జగన్ తప్పు చేస్తున్నారా..?
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి పలు అస్త్రాలను స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనే ఇచ్చారు. ముఖ్యంగా ఆయన నివాసంపై ఎన్నికల వేళ టీడీపీ పెద్దఎత్తున [more]
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి పలు అస్త్రాలను స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనే ఇచ్చారు. ముఖ్యంగా ఆయన నివాసంపై ఎన్నికల వేళ టీడీపీ పెద్దఎత్తున [more]
ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి పలు అస్త్రాలను స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనే ఇచ్చారు. ముఖ్యంగా ఆయన నివాసంపై ఎన్నికల వేళ టీడీపీ పెద్దఎత్తున విమర్శలు గుప్పించింది. అమరావతిలో స్వంత ఇళ్లు కట్టుకున్నా జగన్ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి సైతం ఆయన హైదరాబాద్ నుంచే వెళ్లి మళ్లీ రాత్రికి హైదరాబాద్ చేరుకునే వారు. దీంతో తెలుగుదేశం పార్టీకి జగన్ ను టార్గెట్ చేయడానికి ఈ అంశం బాగా కలిసొచ్చింది. జగన్ హైదరాబాద్ ను విడిచి రారని, తెలంగాణలోనే పోటీ చేయాలని, ఏపీలో ఉండటానికి కూడా ఇష్టపడని జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం ప్రతీ రోజు ఎన్నికల ప్రచార సభల్లో ఇవే విమర్శలు గుప్పించారు. మధ్యలో జగన్ నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఇక టీడీపీ విమర్శలకు జగన్ చెక్ పెట్టారని, అమరావతి కేంద్రంగానే జగన్ రాజకీయాలు చేస్తారని అంతా భావించారు. వైసీపీ నేతలు కూడా ఇదే చెప్పారు.
టీడీపీ విమర్శలే నిజమవుతున్నాయి…
అయితే, గృహప్రవేశం చేసిన తెల్లారి నుంచే జగన్ మళ్లీ హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే, ఎన్నికల సమయం కావడంతో ఫోన్ ట్యాపింగ్ వంటి ఇబ్బందులు ఉంటాయని భావించి జగన్ హైదరాబాద్ లో ఉంటున్నారని వైసీపీ నేతలు కవర్ చేసుకున్నారు. ఎన్నికల వేళ ఈ అంశం పద్దగా ప్రభావం చూపకపోయినా ఎంతోకొంత మాత్రం నష్టం జరిగింది. ఇక, ఎన్నికల తర్వాత కూడా జగన్ తన వైఖరిని మాత్రం మార్చుకోలేదు. పోలింగ్ రోజు పులివెందులలో ఓటు వేసిన జగన్ సాయంత్రానికి మళ్లీ లోటస్ పాండ్ కు చేరుకున్నారు. పోలింగ్ సరళిపైన కూడా హైదరాబాద్ లోనే ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ముగిసి 20 రోజుల పైనే అవుతున్నా జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం లేదు. విశాఖపట్నంలో ఓ వివాహ వేడుకకు, కడపకు ఒకసారి వెళ్లడం తప్పించి జగన్ ఇంతవరకు పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వెళ్లలేదు.
ముఖ్యమంత్రి అయినా అక్కడే ఉంటారా..?
ఆంధ్రప్రదేశ్ కు ప్రతిపక్ష నేతగా ప్రజలకు దగ్గరగా ఉండటం జగన్ బాధ్యత. కానీ ఆయన మాత్రం లోటస్ పాండ్ విడిచిపెట్టడం లేదు. దీంతో వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన విమర్శలే నిజమవుతున్నాయి. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకువెళుతున్నాయి. ఎన్నికల ముందు టీడీపీ ఈ ప్రచారం పెద్ద ఎత్తున చేసినా కూడా అంతకుముందు ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ లోనే సుదీర్ఘ పాదయాత్ర చేయడం వల్ల ప్రజలు పెద్దగా ఈ విమర్శలను పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఎన్నికలు అయిపోయాయి. కానీ, ఇప్పుడైనా జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఉండకపోతే విజిటింగ్ లీడర్ గా, టూరిస్ట్ గా ఆయన ప్రజలు భావించే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అయినా ఆయన అమరావతిలో ఉంటారా లేదా హైదరాబాద్ లో ఉంటారా అనే విమర్శలు వస్తున్నాయి.