జగన్‌కు ఇప్పుడు కనగరాజ్ గుర్తు రాలేదా ?
ఏపీ ప్రభుత్వం కొత్త ఎస్ఈసీ కోసం ముగ్గురు విశ్రాంత అధికారుల పేర్లను గవర్నర్‌కు పంపింది. ఈ పేర్లు చూసిన వారంతా షాక్ అయ్యారు. జగన్ గతేడాది స్థానిక [more]
ఏపీ ప్రభుత్వం కొత్త ఎస్ఈసీ కోసం ముగ్గురు విశ్రాంత అధికారుల పేర్లను గవర్నర్‌కు పంపింది. ఈ పేర్లు చూసిన వారంతా షాక్ అయ్యారు. జగన్ గతేడాది స్థానిక [more]
ఏపీ ప్రభుత్వం కొత్త ఎస్ఈసీ కోసం ముగ్గురు విశ్రాంత అధికారుల పేర్లను గవర్నర్‌కు పంపింది. ఈ పేర్లు చూసిన వారంతా షాక్ అయ్యారు. జగన్ గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల వివాదం జరిగినప్పుడు అప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించి తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్‌ను ఏపీ ఎన్నికల అధికారిగా నియమించారు. ఈ నియామకమే పెద్ద సంచలనం. క్రిస్టియన్ అని కనగరాజ్‌పై విపక్షాలు విమర్శలు చేసినా… ఎస్సీ వర్గానికి చెందిన ఆయనకు కీలకమైన పోస్టు కట్టబెట్టడం విపక్షాలకు నచ్చకే ఆయనపై విమర్శలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలకు ప్రభుత్వం ధీటుగా కౌంటర్లు ఇచ్చింది. అయితే ఈ పోరులో నిమ్మగడ్డ సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో కనగరాజ్ ఎన్నికల అధికారి పదవి మూడునాళ్ల ముచ్చటే అయ్యింది.
ఇప్పుడు ఆ పేరే….
ఇక ఈ నెల 31 నిమ్మగడ్డ పదవీ విరమణ చేస్తుండడంతో కొత్త ఎన్నికల అధికారిగా ఎవరు వస్తారన్నది సస్పెన్స్‌గానే ఉంది. ప్రభుత్వం మాత్రం గవర్నర్‌కు పంపిన పేర్లలో కనగరాజ్ పేరు లేదు. కనగరాజ్ ను గతేడాది తన అవసరానికి వాడుకున్న జగన్ ఇప్పుడు మాత్రం పూర్తిగా పక్కన పెట్టేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు మాత్రం సాహ్నీ లేదా శామ్యూల్ వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతేడాది కనగరాజ్‌ను ఆఘమేఘాల మీద తీసుకువచ్చి పదవిలో కూర్చోపెట్టినా ఆయన ముచ్చట తీరకుండానే తిగిపోవాల్సి వచ్చింది. అప్పుడే కనగరాజ్‌కు జగన్ తర్వాత న్యాయం చేస్తారనుకున్నా… ఇప్పుడు కనీసం ఆయన పేరును కూడా ప్రపోజల్స్లోకి కూడా తీసుకోకపోవడం షాకే అనుకోవాలి.
తిరిగి వారివైపే…..
నిమ్మగడ్డను తొలగించేముందు ఆర్డినెన్స్ తెచ్చిన జగన్ ఆ టైంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీగా విశ్రాంత అధికారులను నియమిస్తే అప్పటి వరకు వారు రాజకీయ నాయకుల దగ్గర పని చేసి ఉన్న క్రమంలో వారు ఆ నేతల మాటలే వింటారని చెప్పారు. అదే న్యాయమూర్తిని నియమిస్తే అలాంటి పక్షపాతాలకు తావు ఉండదని జగన్ చెప్పారు. అయితే యేడాదికే జగన్ అటు తన అవసరానికి వాడుకున్న కనగరాజ్‌ను మర్చిపోయారు.. ఇటు తాను అన్న మాటను కూడా మర్చిపోయి.. తిరిగి విశ్రాంత అధికారి వైపే మొగ్గు చూపుతున్నారు.
ఆ డైలాగుకు ఎసరు…..
ఇక నిన్నమొన్నటి వరకు పదవుల్లో పనిచేసి రిటైర్ అయిన వారు.. ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారిని జగన్ ఇప్పుడు ఎస్ఈసీగా నియమించడంలో ఆంతర్యం ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. జగన్ చెప్పే మాటలకు… చేసే పనులకు చాలా తేడా ఉందనే ఆయన చర్యల ద్వారా అర్థమవుతున్నాయి. ఎంతో వివాదం రేపిన శాసనమండలి రద్దు విషయంలోనే కాదు… అటు ప్రత్యేక హోదా విషయంలోనూ జగన్ ముందు చేసిన హడావిడిని పూర్తిగా మర్చిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జగన్ మాట మీద నిలబడే డైలాగ్‌కు ఎసరు రావడం ఖాయమే.