ఆ మహిళా మంత్రులపై సీక్రెట్ రిపోర్ట్స్ …మామూలుగా లేరుగా?
“అవినీతి రహిత రాష్ట్రం ఏర్పాటు చేయడం మా లక్ష్యం!.. అందుకే ఎక్కడ అవినీతి జరిగినా మాకు వెంటనే సందేశం పంపండి చర్యలు తీసుకుంటాం“ అని.. ఎన్నికల అనంతరం.. [more]
“అవినీతి రహిత రాష్ట్రం ఏర్పాటు చేయడం మా లక్ష్యం!.. అందుకే ఎక్కడ అవినీతి జరిగినా మాకు వెంటనే సందేశం పంపండి చర్యలు తీసుకుంటాం“ అని.. ఎన్నికల అనంతరం.. [more]
“అవినీతి రహిత రాష్ట్రం ఏర్పాటు చేయడం మా లక్ష్యం!.. అందుకే ఎక్కడ అవినీతి జరిగినా మాకు వెంటనే సందేశం పంపండి చర్యలు తీసుకుంటాం“ అని.. ఎన్నికల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం జగన్ పదే పదే చెప్పిన, చెబుతున్న మాట. అయితే.. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అనేక రూపాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే.. వాటన్నింటినీ.. కూడా రాజకీయ విమర్శలుగా కొట్టి పారేశారు పార్టీ అధినేత. కానీ, ఇప్పుడు సీఎం జగనే తెప్పించుకున్న కొన్ని నివేదికల్లో ఇద్దరు మహిళా మంత్రుల ఇలాకాల్లో అవినీతి కంపుకొడుతోందని తేలడంతో ఏం చేయాలా? అని ఆయన ఆలోచిస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కుటుంబసభ్యుల పెత్తనంతో….
ఈ ఇద్దరు మంత్రుల్లో ఒకరు కోస్తా ప్రాంతానికి చెందిన వారు కాగా.. మరొకరు గోదావరి జిల్లాలకు చెందిన వారుగా చెప్పుకొంటున్నారు. కీలకమైన శాఖలను చూస్తున్న వీరిద్దరూ కూడా తమ కుటుంబాలను కట్టడి చేయలేక పోతున్నారని అంటున్నారు. నిజానికి వీరిద్దరూ నిజాయితీ పరులుగానే ఉన్నారు.కానీ, వారి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం కార్యాలయాల్లోకి చేరుకుని.. ప్రతి పనికీ ఇంతని రేటు కడుతున్నారని.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓ మంత్రిగారి భర్త.. “ఇవన్నీ మామూలే“ అని మీడియాతో కూడా అనేస్తున్నారట. ఈ మేరకు జగన్ కు నివేదిక అందిందట.
రహస్య నివేదికల ద్వారా..?
ఈ నేపథ్యంలో ఆ నోటా ఈనోటా.. ఈ అవినీతి బాగోతం గురించి. ఏకంగా సీఎంవోకు ఉప్పందంది.. దీంతో జగన్ ఏకంగా వీరిపై రహస్య నివేదికలు తెప్పించుకున్నారు. వీటిలో మంత్రుల బంధువులు, వారి ఇంట్లో వారు ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నా రు? అనే విషయాలు కూలంకషంగా ఉన్నాయని సమాచారం. నిజానికి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ.. అవినీతికి పాల్పడితే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చేది లేదని చెప్పారు జగన్. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని అంటున్నారు.
తప్పించేయాలని…..
అయినప్పటికీ.. ఒకరిద్దరు మంత్రులు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా మహిళా మంత్రులు కూడా చేతులు కడుక్కోవడం.. సంచలనం సృష్టిస్తోంది. వీరిలో ఒక మంత్రిని తప్పించేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న జగన్ మరో కీలక మహిళా మంత్రి విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.