ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు జగన్ మార్క్ వార్నింగ్ ?
ఒక్కటి మాత్రం నిజం… జగన్ అంటే నిన్నమొన్నటి వరకు ఓ మోనార్క్. జగన్ మాట జవదాటేందుకు కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సాహసించేవారు కాదు. క్లాస్ రూంలో [more]
ఒక్కటి మాత్రం నిజం… జగన్ అంటే నిన్నమొన్నటి వరకు ఓ మోనార్క్. జగన్ మాట జవదాటేందుకు కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సాహసించేవారు కాదు. క్లాస్ రూంలో [more]
ఒక్కటి మాత్రం నిజం… జగన్ అంటే నిన్నమొన్నటి వరకు ఓ మోనార్క్. జగన్ మాట జవదాటేందుకు కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సాహసించేవారు కాదు. క్లాస్ రూంలో మాస్టారు అంటే స్టూడెంట్స్‌కు ఎంత భయమో ఏపీలో అధికార వైసీపీలోనూ పార్టీ అధినేత అంటే అంతే భయంగా ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ నిబంధన తప్పే అనిపిస్తోంది. జగన్ మితిమీరిన కంట్రోల్‌ను చాలా మంది ఎమ్మెల్యేలు ధిక్కరించేస్తున్నారు. ఇతర విషయాల సంగతేమో గాని తమ తమ నియోజకవర్గాలకు వారు సామంత రాజుల్లో ప్రవర్తిస్తున్నారు. మహా అయితే ఏమవుతుంది? వచ్చే ఎన్నికల నాటికి రాజెవరో? రెడ్డెవరో? టిక్కెట్ ఇస్తే ఇస్తారు ఇవ్వకపోతే ఇవ్వరు.. అధికారం ఉంది.. మాకు పదవి ఉంది. ఇప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుందాం ? అన్న బలమైన నిర్ణయానికి వచ్చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని….
అందుకే తమపై పదే పదే ఫిర్యాదులు వెళుతున్నా… అధిష్టానం నివేదికలో మైనస్ మార్కులు ఉన్నా… జిల్లా పరిశీలకులు హెచ్చిరికలు చేస్తున్నా వాటన్నింటిని భేఖాతార్ చేస్తూ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టుగా తమ పని తాము చేసుకు పోతున్నారు. 13 జిల్లాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు ఈ భేఖాతార్ లిస్టులోకి వచ్చేసినా గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అటు అధిష్టానాన్ని, ఇటు పార్టీ పరిశీలకుల ఆదేశాలను భేఖాతార్ చేస్తూ నియోజకవర్గంలో పాలన కొనసాగిస్తున్నారట. రెండు పక్క పక్క నియోజకవర్గాలకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో ఒక ఎమ్మెల్యే ఎన్నికలకు 20 రోజుల ముందే అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు.
పంచాయతీ ఎన్నికల్లోనూ…
టీడీపీకి చెందిన ఓ దిగ్గజ నేతను ఓడించిన సదరు ఎమ్మెల్యే ఆ దిగ్గజ నేతతోనే చేతులు కలిపి అన్నింట్లోనూ మిలాఖత్ అయ్యి తన అవినీతిపై కనీసం ప్రతిపక్షాలు కూడా నోరెత్తకుండా కొత్త రాజకీయం ప్రారంభించారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. తాజా పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గాన్ని వ్యతిరేకిస్తూ పలు పంచాయతీల్లో రెబల్ వర్గాలు ఈ నియోజకవర్గంలో భారీగా పోటీ చేశాయి. అటు ప్రతిపక్షంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేకు, సదరు ఎమ్మెల్యేకు సమ్మతమైన గ్రామాల్లో మాత్రమే ఏకగ్రీవాలు జరిగాయి. వచ్చే ఎన్నికల్లో సీటు రాకపోయినా నాకు వచ్చిన నష్టం లేదన్నట్టుగా ఆయన అవినీతే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు.
లేక లేక వచ్చిన అవకాశాన్ని…
ఇక గతంలో పలుసార్లు ఎమ్మెల్యేగా స్వల్ప తేడాతో ఓడిన పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే గత ఎన్నికల్లోనే తొలిసారి గెలిచారు. సదురు ఎమ్మెల్యే సైతం గత ఎన్నికల్లో ఓడి భారీగా నష్టపోవడంతో ఇప్పుడు అందినకాడకు అందినట్టు దోచేస్తున్నారట. చివరకు ఈ ప్రభావం స్థానిక ఎన్నికల్లో పడి సర్పంచ్‌గా పోటీ చేసిన ఎమ్మెల్యే కుటుంబీకులే ఓడిపోయారు. దీనిని బట్టే సదరు ఎమ్మెల్యేపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సొంత పార్టీ కేడర్ అయితే ఈ సారి సదరు ఎమ్మెల్యేకే సీటు ఇస్తే తాము ఓడిస్తామని శపథాలు చేస్తోంది. జిల్లా పార్టీ పరిశీలకులకు సైతం ఈ ఇద్దరిపై ఎన్నిసార్లు సొంత పార్టీ నేతలు ఫిర్యాదులు చేసినా వారు ఏ మాత్రం ఆగడం లేదు. సీఎం జగన్ మాటగా వైవి. సుబ్బారెడ్డే వీరికి సీరియస్‌గా ఆదేశాలు జారీ చేసినా వీరు పట్టించుకోవడం లేదు. వీరిపై సొంత పార్టీ వాళ్లు అధిష్టానానికి నివేదికలు పంపడం.. వారు వార్నింగ్‌లు ఇవ్వడం.. వీరు లైట్ తీస్కోవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే పరిస్థితి చేయిదాటినందున వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఓడే ఫస్ట్ రెండు సీట్లు ఈ ఎమ్మెల్యేలవే ఉంటాయంటున్నారు.