ఆ ముగ్గురికి జగన్ వార్నింగ్.. క్షమాపణలు..ఉపేక్షణలు ఉండవ్
ఏపీ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల వేళ సీఎం జగన్ చాలా మంది వైసీపీ నేతలకు అగ్నిపరీక్ష పెట్టేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉన్నా కూడా చాలా [more]
ఏపీ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల వేళ సీఎం జగన్ చాలా మంది వైసీపీ నేతలకు అగ్నిపరీక్ష పెట్టేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉన్నా కూడా చాలా [more]
ఏపీ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల వేళ సీఎం జగన్ చాలా మంది వైసీపీ నేతలకు అగ్నిపరీక్ష పెట్టేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉన్నా కూడా చాలా మంది నేతలకు లోపల మాత్రం ఎన్నికల ఫలితాలు ఎలా ? ఉంటాయో ? అని ఆందోళన మాత్రం ఉంది. కొందరు మంత్రులు అయితే టెన్షన్.. టెన్షన్‌గానే రోజులు వెళ్లదీస్తున్నారట. అన్ని కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలో పడాలని జగన్ ఇప్పటికే సీరియస్‌గా ఆదేశాలు జారీ చేసేశారు. ఇక నెల్లూరు, ఏలూరు, ఒంగోలు, విశాఖ, విజయవాడ కార్పొరేషన్లలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన కార్పొరేషన్ల సంగతి ఎలా ? ఉన్నా అమరావతి పరిధిలో ఉన్న గుంటూరు, విజయవాడపైనే టీడీపీ మెయిన్‌గా కాన్సంట్రేషన్ చేస్తోంది.
తేడా రాకుండా…..
రాజధాని వికేంద్రీకరణ నేపథ్యంలో ఈ రెండు కార్పొరేషన్లలో ఓడితే వైసీపీ పనైపోయిందన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అవుతుంది. రాజధాని వికేంద్రీకరణ ప్రభావం ఇక్కడ లేదని ఫ్రూవ్ చేయాలంటే ఈ రెండు కార్పొరేషన్లలో వైసీపీ ఖచ్చితంగా గెలిచి తీరాలి. అందుకే ఇక్కడ నేతలకు జగన్ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్‌లు ఇచ్చేశారు. ఈ రిజల్ట్ తేడా వస్తే చాలా మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు మారిపోతాయ్.. మారిపోతాయ్ అనడం కంటే జగన్ మార్చేస్తారనే చెప్పాలి. విజయవాడ కార్పొరేషన్ బాధ్యతలను జగన్ ముగ్గురు కీలక నేతలపై పెట్టేశారు. నగరంలో మూడు నియోజకవర్గాల్లో పార్టీ నేతలుగా ఉన్న వారు తమ నియోజకవర్గాల్లోన్ని డివిజన్లలో పార్టీని గెలిపించుకోవాలని ఈ విషయంలో క్షమాపణలు, ఉపేక్షణలు ఉండవని సీరియస్‌గానే చెప్పేశారట.
మంత్రిగారికి ఇబ్బందే….
మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పశ్చిమంలో మంత్రి వెల్లంపల్లి, సెంట్రల్ లో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఎమ్మెల్యేలు. తూర్పులో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నా… అక్కడ దేవినేని అవినాష్‌ను పార్టీలోకి తీసుకుని ఇన్చార్జ్ ఇవ్వడంతో అక్కడ కూడా వైసీపీ స్ట్రాంగ్ అయ్యింది. వెస్ట్ నియోజకవర్గంలో డివిజన్ల ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా లేదా ఓవరాల్ కార్పొరేషన్ ఫలితం రివర్స్ అయినా జగన్ నిర్దాక్షిణ్యంగా వెల్లంపల్లిని తప్పించేస్తారని పార్టీ వర్గాలే అంటున్నాయి.
గెలిస్తేనే లాబీయింగ్ కు ఛాన్స్…..
వెల్లంపల్లి పనితీరు విషయంలో జగన్ ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇప్పుడు బెజవాడ కార్పొరేషన్ గెలిస్తే వెల్లంపల్లి ఏదైనా లాబీయింగ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. లేకపోతే వేరే ఆప్షనే ఆయనకు ఉండదు. ఇక మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నా మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. కనీసం ఆయన ప్రాపబుల్స్‌లో ఉండాలంటే ముందుగా సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లను వైసీపీ ఖాతాలో స్వీప్ చేయించాలి… కాని అక్కడ బొండా ఉమా దూకుడును తట్టుకుని ఆయన వన్ సైడ్ చేయడం కష్టంగానే కనిపిస్తోంది.
అవినాష్ భవిష్యత్ ….?
ఇక కీలకమైన తూర్పులో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. గత పదేళ్లలో టీడీపీ ఇక్కడ స్ట్రాంగ్‌గానే ఉంది. అవినాష్ వైసీపీలోకి వచ్చి పార్టీ ఇన్చార్జ్ అయ్యాక వైసీపీ పుంజుకుంది. అయితే ఇక్కడ రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు తప్పదు. ఇక్కడ ఫలితాలు, గట్టి పోటీ ఇచ్చే దానిపైనే అవినాష్‌కు జగన్ దగ్గర ఉండే పలుకుబడి రేంజ్ మారడం… వచ్చే ఎన్నికల్లో తూర్పు సీటు ఇచ్చే అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్ష నగరంలో టీడీపీలోనే గ్రూపుల గోల ఎక్కువుగా ఉంది. దీనిని వైసీపీ ఎలా ఉపయోగించుకుంటుందో ? చూడాలి.