కమ్మలకు జగన్ సైడ్ చేస్తున్నారా? అందుకే ఇలా?
ఏపీలో పుర పోరు ముగిసింది. మొత్తం 12 కార్పొరేషన్లు, 75 నగర పాలక సంస్థలు, మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలను 78 % [more]
ఏపీలో పుర పోరు ముగిసింది. మొత్తం 12 కార్పొరేషన్లు, 75 నగర పాలక సంస్థలు, మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలను 78 % [more]
ఏపీలో పుర పోరు ముగిసింది. మొత్తం 12 కార్పొరేషన్లు, 75 నగర పాలక సంస్థలు, మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలను 78 % మేయర్, డిప్యూటీ మేయర్లు, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు మహిళలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారని వైసీపీ వాళ్లు అధికారికంగా ప్రకటనలు చేస్తున్నారు. ఓసీలకు కేవలం 26 % పదవులు మాత్రమే కట్టబెట్టారనే లెక్కలు వస్తున్నాయి. ఇక ముందు నుంచి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగన్ కమ్మ సామాజిక వర్గానికి ఈ పదవుల్లో ఎక్కువ ప్రయార్టీ ఇస్తారా ? ఇవ్వరా ? అన్నదానిపై అనేకానేక చర్చలు జరిగాయి. పైగా రాజధాని ఏరియాలో అత్యంత ప్రతిష్టాత్మకం అయిన రెండు మేయర్ పదవులు( గుంటూరు, విజయవాడ) జనరల్ కావడంతో రెండిట్లో ఒకటి అయినా కమ్మలకు ఖచ్చితంగా ఇస్తారని రెండు జిల్లాలకు చెందిన స్థానిక వైసీపీ నేతలే అనుకున్నారు. అయితే రెండు చోట్ల కూడా జగన్ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు.
పక్కన పెడుతున్నారా?
జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని సైడ్ చేసేస్తున్నారన్న విమర్శలు ఎక్కువుగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికలకు ముందు నుంచే ఈ వర్గంపై జగన్ తో పాటు వైసీపీ నేతలు కూడా ఎక్కువుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా ఈ వర్గం ఎక్కువుగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలో మేయర్, మునిసిపల్ చైర్మన్ పదవుల విషయంలో అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారనుకున్నారు. అయితే గుంటూరు మేయర్ పదవిని కాపు వర్గానికి చెందిన కావటి మనోహర్ నాయుడుకు ఇవ్వగా, అనూహ్యంగా జనరల్ మహిళకు రిజర్వ్ అయిన విజయవాడ మేయర్ పదవిని బీసీ వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మికి ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 కార్పొరేషన్లలో 8 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు.
రెండు మున్సిపాలిటీల్లోనే…..
కమ్మ సామాజిక వర్గానికి ఒక్క మేయర్ పదవి కూడా జగన్ ఇవ్వలేదు. ఇక ఎన్నికలు జరిగిన 75 పట్టణాల్లో వైసీపీ 74 చోట్ల పాగా వేసింది. తాడిపత్రి మినహా మిగిలిన 74 చోట్ల వైసీపీ రెండే రెండు చోట్ల మాత్రమే కమ్మ నేతలకు మునిసిపల్ చైర్మన్ పదవులు ఇచ్చింది. అవి రెండు కూడా పూర్తిగా మున్సిపాల్టీలు కూడా కాదు. నగర పంచాయతీలు మాత్రమే. ఈ రెండు పదవులు కృష్ణా జిల్లాకే కట్టబెట్టారు. నందిగామ నగర పంచాయతీ చైర్మన్గా మండవ వరలక్ష్మికి, ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్గా వల్లభనేని సత్యానారాయణలకు మాత్రమే అవకాశం దక్కింది. ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తోన్న పెనమలూరు నియోజకవర్గంలో ఉంది. ఇక వైసీపీ నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్సీ కూడా కమ్మలకు ఇవ్వలేదు. జగన్ హామీలు ఇచ్చిన కమ్మ నేతలు కూడా ఆశల పల్లకీలోనే ఉన్నారు.