చిన్న శ్రీను ఫుల్లుగా నచ్చాడట
ఒకప్పుడు ఆయన హవా మామూలుగా లేదు. ఆయన ఇంటి ముందు ఎప్పుడూ పది కార్లకు తక్కువ కాకుండా ఉండేవి. పేరొందిన నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు ఆయన ఇంటి [more]
ఒకప్పుడు ఆయన హవా మామూలుగా లేదు. ఆయన ఇంటి ముందు ఎప్పుడూ పది కార్లకు తక్కువ కాకుండా ఉండేవి. పేరొందిన నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు ఆయన ఇంటి [more]
ఒకప్పుడు ఆయన హవా మామూలుగా లేదు. ఆయన ఇంటి ముందు ఎప్పుడూ పది కార్లకు తక్కువ కాకుండా ఉండేవి. పేరొందిన నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు ఆయన ఇంటి ముందు బారులు తీరేవారు. ఆయనేమీ మంత్రి కాదు. ఎమ్మెల్యే కూడా కాదు. కాకుంటే అప్పట్లోనూ, ఇప్పుడూ మంత్రిగారి మేనల్లుడు. ఆయనే చిన్న శ్రీను. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను అంటే అందరికీ సుపరిచితమే. చిన్న శ్రీను ఇప్పుడు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. జగన్ కూడా చిన్న శ్రీనుకు త్వరలో ఊహించని పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తుంది.
జిల్లా రాజకీయాలను…
బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను చిన్న శ్రీను శాసించేవారు. మేనమామకు చెడ్డపేరు రాకుండా పార్టీ వ్యవహారాలతో పాటుగా అధికారిక పనులను కూడా ఎవరినీ నొప్పించకుండా పూర్తి చేసేవారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ అప్పట్లో చిన్న శ్రీను ప్రభావం చూపేవారు. బొత్స సత్యనారాయణకు షాడో మంత్రిగా చిన్న శ్రీను పనిచేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత బొత్స కుటుంబం వైసీపీలో చేరడంతో ఇప్పుడు ఆ పార్టీలోనూ చిన్న శ్రీను కీలకంగా మారారు.
టిక్కెట్ ఇవ్వబోయినా…..
అయితే కాంగ్రెస్ హయాంలో అంత లేకపోయినా చిన్న శ్రీను ఇప్పటికీ జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారనే చెప్పాలి. నిజానికి చిన్న శ్రీనుకు జగన్ స్వయంగా ఎస్ కోట టిక్కెట్ ఇవ్వబోయినా ఆయన తిరస్కరించడంతోనే కడుబండి శ్రీనివాసరావుకు ఇచ్చారట. ఆశావహులు ఎక్కువ ఉన్నందున తాను పోటీ చేయడం లేదని చిన్న శ్రీను చెప్పిన మాటలు జగన్ కు నచ్చాయంటారు. ఇక జగన్ అప్పజెప్పిన ఏ పనినైనా సమర్థవంతంగా చిన్న శ్రీను పూర్తి చేస్తారట. పాదయాత్ర ఉత్తరాంధ్రలో సక్సెస్ కావడానికి ఒకరకంగా చిన్న శ్రీను కారణమన్నది వైసీపీ సీనియర్ నేతలు అంగీకరిస్తున్న విషయం. అధికారంలోకి వస్తే చిన్న శ్రీనుకు మంచి పదవి ఇవ్వాలని జగన్ అప్పట్లోనే ఆలోచించారని చెబుతుంటారు.
పదవి గ్యారంటీ అంటూ….
తాజాగా విజయనగరం జిల్లాలో ఒక టాక్ నడుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి ఛైర్మన్ పదవి చిన్న శ్రీనును వరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పదవికి సాలూరు ఎమ్మల్యే రాజన్నదొరతో పాటు కోలగట్ల వీరభద్రస్వామి పేరు కూడా వినపడుతున్నా జగన్ చిన్న శ్రీనుకు ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. ఇప్పటి వరకూ పదవులపై ఆశలు పెట్టుకోని చిన్న శ్రీను ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. విజయనగరంలో వైసీపీ విజయానికి తెర వెనక కృషి చేసిిన చిన్న శ్రీనుకు జగన్ పదవి ఇవ్వడం గ్యారంటీ అట. అది ఏ పదవి అన్నది ఇప్పుడు జిల్లా నేతల్లో ఆసక్తి కరంగా మారింది. మొత్తం మీద బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుకు త్వరలోనే పెద్ద పదవి వరించబోతుందన్న మాట వాస్తవం.