వీరికి తెలిసే అంతా జరుగుతుందా?
ఏపీలో తెలుగుదేశం పార్టీ సంగతి అందరికీ తెల్సిందే. ఘోరాతిఘోరంగా ఎన్నికల్లో ఓడిపోతున్నా పార్టీగా వాడిపోతున్నా కూడా చంద్రజాలంతో ఎప్పటికపుడు జగన్ మీద రాజకీయంగా పై చేయి సాధించేందుకు [more]
ఏపీలో తెలుగుదేశం పార్టీ సంగతి అందరికీ తెల్సిందే. ఘోరాతిఘోరంగా ఎన్నికల్లో ఓడిపోతున్నా పార్టీగా వాడిపోతున్నా కూడా చంద్రజాలంతో ఎప్పటికపుడు జగన్ మీద రాజకీయంగా పై చేయి సాధించేందుకు [more]
ఏపీలో తెలుగుదేశం పార్టీ సంగతి అందరికీ తెల్సిందే. ఘోరాతిఘోరంగా ఎన్నికల్లో ఓడిపోతున్నా పార్టీగా వాడిపోతున్నా కూడా చంద్రజాలంతో ఎప్పటికపుడు జగన్ మీద రాజకీయంగా పై చేయి సాధించేందుకు బాబు రెడీ అవుతూనే ఉన్నారు. ఆయనకు వ్యవస్థలలో ఉన్న పలుకుబడి పరిచయాలు వ్యూహాలు కూడా ఇలా పనికివస్తున్నాయి అని చెప్పాలి. మరి దూకుడే వ్యూహంగా మార్చుకుని ముందుకు సాగే జగన్ బాబుని ఎదుర్కోవడం అంటే చాలా కష్టమే. కానీ రెండేళ్ల సీఎం గా జగన్ ఈ విషయంలో బాగానే సక్సెస్ అయ్యారనుకోవాలి.
అండదండలతో….?
ఏపీకి కేంద్రం నుంచి ఏం ఒరిగింది అని అంతా అంటారు. ఆ విషయం పక్కన పెడితే జగన్ కి కేంద్రంలోని పెద్దలకు మధ్య సంబంధాలు చాలా బాగా ఉన్నాయని అంతా అంటారు. జగన్ ఎంతగా జోరు చూపించినా ఆయనకు బాబు అడుగడుగునా బ్రేకులు వేస్తున్నా కూడా నెట్టుకుని వచ్చే నేర్పు వెనక కేంద్ర పెద్దలు ఉన్నారని అంటారు. కేంద్రంలోని మోడీ అమిత్ షాలకు ఏపీలో బాబు మీద పెద్దగా నమ్మకం లేదు అని చెబుతారు. పైగా బాబు 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇతర విపక్షాలతో అంటకాగడాన్ని వారు కళ్లారా చూశాక ఇక మనసు మార్చుకుంటారు అనుకుంటే పొరపాటే అన్న మాట ఉంది.
అశలు తీరవా…?
ఇక మరో వైపు చూస్తే జగన్ని ఎలాగైనా జైలుకు పంపాలని చంద్రబాబు వేయని ఎత్తులు లేవు అంటారు. వీలు దొరికితే చాలు జగన్ కేసుల మీదనే ఆయన దృష్టి సారిస్తారు అంటారు. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, ఏకంగా ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో కేసు వేశారు. అయితే ఇక్కడే కొన్ని రాజకీయ చిత్రాలు జరుగుతున్నాయని చెప్పాలి. కౌంటర్ దాఖలు చేయడానికి ఒక వైపు జగన్ తరఫున న్యాయ వాదులు గడువు కోరుతూంటే సీబీఐ తరఫున కూడా న్యాయవాదులు గడువు కోరడమే ఆ చిత్రం. ఒక విధంగా జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో ఏదో జరుగుతుందీ అన్న చర్చ నుంచి ఏం జరగనుంది అన్న దాకా కధ నడుస్తోంది అంటే తెర వెనక ఏమైనా మతలబు ఉందా అన్నదే సందేహం.
నిజమేనా…?
ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద రచ్చగా మారింది. దీని మీద కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రఘురామ కుటుంబ సభ్యులు కూడా కేంద్రానికి లేఖ రాసారు. అయితే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రఘురామ అరెస్ట్ తతంగమంతా కేంద్ర మంత్రి అమిత్ షా అనుమతితోనే జరిగింది అని తాజాగా అంటున్నారు. జగన్ కి బీజేపీ సహకారం ఉంది అని అర్ధం వచ్చేలా ఆయన ఈ కీలక కామెంట్స్ చేస్తున్నారు. మరి అదే నిజం అనుకుంటే రఘురామ ఫక్త్ బీజేపీ మనిషిని అని చెప్పుకుంటున్నారు కదా. తేడా ఎక్కడ వచ్చింది. బీజేపీ జగన్ కి ఎందుకు మద్దతుగా ఉంటుంది. ఇవన్నీ ప్రశ్నలే. రాజకీయాల్లో పైకి కనిపించే వాటి మీద సందేహాలే ఎన్నో వస్తూంటాయి. కానీ లోపల విషయం తెలిస్తేనే డౌట్ క్లారిఫై అవుతుంది. ఇవన్నీ ఎలా ఉన్న ఒక్క లాజిక్ మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి. ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా లాభం చేకూర్చే పనికి మాత్రం బీజేపీ జాతీయ పెద్దలు ఎపుడూ మద్దతు ఇవ్వరు అని. ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం బాబు అండ్ కోకు రఘురామ ఎపిసోడ్ తో పాటు చాలా విషయాల్లో ఆవేశం, ఆయసమే మిగులుతాయి అనే చెబుతున్నారు.