సొంత జిల్లాలో జగన్ను వెంటాడుతున్న భయం
సీఎం పీఠం ఎక్కిన ఏ నాయకుడికైనా సొంత జిల్లాను అభివృద్ది చేసుకోవాలనే ఉంటుంది. ఆదిశగా అడుగులు వేయాలనే కోరిక కూడా ఉంటుంది. అయితే గతంలో పాలించిన నాయకులు [more]
సీఎం పీఠం ఎక్కిన ఏ నాయకుడికైనా సొంత జిల్లాను అభివృద్ది చేసుకోవాలనే ఉంటుంది. ఆదిశగా అడుగులు వేయాలనే కోరిక కూడా ఉంటుంది. అయితే గతంలో పాలించిన నాయకులు [more]
సీఎం పీఠం ఎక్కిన ఏ నాయకుడికైనా సొంత జిల్లాను అభివృద్ది చేసుకోవాలనే ఉంటుంది. ఆదిశగా అడుగులు వేయాలనే కోరిక కూడా ఉంటుంది. అయితే గతంలో పాలించిన నాయకులు ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు దాదాపు ఐదున్నర సంవత్సరాలు సీఎంగా చేసిన వైఎస్ వంటివారు కూడా ఈ విషయంలో ముందు దూకుడు చూపించినా.. తర్వాత మాత్రం ఎన్నికల్లో ఎఫెక్ట్ అవుతుందని వెనక్కి తగ్గి.. ముఖ్యమైన వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో వారిపై అటు స్థానికంగాను, ఇటు బయట కూడా పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ సీఎం జగన్ విషయంలో బయట నుంచి వ్యతిరేకత పొంచి ఉందని అంటున్నారు పరిశీలకులు.
అన్నీ అక్కడికే…..
దీనికి ప్రధాన కారణం అభివృద్ధి పేరిట అన్నింటినీ కడప జిల్లాకే తరలిస్తుండడం. ఇది నిజమే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. జిల్లాలోని 4,025.68 ఎకరాల్లో నాలుగు భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.35,090 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల 3.54 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. వైఎస్సార్ ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ , వైఎస్సార్ జగనన్న మెగా ఇండ్రస్టియల్ హబ్ , పులివెందులలో ఇంటిలిజెంట్ సెజ్ పాదరక్షల తయారీ కేంద్రం, పులివెందుల ఆటోనగర్ పార్కులు ఇక్కడ ఏర్పడనున్నాయి. నిజానికి దీనివల్ల జిల్లా భారీ ఎత్తున అభివృద్ధి అయితే జరుగుతుంది.
ఇతర ప్రాంతాలను……
కానీ, అదే సమయంలో ఈ అభివృద్ధి పార్టీపైనా, జగన్పై నా తీవ్ర వ్యతిరేకతకు కూడా కారణం అవుతుందని అంటున్నారు. తన సొంత జిల్లాను మాత్రమే ఇంత రేంజ్లో అభివృద్ధి చేసుకున్నారు. మరి శ్రీకాకుళం.. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాలను ఎందుకు పట్టించుకోలేదు. కనీసం ఒకటి రెండు ప్రాజెక్టులనైనా అక్కడ ఇవ్వాలి కదా? అనే ప్రశ్నలు ఇప్పటికే తెరమీదకి వస్తున్నాయి. ఇవి ఎన్నికల నాటికి మరింత బలపడితే.. జగన్కు ఇబ్బందేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. పైగా ఈ ప్రాజెక్టుల రాకతో.. స్థానిక ప్రజలకు లబ్ధి చేకూరినా.. రాజకీయంగా జగన్కు ఒనగూరే ప్రత్యేక లబ్ధి అంటూ ఏమీ ఉండదు.
పార్టీ బలంగా ఉన్నా….
ఎందుకంటే.. కడపలో ఇప్పటికే సంస్థాగతంగా వైసీపీ పునాదులు బలంగా ఉన్నాయి. సో.. ప్రత్యేకంగా వైసీపీకి వచ్చే లబ్ధి, ఓటు బ్యాంకు కనిపించడం లేదు. కానీ, ఇలా అభివృద్ధి మొత్తాన్నీ కడపకే తరలించేస్తే.. మిగిలిన జిల్లాలపై మాత్రం రాజకీయంగా ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. ఇదే విషయం జగన్కు కూడా ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో… ప్రజలను ఎలా సంతృప్తి పరుస్తారో ? చూడాలి.