వైసీపీలో వీళ్లను చూస్తే జాలేస్తోందే ?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో ఎంతోమంది నేతలకు పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. జగన్ [more]
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో ఎంతోమంది నేతలకు పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. జగన్ [more]
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో ఎంతోమంది నేతలకు పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. జగన్ హామీలు ఇచ్చిన నేతల లిస్ట్ చూస్తే 60-70 మంది వరకు ఉంది. వీరిలో ఎక్కువ మందికి ఎమ్మెల్సీ హామీలే ఉన్నాయి. 2014లో టీడీపీకి పశ్చిమ గోదావరి జిల్లా కంచుకోటగా నిలిచింది. జిల్లాలో అన్ని స్థానాలు ఆ పార్టీ స్వీప్ చేసేసింది. ఎన్నికల ప్రచారంలో జగన్ జిల్లా అభివృద్ధితో పాటు జిల్లా నేతలకు ఎన్నో హామీలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటి ఈ 20 నెలల్లో నెరవేరలేదు. ఇక చాలా మంది నేతలు రాష్ట్రంలో ఎలా త్యాగం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారో పశ్చిమలోనూ కొందరు నేతలు త్యాగం చేశారు. వీరిలో కొందరు నేతల వైపు జగన్ చూడని పరిస్థితి నెలకొనడంతో పాపం పశ్చిమ వైసీపీ నేతలు అనుకోక తప్పడం లేదు.
తొలి ఎమ్మెల్సీగా….
పశ్చిమలో వైసీపీకి తానున్నానంటూ జగన్ పార్టీ పెట్టినప్పుడే ముందుకు వచ్చిన నేత మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు. ఆ మాటకు వస్తే వైసీపీ పార్టీకే తొట్ట తొలి ఎమ్మెల్సీగా శేషుబాబు రికార్డులకు ఎక్కారు. 2014లో పాలకొల్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన శేషుబాబు జగన్ పాదయాత్రలో సమయంలో పాలకొల్లు సీటు విషయంలోనే విబేధించారు. అప్పటి నుంచి శేషుబాబును జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా శేషుబాబుకు చిన్న పని కూడా కావడం లేదు. శేషుబాబుకు ప్రత్యామ్నాయంగా అదే బీసీ వర్గంలో కవరు శ్రీనివాస్‌ను జగన్ ఎంకరేజ్ చేస్తూ కులాల బ్యాలెన్స్ సరి చేసుకుంటున్నారు.
పాపం.. కొత్త పల్లి…..
ఇక పలు పార్టీలు మారి ఎన్నికలకు ముందే వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి, మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడును పార్టీలోనే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మధ్యలో పెద్ద మనిషిగా కొద్ది రోజులు యాక్ట్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఉండిలో సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజుకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా పదవివచ్చే ఛాన్స్ లేకపోవడంతో పార్టీ అధికారంలో ఉండడంతో ఉండిలో ఆయనే పార్టీకి నాయకత్వం వహిస్తూ సర్దుకుపోతున్నారు. ఇక 2014లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వంక రవీంద్రనాథ్‌కు సైతం గత ఎన్నికల్లో జగన్ నుంచి నామినేటెడ్ హామీ వచ్చింది.
జగన్ పిలుపు కోసం….
ఇప్పుడు ఆయన కూడా జగన్ నుంచి పిలుపు వస్తుందా ? అని ఎదురు చూడడం తప్పా చేసేదేమి లేదు. ఇక ఎమ్మెల్సీ హామీతోనే పార్టీలో చేరారన్న టాక్ ఉన్న ఏలూరు నగర కీలక నేత ఎస్ఎంఆర్ పెదబాబు మళ్లీ మేయర్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నిడదవోలులో 2014లో ఓడిన యువ పారిశ్రామిక వేత్త, జగన్ బెస్ట్ ఫ్రెండ్ చనుమోలు రాజీవ్ కృష్ణ పేరు కూడా సరిగా గుర్తుండని ఓ చిన్న నామినేటెడ్ పదవితో సరిపెట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు పదవులు వస్తాయని అంచనాలు లేని కవురు శ్రీనివాస్‌కు డీసీసీబీ చైర్మన్ ( త్వరలో జడ్పీచైర్మన్ పదవి దక్కే అవకాశం), యడ్ల తాతాజీకి డీసీఎంఎస్ చైర్మన్ పదవి దక్కాయి. ఇక పై నేతలు కరుగుతున్న కాలాన్ని చూస్తూ ఊసురోమనడం తప్ప చేసేదేం లేదు.