జగన్ స్ట్రయిట్ గా ఆ కులాన్ని టార్గెట్ చేశారు ?
ఆంధ్రప్రదేశ్ లో కమ్మ – రెడ్డి ల నడుమ అధికార ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. ఈ రెండు కులాలే అధికారాన్ని దశాబ్దాలుగా పంచుకుంటున్నాయి. ఎన్టీఆర్ సమయంలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కమ్మ – రెడ్డి ల నడుమ అధికార ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. ఈ రెండు కులాలే అధికారాన్ని దశాబ్దాలుగా పంచుకుంటున్నాయి. ఎన్టీఆర్ సమయంలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కమ్మ – రెడ్డి ల నడుమ అధికార ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. ఈ రెండు కులాలే అధికారాన్ని దశాబ్దాలుగా పంచుకుంటున్నాయి. ఎన్టీఆర్ సమయంలో టిడిపి కి కులముద్ర పెద్దగా లేకపోయినా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కానీ ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు మెగా కాంట్రాక్ట్ లు ఎమ్యెల్యే, ఎంపి టికెట్ల పంపిణీలో కమ్మ వారి ఆధిపత్యం స్పష్టంగా ప్రస్ఫుటం అయ్యేలా కొనసాగిందనేది నిర్వివాదాంశం. అయితే నాడు సంప్రదాయ మీడియా లో సింహ భాగం చంద్రబాబు వైపే ఉండటంతో దీన్ని బయట పడకుండా కానీ ప్రజల్లో చర్చ లేకుండా జాగ్రత్త పడేది.
సోషల్ మీడియా వచ్చాక …
గత ఐదేళ్ల నుంచి సోషల్ మీడియా ప్రభంజనం నడుస్తుంది. ఫలితంగా ప్రతీ అంశం ప్రజల్లో చర్చకు తెరతీస్తోంది. అధికారపార్టీల అడుగుల చప్పుడు జనం సునిశితంగా గమనిస్తున్నారు. దాంతో బాబు తమ కులానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా విపక్షాలు చర్చకు పెట్టేవి. అంతకుముందు చిరంజీవి ప్రజారాజ్యం 2009 లో పెట్టినప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు సామాజిక సమీకరణాలపై అందరిలో అవగాహన పెరిగింది. ఆ తరువాత వైసిపి పదేపదే బాబు తన కుల అనుకూల నిర్ణయాలపై రచ్చే చేసేది. ఇది కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. వీటన్నిటి ఫలితమే గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘోరంగా చతికిల పడింది.
జగన్ ఇప్పుడు కూడా …
ఎపి సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు కూడా కమ్మ కులాన్ని వదిలి పెట్టడం లేదు. ఒక కులం లబ్ది పొందేందుకే అమరావతి, రియల్ ఎస్టేట్ కోసమే రాజధాని అన్న అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకుపోతూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తూ కూడా జగన్ అమరావతిలో ఒక కులం ఉండేందుకే రాజధానిని రూపొందించిందని దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు డైరెక్ట్ గా పేర్కొన్నారు. కొందరి కోసం కాకుండా అందరికోసం రాష్ట్ర రాజధాని ఉండాలనే తాను మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు జనామోదం కోసం ప్రజల్లో మళ్ళీ చర్చకు తెరతీశారు. ఇది ఇప్పుడు ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి.