ఇక జగన్ ని ఏడిపించేస్తారట
జగన్ ఏపీ సీఎం. 151 సీట్లతో 22 మంది ఎంపీలతో దేశం మొత్తం తన వైపు చూసేట్టు చేసుకున్న్న అజేయమైన నాయకుడు. ఎన్నికలు జరిగి ఆరు నెలలు [more]
జగన్ ఏపీ సీఎం. 151 సీట్లతో 22 మంది ఎంపీలతో దేశం మొత్తం తన వైపు చూసేట్టు చేసుకున్న్న అజేయమైన నాయకుడు. ఎన్నికలు జరిగి ఆరు నెలలు [more]
జగన్ ఏపీ సీఎం. 151 సీట్లతో 22 మంది ఎంపీలతో దేశం మొత్తం తన వైపు చూసేట్టు చేసుకున్న్న అజేయమైన నాయకుడు. ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా కాలేదు. జగన్ ప్రభ ఏమీ తరిగిపోలేదు. పైగా ఆయన సంక్షేమ కార్యక్రమాలతో జనాలకు బాగా చేరువ అవుతున్నారు. మరో వైపు సామాజిక న్యాయం అంటూ తన మంత్రులతో పాటు, నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలు, బడుగులకు మంచి స్థానం కల్పించి రాజకీయంగా బలమైన పునాదిని జగన్ వేసుకున్నారు. చేతిలో నాలుగున్నరేళ్ళ పాటు అధికారం ఉంది. జగన్ తలచుకుంటే ఎవరినైనా ఏడిపించగలడు, మరి జగన్ ని ఎవరు ఏడిపించగలరు, ఎందుకు ఏడిపించాలి. అసలు ఆ అవసరం ఎందుకు పడుతుంది, ఇవన్నీ ప్రశ్నలే, సమాధానం మాత్రం ఒక్కటే. అదే రాజకీయం. ఈ పదం చిన్నది కాని అది అర్ధం చేసుకోలేనంత లోతైన, విశాలమైన మహా సముద్రం. అందుకే జగన్ ఇపుడు టార్గెట్ అవుతున్నాడంటున్నారు.
కోర్టు దగ్గరనే అలా…..
జగన్ ని ఏడిపించే మంత్ర దండం ఇపుడు బీజేపీ చేతుల్లో ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. పైగా బ్రహాండమైన పొలిటికల్ ఇమేజ్ ఉంది. మరి జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలంటే ఆయన్ని కోర్టు మెట్లు పదే పదే ఎక్కేలా చేయాలన్నదే బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. సీబీఐ విభాగం ట్రయల్ కోర్టులో వాదించిన తీరు దీన్నే చెబుతోంది. జగన్ని తీవ్రమైన ఆర్ధిక నేరస్తుడుగా సీబీఐ తరఫున న్యాయవాదులు అభివర్ణించారు. ఆయన్ని అలా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిస్తే ఏమైనా ఉందా అందరినీ బెదిరించేయరూ అంటూ సీబీఐ గట్టిగా తగులుకుంది. దాంతో ఏకీభవించిన ట్రయల్ కోర్టు జగన్ పిటిషన్ పక్కన పెట్టేసింది ఇదీ జరిగిన కధ. కానీ సీబీఐ ఎవరి చేతుల్లో ఉంటుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దానికి బాస్. ఆయన రాజకీయ గండర గండడు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తేవాలని గట్టి పట్టుదలతో ఉన్న పెద్దాయన. అందుకే జగన్ కి భారీ ఝలక్ తగిలిందని అంటున్నారు.
రోజూ వారీ విచారణట….
జగన్ ని ఎలా ఏడిపించాలో బీజేపీ పెద్దలు పధక రచన కూడా రెడీ చేసి పెట్టుకున్నారని ప్రచారం సాగుతోంది. వారానికి ఒకసారి సీబీఐ ట్రయల్ కోర్టులో జగన్ కేసు ఇపుడు విచారణ జరుగుతోంది. దాన్ని ఇకపై ప్రతీ రోజూ విచారణకు మార్చేస్తారని కూడా అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ ప్రతీ రోజూ సచివాలయానికి వెళ్ళనక్కరలేదు. ఏకంగా హైదరాబాద్ లోనే ఉండిపోయి నాంపల్లి కోర్టుకు వెళ్ళి హాజరు వేయించుకోవాల్సిందే. అదే జరిగితే జగన్ ప్రతిష్ట ఏం కావాలి. ఒక ముఖ్యమంత్రి రోజూవారీ పాలన చేస్తారా లేక కోర్టు గుమ్మం వద్ద ఉంటారా అంటూ ఇదే బీజేపీ మళ్ళీ పెద్ద నోరు చేసుకుని జనంలోకి వస్తుంది. జగన్ కి బదులుగా మరొకరిని సీఎం చేస్తారా లేక రాజీనామా చేస్తారా అన్న డిమాండ్ కూడా వస్తుంది. ఆ మీదట జరిగే కధ మొత్తం వేరేగా ఉంటుందని, ఏపీలో జగన్ ని పూర్తిగా ఏడిపించి గరిష్టంగా రెండేళ్ళకే జనంలో వైసీపీని కంపు కొట్టించే మాస్టర్ ప్లాన్ ఏదో తెర వెనక జరుగుతోందని వైసీపీ నేతలు సైతం అనుమానిస్తున్నారు. మరి జగన్ అందుకు ప్రిపేర్ గా ఉన్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న.