జగన్ కోటరీలో ఫ్యూచర్ కమ్మ టీం ఇదే
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అలాగే అధికార పార్టీ వైసీపీలోనూ ఇప్పుడున్న పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు. అంటే.. ఇప్పుడు యువతగా ఉన్న [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అలాగే అధికార పార్టీ వైసీపీలోనూ ఇప్పుడున్న పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు. అంటే.. ఇప్పుడు యువతగా ఉన్న [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అలాగే అధికార పార్టీ వైసీపీలోనూ ఇప్పుడున్న పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు. అంటే.. ఇప్పుడు యువతగా ఉన్న నాయకులకు మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోందది. ఏపీలో అమరావతి తరలింపు.. రాజధాని వికేంద్రీకరణ అంశాలు., జగన్ కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో జగన్ ఈ వర్గంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యువ నాయకులకు ప్రాధాన్యం పెంచే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. వాస్తవంగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే కమ్మ నేతలకు ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ ఎలాంటి ప్రయార్టీ లేదు. జగన్ పదవులు ఇస్తానన్న కమ్మ నేతలకు పిలుపు కూడా లేదు. ఒక్క కొడాలి నానికి మంత్రి పదవి రావడం మినహా ఈ వర్గం రాజకీయంగా ఈ యేడాదిన్నర కాలంలో వెనకపడింది అన్నది వాస్తవం.
ఫుల్ స్టాప్ పెట్టేందుకు….
దీనికి తోడు అమరావతి తరలింపును అడ్డుకునేందుకు కమ్మ వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రాజధాని జిల్లాల్లో పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు కమ్మ వర్గంను పక్కన పెడుతున్నారన్న ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు జగన్ రాబోయే రోజుల్లో ఈ వర్గం యువనేతలకు మంచి అవకాశాలు ఇస్తారనే చర్చ నడుస్తోంది. తనకంటూ తాను మెచ్చే ఓ కమ్మ కోటరీని ఏర్పాటు చేసుకునే దిశగానే జగన్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్గాఉన్న దేవినేని అవినాష్‌కు వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. భవిష్యత్తులో అవినాష్‌కు విజయవాడ నగర పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన కూడా జగన్‌కు ఉంది.
వీరికి మంచి ఫ్యూచరట…
ఇక, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు కూడా వచ్చే ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పడితే.. ఏకంగా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, పెదకూరపాడు నుంచి విజయం సాధించిన నంబూరు శంకర్రావుకు కూడా బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందని చెబుతున్నారు. వీరిలో శివకుమార్ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. 2014 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన దెందులూరు నుంచి విజయం సాధించిన కోఠారు అబ్బయ్య చౌదరిని ఖచ్చితంగా జగన్ మంత్రిని చేస్తారనే టాక్ ఇప్పటి నుంచే వినిపిస్తుండడం గమనార్హం. ఇక్కడ టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడంతోపాటు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌కు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు అబ్బయ్య చౌదరి. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చే రెండేళ్లలోనే మంత్రి పదవిని ఇచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
రేసులో వీరు కూడా…..
అబ్బయ్య చౌదరి, జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే మంచి స్నేహితులు. జగన్ లండన్, యూరప్ పర్యటనలకు వెళితే ఖచ్చితంగా అబ్బయ్య కూడా వెంటే ఉంటారు. ఇక, మరింతమంది యువ కమ్మ నాయకులకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెబుతున్నారు. వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతోపాటు.. మంచి పదవిని కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అద్దంకి వైఎస్సార్ సీపీ ఇంచార్జ్‌గా ఉన్న సీనియర్ నేత బాచిన గరటయ్య కుమారుడు కృష్ణచైతన్య కూడా ఇదే వరుసలో ఉన్నారు.
యువనేతలకే ప్రాధాన్యం….
ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో కూడా కమ్మ వర్గానికే చెందిన యువ ఎన్నారైను లైన్లో పెట్టే ప్రక్రియ కూడా స్టార్ట్ చేశారట. ఇక వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడున్న కమ్మ నాయకులు సీనియర్లు కావడం, వయసు మీదపడడంతో వారి స్థానాల్లో ఈ కమ్మ యువనేతల కోటరీతో జగన్ రాజకీయం నడిపించే దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. ఏదేమైనా. వీరు పార్టీ మారకుండా.. వైసీపీ అభివృద్ధికి కృషి చేస్తే.. తిరుగులేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.