అంతా జగన్ మయం.. వీళ్లంతా డమ్మీలే…?
అధికార వైసిపి పార్టీలోని క్యాడర్ కి ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ లు నిత్యం చవిచూస్తున్నారని తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ఇళ్ళ పట్టాల పంపిణీలో [more]
అధికార వైసిపి పార్టీలోని క్యాడర్ కి ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ లు నిత్యం చవిచూస్తున్నారని తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ఇళ్ళ పట్టాల పంపిణీలో [more]
అధికార వైసిపి పార్టీలోని క్యాడర్ కి ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ లు నిత్యం చవిచూస్తున్నారని తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ఇళ్ళ పట్టాల పంపిణీలో క్యాడర్ నైరాశ్యం నీరసం అక్కడ అక్కడ బయట పడుతున్నాయి. లక్షలాది ఇళ్ళ పట్టాల ఎంపిక నుంచి పంపిణీ వరకు వాలంటీర్ల వ్యవస్థే నడిపిస్తూ వచ్చింది. వైసిపి నేతలు పట్టాలు పొందిన వారితో ఫోటోలు దిగడం తప్ప వారికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం చర్చనీయం అయ్యింది. అవినీతి లేకుండా, సిఫార్సులు లేకుండా అర్హులకు సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలన్నది ముఖ్యమంత్రి జగన్ ప్రధాన ఉద్దేశ్యం. ఇది మంచిదే అయినా క్యాడర్ కి కనీస ప్రాధాన్యత లేకుండా పోయిందని తమని గుర్తించే వారే లేకుండా పోయారన్నది అధికారపార్టీలో నిస్తేజం నింపుతుంది.
ధర్మాన సైతం అదే మాట …
ఇళ్లపట్టాల పంపిణీలో పాల్గొన్న ఎపి మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఈ విషయం గుర్తించి తాజాగా సంచలన వ్యాఖ్యలు కొన్ని చేయడం చర్చనీయం అవుతుంది. వాలంటీర్లు తప్పులు చేస్తే వారిని మార్చేస్తామని ఆయన మంత్రి హోదాలో ఆయన కామెంట్ చేశారంటే కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో నొచ్చుకుంటున్న తీరు ఆయన నోటిస్ లో పెట్టడమే అంటున్నారు. వాస్తవానికి వైసిపి నేతలు, కార్యకర్తల హడావిడి తప్ప పట్టాల పంపిణీలో అంతా సర్కార్ యంత్రాంగమే చేసుకుపోతుంది. దబాయింపు తెలిసిన వారు నోరున్న నేతలు మాత్రం ఈ పంపిణీలో దూరి తమ గొప్పను లబ్ది దారుల ముందు ప్రదర్శించుకోవాలిసి వస్తుంది.
అంతా జగన్ నామస్మరణే …
పట్టాలు ఎవరు ఇచ్చారంటే జగన్ ఇచ్చారంటున్నారు తప్ప ఫలానా తమ స్థానిక నాయకుడి కృషితో అది లభించిందని చెప్పేవారే లేకుండా పోయారు. ఇదే కొందరిలో కినుక వహించడానికి కూడా కారణం అవుతుంది. ఇలా అయితే వచ్చే స్థానిక ఎన్నికల్లో తమను నేతలు గా గుర్తించే వారు ఎవరన్నది ద్వితీయ స్థాయి నాయకుల మాట. పైకి చెప్పుకోలేక పోతున్నారు కానీ ఎమ్యెల్యేలు, ఎంపీల పాత్ర కూడా పట్టాల పంపిణీలో ఫోటో షూట్ కి మాత్రమే అన్నది వాస్తవం. పార్టీ అంటే నేనే అని ఏ నాయకుడు రేపటి రోజున తల ఎగురవేయకుండా వైసిపి అధిష్టానం ఈ ఫార్ములా అనుసరిస్తుందని తెలుస్తున్నా ఈ విధానం తో లాభం ఎంతో నష్టం ఎంతో భవిష్యత్తు లో తేలనుంది.