కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. ఈ రెండేళ్లలో జగన్ ప్రజలనే ఎక్కువగా నమ్ముకున్నారు. న్యాయస్థానాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా కాలమే సమాధానం చెబుతుందన్న [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. ఈ రెండేళ్లలో జగన్ ప్రజలనే ఎక్కువగా నమ్ముకున్నారు. న్యాయస్థానాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా కాలమే సమాధానం చెబుతుందన్న [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. ఈ రెండేళ్లలో జగన్ ప్రజలనే ఎక్కువగా నమ్ముకున్నారు. న్యాయస్థానాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా కాలమే సమాధానం చెబుతుందన్న ధోరణిలో జగన్ ఉన్నారు. ప్రజలెన్నుకున్న ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు అమలు జరగాలి. అయితే న్యాయస్థానాల్లో అడ్డంకులు ఎదురవుతుండటంతో కొన్ని కీలక విషయాల్లో జగన్ వేచి చూసే ధోరణిని అవలంబించడమే బెటర్ అని భావిస్తున్నారు.
ఎన్నికల కమిషనర్ విషయంలోనూ…
ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తప్పించి కనగరాజ్ ను నియమించడం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం. ఆయన వెంటనే న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో కనగరాజ్ స్థానంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించాల్సి వచ్చింది. నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఫలితాల మాట ఎలా ఉన్న న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగలడంతో నిమ్మగడ్డ దిగిపోయిన తర్వాత గాని తాను అనుకున్న వారిని ఎన్నికల కమిషనర్ గా జగన్ నియమించలేకపోయారు.
మూడు రాజధానులు…..
ఇప్పుడు మూడు రాజధానుల అంశమూ అలాగే ఉంది. మూడు రాజధానుల ప్రకటనను జగన్ చేసి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. అయితే ఇందులో ఏ మాత్రం అడుగు ముందుకు పడలేదు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని భావించినా న్యాయస్థానంలో కేసులు నడుస్తుండటంతో అవి ఎప్పటికి తీరుతాయో తెలీదు. దీనిపై మళ్లీ మొదటి నుంచి విచారణ ప్రారంభం కావడంతో సుదీర్ఘకాలం సమయం పట్టే అవకాశముంది.ఇక కర్నూలు న్యాయ రాజధాని పరిస్థితి కూడా అంతే.
జనం మద్దతు వస్తుండటంతో…..
అయితే న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నా, జగన్ తాను అనుకున్నది అమలు పర్చలేకపోయినా జనం మద్దతు మాత్రం జగన్ కు లభిస్తుండటం విశేషం. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఇలా ప్రాంతాలకు అతీతంగా జగన్ పార్టీకి జనం అండగా నిలిచారు. దీంతో జనం తనకు అండగా ఉంటే చాలునని, కాలమే అన్ని నిర్ణయాలను అమలు పరుస్తుందన్న విశ్వాసంలో జగన్ ఉన్నారు. నిజమే జనం అండ ఉన్నంత కాలం న్యాయపరమైన చిక్కులు తాత్కాలికమేనన్నది వాస్తవం.