‘‘పవర్’’ సెంటర్లు పెరిగిపోయాయే
అక్కడ ఎన్ని పవర్ సెంటర్స్…. మూడా…. నాలుగా…అయిదా…? ఏపీ సెక్రటేరియట్లో పవర్ సెంటర్స్ మీద మీడియా సర్కిల్స్‌లో బోలెడన్ని సెటైర్లు. ముఖ్యమంత్రి కొలువుదీరే సెక్రటేరియట్ మొదటి బ్లాక్‌లో [more]
అక్కడ ఎన్ని పవర్ సెంటర్స్…. మూడా…. నాలుగా…అయిదా…? ఏపీ సెక్రటేరియట్లో పవర్ సెంటర్స్ మీద మీడియా సర్కిల్స్‌లో బోలెడన్ని సెటైర్లు. ముఖ్యమంత్రి కొలువుదీరే సెక్రటేరియట్ మొదటి బ్లాక్‌లో [more]
అక్కడ ఎన్ని పవర్ సెంటర్స్…. మూడా…. నాలుగా…అయిదా…? ఏపీ సెక్రటేరియట్లో పవర్ సెంటర్స్ మీద మీడియా సర్కిల్స్‌లో బోలెడన్ని సెటైర్లు. ముఖ్యమంత్రి కొలువుదీరే సెక్రటేరియట్ మొదటి బ్లాక్‌లో ఉన్న పవర్ సెంటర్ల మీద బోలెడు చర్చ నడుస్తోంది. నిజానికి గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు పాలనా పరంగా పరిస్థితులు మెరుగు పడ్డాయని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. గత ఐదేళ్లలో.. అందులో 2016లో రాజధాని అమరావతి తరలి వచ్చాక ఓ సామాజిక వర్గానికి తప్ప మిగిలిన వారికి ఫస్ట్ బ్లాక్‌లో ఎంట్రీ కూడా ఉండేది. కాదు. మొదట్లో ఓ గిరిజన ఐఏఎస్ ఉన్నా ఆ తర్వాత ఆయన్ని పంపేశారు. కేవలం ఓ కులానికి చెందిన అధికారుల్ని మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించుకోవడం మిగిలిన అధికారులకు మింగుడుపడేది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు చోటు దక్కింది. దళిత ఐఏఎస్ అధికారులకు కీలక పోస్టింగ్‌లు దక్కాయి. ఇదంతా నాణానికి ఓ వైపుగా ఉన్నా అదే సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎవరి పరిధి ఎంత వరకు అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
ఎల్వీ సీఎస్ గా ఉన్నా…..
ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం తర్వాత పాలానా వ్యవస్థ మొత్తానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యులై ఉంటారు. ఎన్నికల సంఘం సూచనలు ఉల్లంఘించడంతో అప్పటి సీఎస్ అనిల్ చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్నే సీఎస్‌గా కొనసాగించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి సలహాదారుగా మాజీ సీఎస్ కల్లాం అజేయ కుమార్‌ని నియమించారు. సౌమ్యంగా ఉండే అజయ్ కల్లంను గత ప్రభుత్వం రెండు నెలల కాలానికి మాత్రమే సీఎస్‌గా నియమించి అవమానపరిచేలా వ్యవహరించింది. సామాజిక సమీకరణలతోనే ఆయన్ని అవమానించినట్లు ప్రచారం జరిగింది.
కోటరీలు పెరిగిపోయి…..
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అజయ్ కుమార్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా చోటు దక్కింది. ఇదంతా బాగానే ఉన్నా ఎవరి నిర్ణయాలను ఎవరు అమోదించాలనే విషయంలోనే క్లారిటీ లేకుండా పోయింది. సీఎస్ చుట్టూ ఓ వర్గం ఉండటం., సలహాదారు దగ్గర మరో వర్గం ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏ విషయంలో అయినా సీఎస్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నా., అన్నీ సలహాదారుకి చెప్పే చేయాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యమంత్రి సైతం ఎవరి పరిధి ఏమిటనే క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య వచ్చినట్లు చెబుతున్నారు. ఇక సీఎంఓలో మరో కీలక అధికారి ధనుంజయ్ రెడ్డి. ప్రజా సంబందాల సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి చుట్టూ మరో కోటరీ ఉంది. ఇలా సీఎం చుట్టూ స్వతంత్ర వ్యవస్థలు ఎక్కువై పోవడం., కొన్ని అంశాల్లో ఒకరి నిర్ణయాలను మరొకరు అమోదించే పరిస్థితి లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వీటిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీలైనంత త్వరగా మేలుకుంటే బాగుంటుంది.