాహం, దాంతో చేతికి ఎముక లేనట్లుగా పధకల పేరిట పంచుకుంటూ పోయారు. అంతే కరోనా మహమ్మారి ఎంటరై మొత్తం సీన్ రివర్స్ చేసి పారేసింది. ఆ తరువాత సెకండ్ వేవ్ కూడా వచ్చేసింది. దాంతో అసలే చితికి ఉన్న ఏపీ మరింతగా కునారిల్లిపోయింది. ఇక సీన్ చూస్తే ప్రతీ రోజూ కటకటగానే ఉంది. అక్షయ పాత్ర తెచ్చినా కూడా ఏపీ ఖజానాను ఎవరూ నింపలేని స్థితి ఉంది అంటున్నారు.
నిద్రలేని రాత్రులేనా..?
ఏపీలో ప్రతీ నెలా ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షనర్ల పెన్షన్లు వంటి వాటికే భారీ మొత్తాలు తీయాల్సి ఉంటుంది. ఇలా కనుక చూసుకుంటే కచ్చితంగా పది వేల కోట్ల దాకా ఫస్ట్ కి ఖర్చుకు డబ్బు అవసరం పడుతుంది. మరి వేయి కోట్లకే అప్పుల కోసం పరిగెత్తే సీన్ ఏపీలో ఉందిపుడు. అలాంటిది ఒకేసారి పదివేల కోట్లు ఖర్చు అంటే భరించడమే కష్టం. అలా ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అందుకే క్యాలండర్ లో రోజులను చూసుకుంటూ వైసీపీ అదినేత జగన్ నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు అంటున్నారు.
పులి మీద స్వారీ….
జగన్ ముందూ వెనకా చూడకుండా హామీలు ఇచ్చేశారు. సరే వాటిని నెమ్మదిగా క్రమ పద్ధతిలో నెరవేరిస్తే బాగానే ఉండేది. కానీ హడావుడిగా ఒక్కో దాన్ని అమలు చేస్తూ పోయారు. ఇపుడు వాటిని ఆపలేరు. అలాగని కొత్తగా రూపాయి పుట్టదు, ఇక సర్కార్ ఉద్యోగులకు జీతాలు ఆపుతూంటే చెడ్డపేరు వస్తోంది. ఇక పదవీవిరమణ చేసి పెన్షన్ రాళ్ళ మీద బతికేవారికి వాయిదా వేస్తే అంతకంటే అపకీర్తి ఉండదు. మొత్తానికి చూసుకుంటే ఫస్ట్ రావడంతోనే ఖర్చులు అలా తన్నుకు వస్తూంటే బడ్జెట్ పద్మనాభంలా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సతమతమవుతున్నారు. ఇక జగన్ కి సైతం ఇది తలకు మించిన భారమే అవుతుంది. తిప్పి తిప్పి చూస్తే ఇంకా ఇంటర్వెల్ కే సినిమా వచ్చింది. మొత్తం అయిదేళ్ళూ పూర్తి అయ్యేసరికి తలకు మించిన భారమా. ఏపీని ముంచే రుణ భారమా అన్నదే తేలాల్సి ఉందిట.