మళ్లీ పీకేదే పెత్తనమట.. జగన్ డిసైడ్ చేశారట
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈసారి [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈసారి [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈసారి ఎన్నికలకు కూడా ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జగన్ రెండోసారి అధికారంలోకి రావాలని గట్టిగా భావిస్తున్నారు. అందుకోసం మరోసారి ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాలన్నది ఆయన నిర్ణయంగా ఉంది.
మరో మూడేళ్లున్నా……
ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. అంటే ఇంకా మూడేళ్ల సమయం ఉంది. తొలి రెండేళ్లు జగన్ సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. వాటిని కొనసాగిస్తూనే మిగిలిన మూడేళ్లలో అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలనుకుంటున్నారు. దీంతో పాటు పార్టీ నేతలకు పదవుల పందేరం కూడా పూర్తి చేయనున్నారు. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉందన్నది జగన్ అభిప్రాయంగా ఉంది.
ఎమ్మెల్యేలపై అసంతృప్తి…..
అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపికను కూడా ప్రశాంత్ కిషోర్ టీం కు అప్పగించాలని జగన్ భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. రెండేళ్లలో దాదాపు 70 మందికిపైగా ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నట్లు ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా తెలియడంతో జగన్ ప్రశాంత్ కిషోర్ కు మరోసారి వ్యూహకర్తగా బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్థానికంగా పార్టీలో విభేదాలు, ప్రజల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఈ నిర్ణయానికి కారణమంటున్నారు.
గత ఎన్నికలలోనూ….
గత ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికలో ప్రశాంత్ కిషోర్ కీలక భూమిక పోషించారు. ఆయన సూచించిన వారికే 90 శాతం టిక్కెట్లను జగన్ కేటాయించారు. వారిలో వంద శాతం అభ్యర్థులు గత ఎన్నికల్లో విజయం సాధించారు. అదే ఫార్ములాతో ఈసారి కూడా వెళ్లాలని, ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రశాంత్ కిషోర్ టీంను రెండేళ్ల ముందు రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈసారి కూడా అభ్యర్థుల ఎంపికలో ప్రశాంత్ కిషోర్ టీం కీలక పాత్ర పోషించనుంది.