జగన్ బెంగంతా అదేనట.. ఎప్పటికైనా తీరుతుందా?
చంద్రబాబుది అండర్ కరెంట్ పాలిటిక్స్. బయటకు కనిపించకుండా చాప కింద నీరులా చేయాల్సింది చేస్తారు. అదే జగన్ ని తీసుకుంటే ముక్కు సూటిగా రాజకీయం ఉంటుంది. ఇపుడు [more]
చంద్రబాబుది అండర్ కరెంట్ పాలిటిక్స్. బయటకు కనిపించకుండా చాప కింద నీరులా చేయాల్సింది చేస్తారు. అదే జగన్ ని తీసుకుంటే ముక్కు సూటిగా రాజకీయం ఉంటుంది. ఇపుడు [more]
చంద్రబాబుది అండర్ కరెంట్ పాలిటిక్స్. బయటకు కనిపించకుండా చాప కింద నీరులా చేయాల్సింది చేస్తారు. అదే జగన్ ని తీసుకుంటే ముక్కు సూటిగా రాజకీయం ఉంటుంది. ఇపుడు జగన్ చేస్తున్న రాజకీయం చూసిన వారదరికీ కలిగే ఒకే ఒక్క డౌట్ చంద్రబాబుని జగన్ ఏనాటికైనా అరెస్ట్ చేయిస్తారు అని. తన ఫస్ట్ టెర్మ్ పదవీ కాలం ముగిసే లోపుగా చంద్రబాబుకు జైలు రుచి జగన్ చూపించి తీరుతారు అని. నిజంగా జనాలు అనుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. జగన్ వచ్చిన దగ్గర నుంచి బాబు గత పరిపాలన మీద ఎడతెరిపి లేకుండా విచారణల మీద విచారణలు జరిపిస్తున్నారు.
స్టేల బాబు …..
బాబుకు అదే ధైర్యం. అదే నిబ్బరం. బాబు మీద జగన్ సర్కార్ మాత్రమే కేసులు పెట్టలేదు. అంతకు ముందు వైఎస్సార్ హయాంలో కూడా కేసులు పెట్టారు. దానికి ముందు కొన్ని ప్రైవేట్ కేసులు కూడా పెట్టారు. మరి ఆయన అత్త లక్ష్మీ పార్వతి పెట్టిన కేసులు కానీ, కేసీయార్ సర్కార్ పెట్టిన ఓటుకు నోటు కేసులు కానీ ఇపుడు ఏ దశలో ఉన్నాయి అంటే ఎవరూ చెప్పలేరు. ఒక లెక్క ప్రకారం బాబు 18 నుంచి ఇరవై దాకా స్టేలు తెచ్చుకున్నాడు అని అంటారు. అందువల్లనే ఆయన్ని ఇపుడు వైసీపీ మంత్రి కొడాలి నాని స్టేల బాబు అని ఎకసెక్కమాడుతున్నారు.
నెరవేరదా…?
తాను పదహారు నెలల పాటు జైలులో ఉన్నాను కాబట్టి కనీసం పదహారు రోజులు అయినా బాబుని జైలులో ఉంచాలన్నది జగన్ పంతం. కానీ అది ఎప్పటికీ నెరవేరదు అని మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. బాబు మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆయన నిప్పే అంటున్నారు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు. బాబు మీద ఆధారాలు కేసులు పెడితే స్టేలు తెచ్చుకోకుండా ఎలా ఉంటామని తమ్ముళ్ళు గర్జిస్తున్నారు. జగన్ అవినీతి మీద ఆధారాలు ఉండబట్టే కేసులు పడ్డాయి. బాబు విషయంలో ఒక్క ఆరోపణను అయినా నిరూపించగలరా అంటూ తమ్ముళ్ళు సూటిగానే అడుగుతున్నారు.
అపుడే సార్ధకత ….
మహాకవి శ్రీనాధుడు ఒక పద్యంలో అంటాడు. శత్రువు మదిలో మెదులుతూంటే ఎంతో సౌకర్యవంతమైన పానుపు ఉన్నా కేనులకు నిద్ర పడుతుందా అని. అలాగే ఇపుడు జగన్ సీఎం గా ఉన్నారు. 151 సీట్లు వచ్చాయి. ఎక్కడ ఎన్నిక జరిగినా జనాలు ఆయనకే ఓటేసి జేజేలు పలుకుతున్నారు. ఇన్ని సంతోషాలు ఉన్నా కూడా బాబు మీద ఒక్క కేసు కూడా నిరూపించలేకపోతున్నామే అన్న బాధ బెంగ జగన్ కి ఉన్నాయని చెబుతారు. మొత్తానికి జగన్ తన పదవీకాలాన్ని పూర్తి చేసేలోగానైనా బాబు మీద కేసు పెట్టించి అరెస్ట్ చేయించగలరా అన్న చర్చ అయితే అంతటా ఉంది. అలా కనుక చేస్తేనే ఆయన సాధించిన విజయాలకూ, అధిరోహించిన పదవులకూ సార్ధకత అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. మరి చూడాలి జగన్ తాను అనుకున్న అన్ని టార్గెట్లని రీచ్ అయిన జగన్ బాబు విషయంలో విజేత అవుతారో లేదో.