ఇక రద్దయినట్లే
శాసనమండలిలో జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి జగన్ సీిరియస్ గా తీసుకున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి జగన్ దాదాపుగా వచ్చినట్లే తెలుస్తోంది. శాసనమండలిలో బలం ఉన్న తెలుగుదేశం [more]
శాసనమండలిలో జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి జగన్ సీిరియస్ గా తీసుకున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి జగన్ దాదాపుగా వచ్చినట్లే తెలుస్తోంది. శాసనమండలిలో బలం ఉన్న తెలుగుదేశం [more]
శాసనమండలిలో జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి జగన్ సీిరియస్ గా తీసుకున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి జగన్ దాదాపుగా వచ్చినట్లే తెలుస్తోంది. శాసనమండలిలో బలం ఉన్న తెలుగుదేశం పార్టీ తాము చేపట్టబోయే ప్రతి పనికీ అడ్డుతగులుతున్నందున ఇక దానిని కొనసాగించడం వీలు లేదని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం నుంచే ఆయన న్యాయనిపుణులు, సీనియర్ నేతలు చర్చలు జరిపారు. ఇటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా జగన్ మాత్రం మండలిపైనే ప్రత్యేక దృష్టి పెట్టి అందరి సలహాలు తీసుకున్నారు.
ఇంకా నాలుగున్నరేళ్లు ఉన్నా…..
వైఎస్ జగన్ కు ఇంకా దాదాపు నాలుగున్నరేళ్ల అధికారం ఉంది. మరో రెండున్నరేళ్ల పాటు మండలిలో స్థానాలు ఖాళీ అయ్యే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర ఓటమి పాలయిన తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో పైచేయి సాధించడాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు. వైసీపీకి శాసనసభలో తొమ్మిది మంది మాత్రమే సభ్యులున్నారు. వారిలో ఇద్దరు మంత్రులుగా కూడా ఉన్నారు. అయినా జగన్ మండలిని రద్దు చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
బాబు ఓడిపోయి కూడా…..
చంద్రబాబు ఓడిపోయినా రాజకీయ దురుద్దేశ్యంతో తనను ఇకపైనా అడుగడుగునా అడ్డుకుంటారని జగన్ భావిస్తున్నారు. అందుకే శాసనమండలిని ఒక్కసారిగా రద్దు చేయడం సరికాదని భావించిన జగన్ గురువారం శాసనసభలో దీనిపై చర్చ పెట్టారు. సోమవారం కూడా ఇదే అంశంపై చర్చ జరపాలని నిర్ణయించారు. అంటే జగన్ అందరి సలహాలు, సూచనలతోనే శాసనమండలిని రద్దు చేయడానికి సిద్ధమయనట్లే కన్పిస్తుంది.
స్పష్టమైన సంకేతాలు…..
ఈరోజు జరిగిన అసెంబ్లీలో జగన్ పరోక్షంగా మండలి రద్దు అనే సంకేతాలు ఇచ్చారు. ఏడాదికి అరవై కోట్లు శాసనమండలికి ఖర్చు అవుతుందని ఆయన చెప్పడాన్ని బట్టి ప్రజలకు కూడా రద్దు చేస్తే తప్పులేదన్న సంకేతాలను పంపడానికేనని చెప్పారు. ఇక ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లులను కూడా శాసనమండలి తిరస్కరించిందని జగన్ చెప్పడాన్ని బట్టి మండలిని రద్దు చేయడం కరెక్టేనని ప్రజలచేతే చెప్పించాలని భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కేవలం అసెంబ్లీలో చర్చ ఇక నామమాత్రమే. శాసనమండలి దాదాపు ఇక రద్దయిపోతున్నట్లే.