ఇద్దరం ఒక్కటయితే…?
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ లు సుదీర్ఘంగా చర్చించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలతో పాటుగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వారు అసంతృప్తి [more]
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ లు సుదీర్ఘంగా చర్చించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలతో పాటుగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వారు అసంతృప్తి [more]
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ లు సుదీర్ఘంగా చర్చించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలతో పాటుగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల చిన్న చూపు చూస్తుందని ఇరువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఇద్దరం కలసి మోదీని కలవాలని నిర్ణయించారు. మోదీకి తమ రాష్ట్రాల సమస్యలను వివరించడంతో పాటుగా కేంద్రం నుంచి నిధులను తెచ్చుకునేందుకు కార్యాచరణ రూపిందించడం పై జగన్, కేసీఆర్ లు చర్చించారు.
నాలుగున్నర గంటల పాటు….
దాదాపు నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా విభజన సమస్యలను వీలయినంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఇక ముఖ్యంగా గోదావరి జలలాను కృష్ణా నదికి అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించాలని నిశ్చయించారు. తక్కువ ఖర్చుతో గోదావరి జిల్లాలను కృష్ణాకు తరలించి అక్కడి నుంచి రాయలసీమకు తరలించడంపై దాదాపు ఐదు ప్రతిపాదనలను ఇద్దరు సీఎంలు పరిశీలించినట్లు తెలిసింది.
మరోసారి సమావేశం…..
అయితే వీటిపై ఇంకా ఒక నిర్ణయం రాకపోయినా మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు వారి రాష్ట్ర అధికారులతో సమావేశమయిన తర్వాత మరోసారి చర్చించాలని భావించారు. దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలించడం ద్వారా రాయలసీమలకు సాగు, తాగునీటిని అందించే ప్రతిపాదనపై ఎక్కువ సేపు చర్చించినట్లు తెలిసింది. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను తరలించడం మేలన్న అభిప్రాయానికి జగన్, కేసీఆర్ లు వచ్చినట్లు సమాచారం.
విపక్షాలను వదలొద్దు…..
ఇక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతన్న రాజకీయ పరిణామాలపై కూడా కేసీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలను చేసినట్లు తెలిసింది. విపక్షాలు పాలన సాగనివ్వవని, మీరు వెళ్లే మార్గమే సరైనదని కేసీఆర్ జగన్ తో అన్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై కూడా వారు ప్రధానంగా చర్చించారు. బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వారు చర్చించినట్లు తెలిసింద. మరోసారి జగన్, కేసీఆర్ లు భేటీ తర్వాత గోదావరి జలాల మళ్లింపు పై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాలని కేసీఆర్ ను జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.