డెడ్ ఎండ్ కి వచ్చేసినట్లేనా… ?
కేంద్రం మీద వైసీపీ గుర్రుగా ఉంది. ఇది ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మాటలలో స్పష్టంగా తెలిసిపోతోంది. కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని, ఏపీ పట్ల [more]
కేంద్రం మీద వైసీపీ గుర్రుగా ఉంది. ఇది ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మాటలలో స్పష్టంగా తెలిసిపోతోంది. కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని, ఏపీ పట్ల [more]
కేంద్రం మీద వైసీపీ గుర్రుగా ఉంది. ఇది ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మాటలలో స్పష్టంగా తెలిసిపోతోంది. కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని, ఏపీ పట్ల వివక్ష చూపుతోందని కఠినమైన మాటలనే ఆయన వాడారు. దీనిని బట్టి చూస్తూంటే కేంద్రంతో ఢీ కొట్టాలని వైసీపీ డిసైడ్ అయిందా అన్నదే ఇక్కడ చర్చ. ఇలా ఎందుకు అకస్మాత్తుగా జగన్ నిర్ణయం తీసుకున్నారు అన్నదే ఇక్కడ డౌట్. జగన్ కి ఇపుడు వేరే దారి లేదు. అందుకే కేంద్రం మీద పోరాటానికి ఆయన రెడీ అయిపోయారు అన్న మాట వినిపిస్తోంది.
అన్నీ అయిపోయాయి…
జగన్ రెండేళ్ల ఏలుబడిలో చాలా సహనంతో ఉన్నారు. వీలున్నంతవరకూ అప్పులు చేసుకుంటూ ఏపీ బండిని నడిపించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా కూడా కేంద్ర సాయం లేకపోయినా ఏపీలో ఏదో రకంగా సర్దుబాటు చేసుకున్నారు. ఇక జగన్ వల్ల అసలు కావడంలేదు. ఆయన చేయాల్సింది కూడా ఏమీ లేదు. అన్నింటా అప్పులు చేశారు, ఇక అవి వచ్చే దారి కూడా లేదు. కేంద్రమే ఆదుకోవాలి. కానీ కేంద్రం తీరు చూస్తే అసలు ఖాతరు చేయడంలేదు. ఇలా అనేక కారణాలు కలుపుకుని అసహాయత తో కూడా ధర్మాగ్రహంగానే జగన్ ఇపుడు కేంద్రం మీద దండెత్తుతున్నారు అంటున్నారు.
సేమ్ సీన్ రిపీట్….
నాడు చంద్రబాబు నాలుగేళ్ళ పాటు కేంద్రంతో సావాసం చేసి చివరి ఏడాది మోడీని దుయ్యబెడుతూ బయటకు వచ్చారు. అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే రెండు పార్టీలు చివరి దాకా కలసే ఉన్నాయన్న అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది. దాంతో బీజేపీ తప్పులతో పాటు బాబు తప్పులూ ఉన్నాయని జనాలు గట్టిగా నమ్మి ఓడించారు. ఇపుడు జగన్ కేంద్రం మీద తిరగబడాలని అనుకుంటున్నారు. పైగా ఇది రైట్ టైమ్ అని కూడా భావిస్తున్నారు. కేంద్రంతో వైసీపీకి పొత్తు ఏమీ లేదు. పైగా రెండేళ్ళుగా సాయం కూడా ఏమీ చేయలేదు. ఇపుడు బీజేపీ మీద జనాలలో వ్యతిరేకత గట్టిగా ఉంది. అందువల్ల తాను ఎదురుతిరిగితే జనాలు తన వైపే ఉంటారు అన్న లెక్కతోనే జగన్ ఇలా చేశారు అంటున్నారు.
దేనికైనా రెడీ …?
ఇక జగన్ కి కేంద్రం అంటే భయం అని టీడీపీ సహా ఇతర విపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్నాయి. జగన్ అది తప్పు అని నిరూపించడానికి కూడా మోడీ తో ఢీ కొడుతున్నారు. దీని వల్ల పోయేది ఏమీ లేదు అన్నది కూడా ఆయన ఆలోచనగా ఉందిట. బెయిల్ రద్దు అయి జైలు కి వెళ్ళినా కూడా జనాల్లో సానుభూతి వస్తుంది, రాజకీయ వేధింపుల ఖాతాలో ఇది జమ అవుతుంది అని కూడా ఆలోచిస్తున్నారుట. మొత్తానికి బీజేపీకి ఎదుర్కోవడానికి ఇదే టైమ్ అని జగన్ అనుకుంటున్నారు. జగన్ అవసరం కేంద్రానికి ఉంది కాబట్టి వారు ఏమైనా తగ్గితే ఏపీ అభివృద్ధి సాధ్యపడుతుంది అన్న మరో ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ముసుగులు తొలగాయి. ఇక మోడీ పట్ల గట్టిగానే ఉండాలని వైసీపీ నిర్ణయించింది అన్నదే తాజా రాజకీయ కబురుగా ఉంది.