కుట్రలను ఛేదించలేకపోతే కష్టమే?
అంతర్వేది మొదలు రామతీర్ధం, రాజమండ్రి వరకు ఎక్కడో అక్కడ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తున్నారు. ఆ వివాదాలు అటు తిరిగి ఇటు తిరిగి అధికారపార్టీకే చుట్టుకుంటుంది. గత [more]
అంతర్వేది మొదలు రామతీర్ధం, రాజమండ్రి వరకు ఎక్కడో అక్కడ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తున్నారు. ఆ వివాదాలు అటు తిరిగి ఇటు తిరిగి అధికారపార్టీకే చుట్టుకుంటుంది. గత [more]
అంతర్వేది మొదలు రామతీర్ధం, రాజమండ్రి వరకు ఎక్కడో అక్కడ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తున్నారు. ఆ వివాదాలు అటు తిరిగి ఇటు తిరిగి అధికారపార్టీకే చుట్టుకుంటుంది. గత ఆరునెలలుగా మొదలైన సంఘటనలు ఆగడం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ? వరుస విగ్రహాల విధ్వంసం వల్ల ఎవరికి ప్రయోజనం. వీటి వెనుక మిస్టరీ ని పోలీసులు విజయవంతంగా ఎందుకు ఛేదించలేకపోతున్నారు. హిందువుల్లో తీవ్ర భావోద్వేగాలను ప్రేరేపించే ఈ ఘటనలు సమాజంలో ప్రమాదకర పరిణామాలకు దారితీసేవి. ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరుగుతున్నట్లు వరుసగా జరుగుతున్న ఘటనలు చెప్పక చెబుతున్నాయి.
సంక్షేమం లోనే సర్కార్ బిజీ ..
ఏపీ సర్కార్ ప్రస్తుతం అభివృద్ధి లో వెనుకబడినా సంక్షేమ కార్యక్రమాల్లో మాత్రం దూసుకుపోతుంది. జగన్ పక్కా ప్రణాళికతో ఓటు బ్యాంక్ ను పటిష్టం చేసుకుంటూ పోతున్నారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఇప్పుడు ఎపి లో జగన్ ను కొట్టే వారే లేరన్నది విశ్లేషకుల మాట. అమ్మఒడి మొదలు ఆరోగ్యశ్రీ వరకు జగన్ నవరత్నాలతో అన్ని వర్గాలను చుట్టేస్తున్నారు. ఇక బిసి కార్పొరేషన్ ల ఏర్పాటుతో ఆ వర్గాలకు సంక్షేమ రుచి చూపించడానికి సిద్ధం అయ్యారు. ఇలా తనదైన మార్గంలో వైసిపి సాగిపోతుంది.
కుట్ర బయటపెట్టకపోతే జగన్ కి ఇబ్బందేనా …?
ప్రధాన ప్రతిపక్షానికి అమరావతి లో రాజధాని ఉండాలనే అంశానికి ఇచ్చే ప్రాధాన్యత రాష్ట్రంలో ఇతర సమస్యలపై పెట్టేందుకు సమయం లేదు. మరో పక్క రెండు ప్రధాన పక్షాలకు దూరంగా బిజెపి ద్వితీయ స్థానం లో ఎపి లో ఎదిగేందుకు ప్రయత్నాలు చేసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సర్కార్ కార్యక్రమాలు ప్రజల్లో చర్చకు రాకుండా మత వివాదాలు సృష్ట్టించేందుకు అసాంఘిక శక్తులు కొన్ని రంగంలోకి దిగాయి. వీటి వెనుక ఎదో ఒక పార్టీ హస్తం ఉందా లేదా అన్నది దర్యాప్తు సంస్థలు తొందరగా తేల్చాలిసి వుంది. లేకపోతే ప్రశాంత రాష్ట్రం లో నిత్యం అశాంతి రాజ్యమేలాడమే కాదు వైఎస్ జగన్ క్రిస్టియన్ కనుకే ఇవన్నీ జరుగుతున్నట్లు సాగుతున్న ప్రచారం వైసిపికి గట్టి దెబ్బె తగిలేలా చేసేలా విశ్లేషకులు అంచనా.