పరిషత్ ఎన్నికలకు తొందర.. జగన్ వ్యూహం ఏంటి ?
రాష్ట్రంలో పెండింగులో ఉన్న జిల్లా పరిషత్(జెడ్పీటీసీ), మండల పరిషత్(ఎంపీటీసీ) ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ చాలా తొందరపడుతున్నారు. వాస్తవానికి గత ఏడాదే నిర్వహించాల్సిన ఈ ఎన్నికలను కరోనా [more]
రాష్ట్రంలో పెండింగులో ఉన్న జిల్లా పరిషత్(జెడ్పీటీసీ), మండల పరిషత్(ఎంపీటీసీ) ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ చాలా తొందరపడుతున్నారు. వాస్తవానికి గత ఏడాదే నిర్వహించాల్సిన ఈ ఎన్నికలను కరోనా [more]
రాష్ట్రంలో పెండింగులో ఉన్న జిల్లా పరిషత్(జెడ్పీటీసీ), మండల పరిషత్(ఎంపీటీసీ) ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ చాలా తొందరపడుతున్నారు. వాస్తవానికి గత ఏడాదే నిర్వహించాల్సిన ఈ ఎన్నికలను కరోనా నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. దీంతో ఇది వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల నిర్వహించిన పంచాయతీ, కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలు ముగియగానే.. పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించాలని వైసీపీ నుంచి ఒత్తిడి వచ్చింది. కానీ, తాను ఎన్నికలను నిర్వహించలేనంటూ.. తాజాగా రిటైరైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పరిషత్ ఎన్నికల నిర్వహణ నుంచి తప్పుకొన్నారు.
విపక్షాలు కోలుకోక ముందే?
దీంతో నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్నారు.. వచ్చీ రావడంతోనే ఆమె పరిషత్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న సాహ్ని.. ఇంత హడావుడిగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ స్థానిక ఎన్నికల విజయంతో ఉంది. దీంతో ఇప్పుడు ప్రజల్లో ఉన్న రెపోను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇదే చక్కని అవకాశం. అదేసమయంలో మరోవైపు ప్రతిపక్షాలు ఘోర పరాజయంతో నిరుత్సాహంలో ఉన్నాయి. అవి కోలుకుని.. పుంజుకోక ముందుగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించేయాలని జగన్ భావిస్తున్నారు.
తిరుపతికే వారిని పరిమితం చేసి…
ఒక్క జగన్ అనేకాదు.. పార్టీలోని సీనియర్లు కూడా ఇదే తరహా ఆలోచనతో ఉన్నారు. ఇంకోవైపు తిరుపతి పోరులో ప్రతిపక్షాలు బిజీగా ఉన్నాయి. దీంతో వాటికి పరిషత్ ఎన్నికలపై దృష్టి పెట్టడమా? ఇటు తిరుపతి చూసుకోవడమా? అనే సందిగ్ధమైన పరిస్తితి వస్తుంది. ఈ మొత్తం తమకు అనుకూలంగా మారుతుందని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సో.. మొత్తంగా పరిషత్ ఎన్నికలను ఉన్నట్టుండి నిర్వహించేందుకు పక్కా వ్యూహంతో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం వేడిమీదే.. లాగించేయాలని.. పార్టీని బలోపేతం చేసుకోవాలని సీఎం జగన్ భావించారు. అలాగే నోటిఫికేషన్ విడుదలయింది.