అమరావతి… ఆ పేరు ఎక్కడో విన్నామే ?
అమరావతి ఈ పేరు చంద్రబాబు నోట పదే పదే పలికేది. చంద్రబాబు అనుకుని ఉంటారు. తన హయాంలో అమరావతి ఎంతో కొంత పూర్తి అయినా కూడా చరిత్రలో [more]
అమరావతి ఈ పేరు చంద్రబాబు నోట పదే పదే పలికేది. చంద్రబాబు అనుకుని ఉంటారు. తన హయాంలో అమరావతి ఎంతో కొంత పూర్తి అయినా కూడా చరిత్రలో [more]
అమరావతి ఈ పేరు చంద్రబాబు నోట పదే పదే పలికేది. చంద్రబాబు అనుకుని ఉంటారు. తన హయాంలో అమరావతి ఎంతో కొంత పూర్తి అయినా కూడా చరిత్రలో తన పేరు శాశ్వతంగా ఉంటుందని, ఇపుడు ఆ చరిత్ర కరిగిపోతోంది. అమరావతి ఆనవాళ్ళు ఒక్కోటిగా తొలగిపోనున్నాయి. బహుశా గట్టిగా అమరావతి పేరుని 2020 సంవత్సరం అంతం వరకూ చెప్పుకుంటామేమో. ఆ తరువాత అమరావతి అన్న పేరు రాయడానికి కూడా మీడియాలో అవకాశం ఉండదు. ఎందుకంటే రాజధానే కాదు అన్నీ కూడా అక్కడ నుంచి పూర్తిగా షిఫ్ట్ అవుతాయి కాబట్టి.
ఆసుపత్రిగా అసెంబ్లీ….
అమరావతిలో భవనాలను ఏంచేయాలన్న దాని మీద ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని అంటున్నారు. ఆయన మదిలో అమరావతి ఓ అద్భుతమైన హెల్త్ సిటీగా రూపుదిద్దుకోవాలని ఉందిట. అమరావతిలోని అసెంబ్లీ, ఇతర కీలకమైన భవనాలను ఎంపిక చేసి అక్కడ పేదల కోసం మంచి ఆసుపత్రికి ఇవ్వలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అదే విధంగా అమరావతిలోని సచివాలయం విషయంలోనూ జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నారు.
ఆ వర్శిటీ అక్కడ…..
అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా చేస్తామని వైసీపీ సర్కార్ ఈ సరికే ప్రకటించింది. దాంతో నాగార్జున యూనివర్శిటీకి సచివాలయం మొత్తం అప్పగించాలని జగన్ పెద్ద ప్లాన్ వేస్తున్నారుట. అలాగే వివిధ డిపార్టుమెంట్లను బ్లాకులుగా చేయాలని కూడా జగన్ డిసైడ్ అయ్యారట. ఇక నిర్మాణంలో ఉన్న జడ్జిల నివాసాలు, మంత్రుల క్వార్టర్లు కూడా వైస్ చాన్సలర్ నివాసాలుగా మార్పు చేయాలన్నది కూడా జగన్ మరో ఆలోచనగా ఉందిట.
గుంటూరులో కొత్త అసెంబ్లీ……
మరో వైపు చూసుకుంటే అమరావతిని శాసన రాజధాని చేస్తామని చెప్పిన జగన్ అసెంబ్లీని ఆసుపత్రిగా మార్చబోతున్నారంటేనే ఆ ప్రభ ఇకపైన అక్కడ కనిపించదని అర్ధం చేసుకోవాలి. దానికి బదులుగా గుంటూరులో జాతీయ రహదారి వద్ద కొత్తగా అసెంబ్లీ కాంప్లెక్స్ ని నిర్మాణం చేయడానికి కూడా జగన్ సర్కార్ ఆలోచనలు చేస్తోందని అంటున్నారు. అలాగే నాగార్జున యూనివర్శిటీకి సచివాలయం అప్పగించి ఇపుడు ఉంటున్న వర్శిటీ క్యాంపస్ ని తీసుకుని ప్రభుత్వం అభివృధ్ధి పనుల కోసం వాడుకోవాలన్నది కూడా జగం మదిలో మెదిలే ఆలోచనలుగా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2020 ముగిసేసరికి అమరావతి చరిత్రలోకి వెళ్ళిపోతుందని అంటున్నారు.